భయానికి చెక్ పెట్టి విజయం దిశగా – ధర్మవరంలో బీజేపీ విశ్వరూపం

ధర్మవరం నియోజకవర్గం అంటే భయపెట్టేవాడిదే బలం అన్నట్లుగా ఉండే నియోజకవర్గం. అక్కడ బీజేపీకి సీటు కేటాయించినపపుడు … సత్యకుమార్ కు టిక్కెట్ ప్రకటించినప్పుడు రిస్క్ తీసుకున్నారేమో అనుకున్నారు. కానీ బీజేపీ యంత్రాంగం మొత్తం రంగంలోకి దిగడంతో సీన్ మారిపోయింది. ఇప్పుడు ఆ సీటులో వైసీపీ ఆశలు వదిలేసుకుంది. పోలింగ్ సరళి చూసి సిట్టింగ్ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి నిరాశకు గురయ్యారు. బయటకు రావడం లేదు.

ప్లాన్డ్ గా పని చేసుకున్న బీజేపీ యంత్రాంగం

ఓ చోట బీజేపీ అభ్యర్థి పోటీ చేస్తున్నారంటే.. ఆ నియోజకవర్గంలో ఉన్న క్యాడర్ మాత్రమే పని చేయరు. పార్టీకి ప్రత్యేకమైన పోల్ మేనేజ్ మెంట్ యంత్రాంగం ఉంటుంది.ప్రతి ఒటర్ ను ప రిగణనలోకి తీసుకుని వారితో ఓటు వేయించుకునేలా యంత్రాంగం ఉంటుంది. ఆ యంత్రాంగానికి పబ్లిసిటీ ఉండదు. సైలెంట్ గా వారి పని వారు చేసుకెళ్లిుపోతారు. ఆ ప్రభావం బీజేపీ నేతలకు మాత్రమే తెలుసు. ఫలితాలు వచ్చిన తర్వాత ప్రత్యర్థి పార్టీల నేతలకు అర్థమవుతుంది.

సంపూర్ణంగా సహకరించిన కూటమి క్యాడర్

కూటమి నేతలు .. క్యాడర్ కూడా సంపూర్ణంగా సహకరించారు. వారి మద్దతుతో బీజేపీ ఎలక్షనీరింగ్ ను పక్కాగా పూర్తి చేసింది. టీడీపీ ఇంచార్జ్ గా ఉన్న పరిటాల శ్రీరామ్ మొత్తం చాలా వరకూ ప్రచారంలో కీలక పాత్ర పోషించారు. జనసేన పార్టీ నేతలు కూడా … పూర్తిగా సహకరించడంతో బీజేపీ అభ్యర్థి ధర్మవరంలో దూసుకెళ్లారు. అందుకే వైసీపీ అభ్యర్థి చివరిలో బెదిరింపులకు పాల్పడినా ఓటర్లు తగ్గలేదు. ధైర్యంగా ఓటింగ్ లో పాల్గొన్నారు.

బీసీ ఈక్వేషన్లతో సూపర్ ప్లస్

ధర్మవరంలో బీసీ ఓటర్లు ఎక్కువ. తొలి సారి గెలుపు రేసులో బీసీ అభ్యర్థి ఉండటంతో అందరూ బీజేపీ వైపుచూశారు. వైసీపీ నుంచి పెద్ద ఎత్తున బీసీ నేతలు బీజేపీలో చేరారు. ఇవన్నీ కలసి వచ్చాయి. రేపు నాలుగో తేదీన ధర్మవరం నుంచి బీజేపీ నేత అసెంబ్లీలో అడుగు పెట్టడం ఖాయంగా కనిపిస్తోందని పోలింగ్ సరళి చెబుతోంది.