తెలంగాణ సీఎం కేసీఆర్ తన జాతీయ పార్టీ దుకాణాన్ని దాదాపుగా బంద్ చేసుకున్న సిగ్నల్స్ ఇస్తున్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలతో అత్యవసరంగా సమావేశం పెట్టి అత్యవసరంగా గెలిచేస్తామని చెప్పి.. పార్టీ మారొద్దని బుజ్జగించారు తప్ప.. జాతీయ రాజకీయాల్లో దున్నేస్తామని ఒక్క మాట కూడా చెప్పలేదు. అసలు ఆ మాటే ఎత్తలేదు. దీంతో పార్టీ నేతల్లోనే కేసీఆర్ తీరుపై సెటైర్లు పడుతున్నాయి. ముందు ఇంట గెలిచే పరిస్థితి లేనప్పుడు ఇక జాతీయ రాజకీయాల గురించి ఏం మాట్లాడతారని వారిలో వారే మాట్లాడుకుంటున్నారు.
తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ మధ్యనే పోరు ?
తెలంగాణలో కాంగ్రెస్ , బీజేపీ మధ్యనే పోరాటం ఉంటుందన్న అభిప్రాయాలు ఎక్కువగా పోల్ నిపుణుల్లో వ్యక్తమవుతున్నాయి. కర్ణాటక ఎన్నికల తర్వాత ఈ ప్రచారం బాగా పెరిగింది. రెండు పార్టీలు హోరోహోరీగా తలపడితే.. ప్రాంతీయ పార్టీగా ఉన్న టీఆర్ఎస్ పరిస్థితి జేడీఎస్ లా అయిపోతుందన్న అంచనాలు ఉన్నాయి. దేవేగౌడ సమయంలో జేడీఎస్ కూడా కర్ణాటకలో పూర్తి స్థాయి మెజార్టీతో అధికారంలోకి వచ్చింది. కానీ రాను రాను దిగజారిపోయింది. రెండు జాతీయ పార్టీలదే హవా అయింది. తెలంగాణలోనూ అదే పరిస్తితి రావొచ్చని.. చెబుతున్నారు.
ఎమ్మెల్యేలు చేజారిపోకుండా పదిహేను రోజులకో సారి కార్యవర్గ సమావేశం
కార్యవర్గ సమావేశాలు, ఎల్పీ సమావేశాలు అత్యంత కీలకమైన సమయాల్లోనే పెడతారు. కానీ కేసీఆర్ ఇటీవల ప్రతి పదిహేను రోజులకో సారి సమావేశం పెడుతున్నారు. తెలంగాణ భవన్ కు అందర్నీ పిలిపించి విందు భేటీ నిర్వహిస్తున్నారు. అదే సమయంలో అందరి్కీ టిక్కెట్లు కన్పర్మ్ అే ఓ సంకేతాన్ని పంపుతున్నారు. ఆయన తీరు చూసి చాలా మంది ఇదేదోతేడాగా ఉందే అనుకుంటున్నారు. టిక్కెట్లు ఎగ్గొట్టాలనుకున్న వారి గురించి బయటకు తెలియకుండా చివరి క్షణం వరకూ వారికి టిక్కెట్ ఖాయం అని నమ్మించి.. బయటకు వెళ్లకుండా చేయడానికే ఈ వ్యూహం అన్న అనుమానం ఆ పార్టీ నేతల్లో వ్యక్తమవుతోంది. కేసీఆర్ ను నమ్మలేమని నమ్మించి తడిగుడ్డ కోస్తారని ఎక్కువ మంది అనుమానిస్తున్నారు.
కేసీఆర్ వంద సీట్ల ప్రకటనల వెనుక ఉన్నది భయమే !
కేసీఆర్ వంద సీట్లు వస్తాయని బింకంగా ప్రకటనలు చేయడం వెనక ఉన్నది ఆత్మవిశ్వాసం కాదని…భయం అనే అభిప్రాయం ఎక్కువగా వినిపిస్తోంది. ఎందుకంటే 2018లో భిన్నమైన రాజకీయ పరిస్థితులు ఉన్నాయి. అప్పటికి తెలంగాణ సెంటిమెంట్ ఇంకా చల్లారలేదు. ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబు జోక్యంతో సెంటిమెంట్ ఓటర్ల ప్రధాన ఓటింగ్ అంశం అయింది. సెంటిమెంట్ ను కేసీఆర్ వదిలేశారు. టీఆర్ఎస్ పార్టీనే ఏకంగా బీఆర్ఎస్ అని మార్చేశారు. బెంచ్ మార్క్ పథకాలు .. ఎక్కువ మందిలో అసంతృప్తికి కారణం అవుతున్నాయి. భారతీయ జనతా పార్టీ కూడా బలపడింది. దీంతో కేసీఆర్.. పార్టీ నేతలు చేజారిపోకుండా బింకం ప్రదర్శిస్తున్నారని ఎక్కువ మంది భావిస్తున్నారు.