కేంద్ర ప్రభుత్వం వార్షిక బడ్జెట్ 2023లో మహిళల కోసం కొత్త స్కీమ్ తీసుకొచ్చింది. ఈ మహిళా సమ్మాన్ సేవింగ్స్ స్కీమ్‌లో ఇప్పటికే లక్షల మంది మహిళలు చేరారు. ఇప్పటికే బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఈ పథకం అందుబాటులోకి రాగా తాజాగా మరో ప్రభుత్వం బ్యాంక్ ఈ స్కీమ్ ప్రారంభించింది. అదే కెనరా బ్యాంక్ . ఇంతకీ ఈ ఖాతాను ఎలా తెరవాలి..దీనివల్ల ప్రయోజనాలేంటో తెలుసుకుందా.
మహిళ సాధికారతే లక్ష్యంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం వార్షిక బడ్జెట్ 2023-24లో కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. మహిళల కోసమే ప్రత్యేకంగా మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిపికెట్ స్కీమ్ తీసుకొచ్చింది. ఈ స్కీమ్ మొదట్లో పోస్టాఫీసులో మాత్రమే అందుబాటులో ఉండేది. ఇటీవలే బ్యాంకులకు అవకాశం కల్పించింది కేంద్ర ప్రభుత్వం. దీంతో బ్యాంక్ ఆఫ్ ఇండియా మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ అకౌంట్లు ఆరంభించింది. తాజాగా కెనరా బ్యాంకులో కూడా ఈ స్కీమ్ అందుబాటులోకి వచ్చింది.
మహిళల కోసం సెక్యూర్డ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్
మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్- 2023 అనేది మహిళల కోసం సెక్యూర్డ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్. మైనర్ బాలిక పేరిట వారి పోషకులు కూడా ఈ ఖాతా తీసుకోవచ్చు. మహిళలు ఎన్ని ఖాతాలైనా తీసుకోవచ్చు కానీ పెట్టుబడి పరిమితి ఉంటుంది. ఒక్కో అకౌంట్‌కు మూడు నెలల వ్యవధి ఉండాలి. ఈ పథకం రెండేళ్ల కాల పరిమితి ఉంటుంది. ఇందులో కనీసం నెలకు 1000 నుంచి 200,000 లక్షల వరకు ఇన్వెస్ట్ చేయవచ్చు. ఈ పథకంలో వడ్డీ రేటు 7.5 శాతం స్థిరంగా ఉంటుంది. ప్రతి మూడు నెలలకు ఓసారి వడ్డీ అకౌంట్లో యాడ్ అవుతుంది. పథకాన్ని కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే ముందస్తుగా క్లోజ్ చేయవచ్చు. ఇన్వెస్ట్ చేసిన ఏడాది తర్వాత 40 శాతం మొత్తం పాక్షికంగా విత్ డ్రా చేసుకోవచ్చు.
ఈ స్కీమ్ లో ఎలా చేరాలి
ఈ పథకం 2023, ఏప్రిల్ 1 నుంచి అందుబాటులోకి వచ్చింది. జాతీయ బ్యాంకులు, పోస్టాఫీసులో మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ ఖాతాలను తెరవొచ్చు. దరఖాస్తు పత్రాల్లో వ్యక్తిగత, నామినీ, ఆర్థిక వివరాలు ఇవ్వాలి. సంబంధిత గుర్తింపు పత్రాలను సమర్పించాలి. మీకు నచ్చిన మొత్తాన్ని నగదు లేదా చెక్ రూపంలో జమ చేయాలి. ఆపై మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ పెట్టుబడి పత్రాలను పొందాలి. గడువు తీరాక బ్యాంకు వెళ్తే వడ్డీతో సహా డబ్బులు ఇచ్చేస్తారు.
అట్రాక్ట్ చేస్తోన్న రెండేళ్ల కాలపరిమితి
రెండేళ్ల కాలపరిమితి 7.5 శాతం వడ్డీ ఇస్తుండటంతో ఈ పథకం చాలామందిని ఆకర్షిస్తోంది. ఇందులో గరిష్ఠ పెట్టుబడి రూ.2 లక్షలు పెడితే అంటే నెలకు 8 వేల రూపాయలు వరకూ ఈ స్కీమ్ లో కట్టుకుంటే మొదటి సంవత్సరం 7.5 శాతం చొప్పున రూ.15,000 వడ్డీ జమ అవుతుంది. రెండో ఏడాది అసలు, తొలి ఏడాది వడ్డీ రెండింటికీ కలిపి రూ.16,125 వడ్డీ చెల్లిస్తారు. అంటే రెండేళ్ల తర్వాత మీ అసలు రూ.2లక్షలు, వడ్డీ రూ.31,125 మొత్తంగా రూ.2,31,125 అందుకుంటారు. పీపీఎప్, ఎన్‌పీఎస్, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్, సీనియర్ సిటిజన్స్ డిపాజిట్లతో పోలిస్తే ఇదెంతో బెటర్!