తెలంగాణలో బీజేపీ సులువుగా గెలిచే నియోజకవర్గాల్లో ఒకటి ఖైరతాబాద్. చింతల రామచంద్రారెడ్డి అక్కడి ప్రదల ఆదరణ చూరగొన్నారు. ఓ సారి ఎమ్మెల్యేగా గెలిచారు. గత ఎన్నికల్లో దానం నాగేందర్ డబ్బు బలంతో వెనుకబడ్డారు. కానీ ఈసారి ఆయన చాలా ముందుగానే గ్రౌండ్ వర్క్ చేశారు. అందుకే గెలుపు ఖాయమనుకుంటున్నారు
కాంగ్రెస్ కంచుకోటే కానీ ఇప్పుడు కాదు !
ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి అతి పెద్ద నియోజకవర్గంగా పేరుండేది. 2009లో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా ఈ నియోజకవర్గం నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలుగా విడిపోయింది. ఖైరతాబాద్ తో పాటు కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, జూబ్లీహిల్స్ గా ఈ నియోజకవర్గాన్ని విభజించారు. అయితే ఖైరతాబాద్ నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి పి.జనార్ధన్ రెడ్డి ఐదు దఫాలుగా విజయం సాధించి అప్పటి కాంగ్రేసులో సీనియర్ నేతగా అప్పటి ప్రభుత్వంలో చక్రం తిప్పారు.. అయన మరణానంతరం 2009లో దానం నాగేందర్ 50, 655 ఓట్లతో గెలుపొందారు. అక్కడితోనే కాంగ్రెస్ పనైపోయింది.
నియోజకవర్గంపై పట్టు కోల్పోయిన దానం నాగేందర్
2014 ఎన్నికల్లో టీడీపీ మద్దతుతో ఈ స్థానం నుండి పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి చింతల రామచంద్రారెడ్డి 53,102 ఓట్లతో విజయం సాధించారు. ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో తాను గెలిస్తే మంత్రి పదవి ఖాయమన్న సెంటిమెంట్ తో ప్రచారం చేసుకుని గెలిచిన మాజీ మంత్రి బీ.ఆర్.ఎస్. అభ్యర్ధి దానం నాగేందర్ 63,068 ఓట్లతో ఎమ్మెల్యేగా గెలిచినా నియోజకవర్గంలో తన పట్టును పూర్తిగా కోల్పోయారు. ఆయనఫై పలు ఆరోపణలు, విమర్శలు స్వంత పార్టీ నేతలే ప్రచారం చేయడం దానంకు మింగుడుపడని వ్యవహారంలా తయారయ్యింది.
బస్తీ ప్రజలతో బీజేపీ అభ్యర్థికి సన్నిహిత సంబంధాలు
తెలంగాణ రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో కంటే ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానిది ఓ ప్రత్యేకమైన స్థానంగా చెపుకోవచ్చు. ఇక్కడ మంత్రులు, ప్రముఖులు, ఉద్యోగులు, సినీ ప్రముఖులతో పాటు బీసీలు, మధ్యతరగతి వర్గాలు, మురికివాడల ప్రజలు నాయకుల గెలుపోటములను తీవ్రంగా ప్రభావితం చేస్తారు. సిట్టింగ్ ఎమ్మెల్యేల కాలనీలు, సెటిలర్లు, సినీ వర్గాలు, మురికివాడల్లోనే ఎక్కువ ఓటర్లు ఉంటారు. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చింతల రామచంద్రారెడ్డి వీరికి అందుబాటులో ఉన్నారు. అందుకే ఈ సారి వారంతా చింతలకు మద్దతిచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.