రాహుల్‌కు చెక్ పెట్టేసిన ఇండియా కూటమి – ప్రధాని అభ్యర్థిగా ఖర్గే !

హిందీ బెల్టులో కాంగ్రెస్ పార్టీ ఒక్క రాష్ట్రం కూడా గెలవకపోవడంతో రాహుల్ గాంధీ పాతాళంలోకి పడిపోయారు. ఇండియా కూటమి నేతలు ఎవరూ రాహుల్ ను ప్రధాని అభ్యర్థిగా చూడటం లేదు. తాజాగా ప్రధాని అభ్యర్థిగా ఖర్గేను ప్రమోట్ చేయాలని ఇతర పార్టీలు ప్రతిపాదించాయి. ఆయన కాంగ్రెస్ అధ్యక్షుడు కావడంతో కాంగ్రెస్ పార్టీ కూడా కాదనలేని పరిస్థితి. చివరికి ఖర్గేను ప్రధాని అభ్యర్థిగా ప్రకటించి ఎన్నికలకు వెళ్తే అవకాశం ఉంది. దీంతో రాహుల్ ఇక జీవితంలో నాయకుడు కానట్లే !

రాహుల్ పై మొదటి నుంచి ఇండియా కూటమి నేతల వ్యతిరేకత

ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఇండియా కూటమి తరఫున ప్రధాని అభ్యర్థిగా ఉండాలని పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి, తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతాబెనర్జీ, ఢిల్లీ ముఖ్యమంత్రి ,ఆప్‌ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రతిపాదించారు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఏ పార్టీని కలుపుకుని వెళ్లే ప్రయత్నం చేయలేదు. సీట్ల సర్దుబాటు చేసుకోలేదు. అందుకే ఈ సారి అలాంటి పరిస్థితి ఉండదని నమ్మించేందుకు సీట్ల సర్దుబాటు కోసం ఏఐసిసి ఈ సమావేశం జరుగుతున్న సమయంలోనే ఓ కమిటీని ప్రకటించింది. అయినా సరే.. రాహుల్ కు నాయకత్వ లక్షణాలు లేవని.. ఆయనకు బదులుగా వేరే వారిని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించాలని డిసైడయ్యారు.

మోదీ బాహుబలి – రాహుల్ తేలిపోతాడని నేతల భావన

బీజేపీ నేతృత్వంలోని అధికార ఎన్డీయేను రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ఓడించడమే లక్ష్యంగా దేశవ్యాప్తంగా ఉన్న 28 ప్రతిపక్ష పార్టీలు ఇండియన్‌ నేషనల్‌ డెవలప్‌మెంటల్‌ ఇంక్లూజివ్‌ అలయెన్స్‌ పేరిట ఒక్కతాటిపైకి వచ్చాయి. . . మీ నాయుకుడు ఎవరని బీజేపీ నేతలు ఎప్పటికప్పుడు వెటకారం చేస్తూనే ఉన్నారు. ఇండియా కూటమిలోని మొత్తం 28 భాగస్వామ్య పక్షాలకుగాను 12 పార్టీలు ఖర్గే ప్రధాని అభ్యర్థిత్వాన్ని బలపర్చినట్లుగా తెలుస్తోంది. అంటే వీరెవరికీ రాహుల్ అంటే నచ్చడం లేదు. మోదీకి ప్రత్యామ్నాయంగా రాహుల్ ను చూపెడితే ప్రజలు ఆదరించరని డిసైడయ్యారు.

సోనియా ఆగ్రహిస్తారని మొహమాటానికి గురైన ఖర్గే

గతంలో ఎన్నికల తర్వాతే ప్రధాని ఎవరో నిర్ణయిస్తామని చెప్పిన మమతాబెనర్జీ ఇప్పుడు ఖర్గేను ప్రతిపాదించడం ఆసక్తికరంగా మారింది. మల్లికార్జున ఖర్గే ప్రధాని అభ్యర్థిత్వంపై సమావేశంలో వ్యతిరేకత రాలేదని … కానీ . ప్రధాని అభ్యర్థిత్వంపై చర్చలు జరిగినా తుది నిర్ణయం తీసుకోలేదని కూటమి నేతలు సమావేశం తర్వాత ప్రకటించారు. . ఓ వైపు ప్రధానమంత్రి నరేంద్రమోదీ తానే ఎన్డీఏ కూటమి తరపున ప్రధాని అభ్యర్థిగా ఉంటారు. ఆయనను ధీటుగా ఎదుర్కోవాలంటే ఖచ్చితంగా.. కూటమి తరపున ప్రధాని అభ్యర్థిని ప్రకటించాలన్న ఆలోచన .. ఎక్కువ మందిలో ఉంది. ఖర్గే గొప్ప ప్రజాదరణ ఉన్న నాయకుడు కాకపోవచ్చు కానీ..రాహుల్ కంటే బెటరనుకుంటున్నారు. కానీ సోనియా ఆగ్రహిస్తారేమోనన్న కారణంగా ఖర్గే.. తనకు అలాంటి ఆశలు లేవని చెప్పుకొచ్చారు.