తెలంగాణ ఎన్నికల ఫలితాల ప్రభావం ఏపీపై పడే అవకాఏశాలు కనిపిస్తున్నాయి. బీజేపీ, జనసేన కూటమి పది నుంచి పన్నెండు స్థానాలు తెలంగాణలో గెలుచుకునే అవకాశం ఉండటంతో ఏపీలోనూ ఈ కాంబిేషన్ కు సానుకూలత పెరిగే అవకాశం ఉంటుంది. ఇప్పటికే జనసేన టీడీపీతో వెళ్తుంది. కానీ రెండు పార్టీల క్యాడర్ మధ్య సత్సంబంధాలు లేవు. కలిసి పని చేయడం అసాధ్యంగా మారింది. పవన్ కల్యాణ్ ఎంతగా చెబుతున్నప్పటికీ కలిసే ఉద్దేశం.. క్యాడర్ లో లేదు.
టీడీపీతో సీట్ల సర్దుబాటు అంత వీజీ కాదు
తెలుగుదేశం పార్టీతో సీట్ల సర్దుబాటు అంత వీజీ కాదని జనసైనికులకు.. జనసేన నేతలకూ తెలుసు. జనసేన ఉంటేనే గెలుస్తామని టీడీపీ నమ్మకం పెట్టుకుంటోంది కానీ ఆ పార్టీకి పదిహేను ఇరవై సీట్లు అయినా ఇస్తారో లేదో స్పష్టత లేదు. చివరికి పొత్తులు వద్దనుకునేలా చేసినా చేస్తారని జనసైనికులు ఆందోళన చెందుతున్నారు. పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్ ఇలాంటి రాజకీయాల్ని అంచనా వేసి ఉంటారని.. వారి దగ్గర ప్లన్ బీ కూడా ఉంటుందని భావిస్తున్నారు.
తెలంగాణలో కాంగ్రెస్ కు మద్దతిచ్చిన టీడీపీ
తెలంగాణలో బీఆర్ఎస్ ను ఓడించేందుకు అంటూ కాంగ్రెస్ పార్టీకి టీడీపీ క్యాడర్ మద్దతిచ్చింది. చంద్రబాబు అనుమతి లేకుండా వారు ఇలా చేసే అవకాశం లేదు. చంద్రబాబు సిగ్నల్స్ ఇచ్చి ఉంటారని భావిస్తున్నారు. అందుకే కాంగ్రెస్ ఏపీలోనూ టీడీపీ వైపు చూసే అవకాశం ఉందని చర్చించుకుంటున్నారు. చంద్రబాబు అవసరం కోసం.. బీజేపీ విషయంలో నెమ్మదిగా ఉంటున్నారు కానీ.. ఆయన దృష్టి కాంగ్రెస్ పైనే ఉందంటున్నారు. అయితే జనసేన పార్టీ బీజేపీతో ఉంది. కాంగ్రెస్ తో వెళ్లే అవకాశం లేదు. టీడీపీ కాంగ్రెస్ కు దగ్గరయితే… జనసేన , బీజేపీ కూటమి ఏపీలో పోటీ చేసే అవకాశం ఉంది.
ఫలితాలను బట్టే తర్వాత పరిణామాలు
తెలంగాణ రాజకీయాలు ఏపీపై ప్రభావితం చూపపించడానికి ఎక్కువ అవకాశం ఉంది. నేరుగా ఎలాంటి ప్రభావం చూపకపోవచ్చు కానీ.. అక్కడ ఫలితాల వల్ల ఏపీ ప్రజల్లోనూ అభిప్రాయాలు మారే అవకాశం ఉంటుంది. మార్చిలోనే ఎన్నికల షెడ్యూల్ వస్తుంది. ఏప్రిల్ లో పోలింగ్ జరుగుతుంది. అందుకే.. ఈ నెలలోనే ఏపీలో కీలక పరిణామాలు చోటు చేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.