తెలంగాణ సీఎం కేసీఆర్ రైతు చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమం చేస్తూ చనిపోయిన 709 రైతు కుటుంబాలకు 1010 చెక్కులు పంపిణీ చేశారు. గత ఏడాది మేలో ఈ కార్యక్రమం జరిగింది. ఆ తర్వాతా కేసీఆర్ చెక్కులు చెల్లడం లేదంటూ అక్కడి రైతులు కొందరు ఇక్కడి మీడియాకు సమాచారం ఇచ్చారు. తెలంగాణ సర్కార్ వెంటనే విచారణ చేసింది. చెక్కులన్నీ క్లియర్ అయ్యాయని చెప్పుకొచ్చింది. ఆ వివాదం అప్పట్లో సద్దుమణిగింది. కానీ ఇప్పుడు బయటకు వచ్చింది. అసలు ఏ రైతులకు సాయం చేశారంటే మాత్రం సైలెంట్ ఉంటోంది. విచిత్రం ఏమిటంటే ఈ వివరాలు అడిగింది బీఆర్ఎస్ ఎంపీనే.
కేసీఆర్ సాయం చేసిన రైతుల వివరాలు కాాలని అడిగిన నామా
2021లో జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో బీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు రైతు ఉద్యమంలో మరణించిన 750 మంది రైతుల కుటుంబాల్లో ఒక్కో కుటుంబానికి రూ.3లక్షల చొప్పున కేసీఆర్ సాయం చేశారు. ఆ వివరాలు కేంద్రానికి తెలుసా?. ఉద్యమాల్లో ఎంతమంది చనిపోయారన్న డేటా కేంద్రం దగ్గర ఉందా..?’అని ప్రశ్నించారు. నామా అడిగిన ప్రశ్నకు సమాధానం కోసం కేంద్రం తెలంగాణ సర్కార్ ను సంప్రదించింది. సాయం చేసిన రైతుల వివరాలను కేంద్రానికి ఎందుకివ్వలేదు..? అని కేంద్రం ప్రశ్నించింది. పదే పదే అడిగినా.. ఇప్పటి వరకూ రెండేళ్లైనా సర్కార్ స్పందించలేదు.. సీఎం కేసీఆర్‌తో పాటు వివిధ శాఖల అధికారులకు లేఖలు రాసినా రెండేళ్లుగా తెలంగాణ ప్రభుత్వం సమాధానమివ్వలేదు. ఇదే విషయాన్ని చెబుతూ హామీల అమలు కమిటీకి కేంద్రం లేఖ రాసింది.
పంజాబ్ రైతులకు చేసిన సాయం ఉత్తదేనా ?
750 మంది రైతు కుటుంబాలకు కేసీఆర్ చేసిన సాయాన్ని గోప్యంగా ఉంచడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పంజాబ్, ఒరిస్సాలకు వెళ్లి మరీ కొద్ది మంది రైతుల కుటుంబాలకు చెక్‌లను కేసీఆర్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే.. ఆ వివరాలను కూడా కేంద్రానికి ఇంతవరకూ కేసీఆర్ సర్కార్ ఇవ్వలేదు. ఇదంతా 2021లో జరగ్గా.. ఇప్పుడు హామీల అమలు కమిటీ ప్రశ్నించడం, కేంద్రం సమాధానివ్వడంతో కేసీఆర్ నిజంగా సాయం చేశారా లేదా అన్న అనుమానాలు బలంగా వినిపించడం ప్రారంభమయ్యాయి.
చనిపోయిన రైతులకు సాయం చేయలేదా ?
నిజానికి రైతు ఉద్యమంలో చనిపోయిన వారి డాటా తమ దగ్గర లేదని కేంద్రం చెబుతోంది. పంజాబ్ లో ఆప్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత డాటా ఎక్కడ నుంచి వచ్చిందో కానీ ఏడు వందల మందికి చెక్కులు ఇచ్చేశారు. కానీ వారి పేర్లు బయటపెడితే మొత్తం గుట్టు రట్టవుతుందని తెలంగాణ ప్రభుత్వం సీక్రెట్ గా ఉంచుతోందన్న అభిప్రాయం వినిపిస్తోంది. తెలంగామ ప్రజల సొమ్ము బయట రాష్ట్రాల్లో ఎవరికి ఇచ్చారో కూడా చెప్పకపోవడం వివాదాస్పదమవుతోంది.