తెలంగాణ సీఎం కేసీఆర్ దేశంలో విభజన తీసుకొచ్చేందుకు మాస్టర్ ప్లాన్ వేస్తున్నారు. తన రాజకీయ అధికారం కోసం పచ్చని రాష్ట్రంలో చిచ్చు పెట్టిన ఆయన ఇప్పుడు… తన అవినీతి సంపాదనను కాపాడుకోవడానికి… ఇతర రాష్ట్రాల్లో చిచ్చుపెట్టడానికి కూడా సిద్ధమైనట్లుగా కనిపిస్తోంది. మహారాష్ట్రలో నాగపూర్ లో ఓ అద్దె బిల్డింగ్ లో బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ ను ప్రారంభిచి ఆయన చేసిన వ్యాఖ్యలు మహారాష్ట్రలోనే తీవ్ర ఆగ్రహానికి కారణం అవుతున్నాయి. మహారాష్ట్రలో ప్రాంతీయ చిచ్చుపెట్టేందుకు కేసీఆర్ వచ్చారన్న విమర్శలు ఎదుర్కొన్నారు.
మహారాష్ట్రను విభజించాలన్నట్లుగా కేసీఆర్ వ్యాఖ్యలు
బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ మహారాష్ట్ర పర్యటనలో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో బీఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించిన కేసీఆర్… మీడియాతో మాట్లాడారు. విదర్భను ప్రత్యేక రాష్ట్రం చేయడానికి తమ మద్దతు ఉంటుందని ప్రకటించారు. దేశంలో అనేక రాష్ట్రాల్లో ప్రత్యేక రాష్ట్రం కావాలని డిమాండ్లు ఉన్నాయని తెలిపారు కేసీఆర్. బిహార్‌లో మిథిలాంచల్ కోసం ఏళ్ల తరబడి పోరాటం చేస్తున్నారని వివరించారు తాము తెలంగాణ పోరాటం మొదలు పెట్టక ముందు పదేళ్ల నుంచి ఢిల్లీలో పోరాడుతున్నారని తెలిపారు. తెలంగాణ ఏర్పడి పదేళ్లు అవుతున్నా వారి పోరాటం ఇంకా కొనసాగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితులు దేశంలో ఎందుకు ఉన్నాయని వెంటనే కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేయాలన్నారు.
అమెరికాలో యాభై ఉన్నాయి కాబట్టి ఇండియాలో ఎక్కువ ఉండాలంటున్న కేసీఆర్
అమెరికా లాంటి 34 కోట్ల జనాభా ఉన్న దేశమే 50 రాష్ర్టాలను ఏర్పాటు చేసుకుందన్నారు. మరి భారత్‌లో కూడా మరో 10-15 రాష్ట్రాలు ఏర్పడితే వచ్చే నష్టమేమీ లేదు కదా అని వాదిస్తున్నారు. కేసీఆర్ వ్యాఖ్యలు వ్యూహాలు… దేశంలో ప్రాంతీయ చిచ్చుపెట్టేలా ఉన్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. తమకు రాజకీయంగా ఏది అవసరం అయితే దానికి సపోర్ట్ చేసే ఉదంతాలతో పోల్చుకుని ప్రజల్ని రెచ్చగొట్టడం కేసీఆర్ శైలి అని చెబుతున్నారు. గతంలో రాజకీయ నిరుద్యోగులో విదర్భ రాష్ట్ర డిమాండ్ చేశారు. ఇప్పుడు ఆక్కడ ఆ డిమాండ్ తో ప్రజల్ని రెచ్చగొట్టగలిగేలా చేసేందుకు కేసీఆర్ పన్నాగం పన్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
రాజకీయం కోసం దేశంలో చిచ్చు పెట్టడమే కేసీఆర్ లక్ష్యమా ?
కేసీఆర్ ఒకప్పుడు ప్రత్యేక తెలంగాణ అనేదానికి అవకాశమే లేదని అసెంబ్లీలోనే ఉన్నారు అప్పుడు ఆయన మంత్రి. తర్వాత పదవి పోయే సరికి తెలంగాణ వాదం ఎత్తుకుని… ఉమ్మడి రాష్ట్రంలో కలిసి ఉన్న మరో ప్రాంతం మీద విషం చిమ్మి… తాను అనుకున్నది సాధించారు. ఇప్పుడు అదే ప్లాన్ దేశంలో అన్ని రాష్ట్రాల్లో విభజన చిచ్చు పెట్టేందుకు సిద్ధమయ్యారన్న ఆరోపణలు వస్తున్నాయి. అయితే.. ఆయా రాష్ట్రాల ప్రజలు ఇలాంటి రాజకీయాల్ని సహించరని.. తరిమికొడతారన్న అభిప్రాయం … వ్యక్తమవుతోంది.