బీఆర్ఎస్ అనే పార్టీ పెట్టారు కానీ.. కేసీఆర్ ప్రగతి భవన్ గడప దాటడం లేదు. గతంలో ప్రత్యేక విమానాలేసుకుని వెళ్లి మరీ పరిచయాలు పెంచుకున్న నేతంలదర్నీ ఇప్పుడు దూరం పెడుతున్నారు. ఇతర విషయాలపై మాట్లాడటం లేదు. భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ జాతీయ రాజకీయల ఆలోచనలు ఇప్పటివి కావు. తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటి నుండి ఆయన జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టారు. చక్రం తిప్పాలని చాలా ప్రయత్నాలు చేశారు. 2018 ఎన్నికలకు ముందు ఫెడరల్ ఫ్రంట్ పేరుతో చాలా రాష్ట్రాలు తిరిగారు. 2018 ఎన్నిక్లలో గెలిచిన తర్వాత కూడా వెళ్లి వచ్చారు.
పార్టీ పెట్టిన తర్వాత కేసీఆర్‌కు ఇ్బబందులు
సమయం కలిసి వచ్చిందని.. టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ గా మార్చేసిన తర్వాత పార్టీ కోసం సొంత విమానం కొని ఆయన విస్తృత పర్యటనలు చేశారు. ఈ పర్యటనల్లో ఆయనతో చాలా మంది కలసి వచ్చారు. అలాంటి పార్టీలను ఇప్పుడు కేసీఆర్ పట్టించుకోడం లేదు. దీంతో ఎంతో కష్టపడి దగ్గరకు చేసుకున్న మిత్రులు దూరమైపోతున్నారు. కానీ కేసీఆర్ మాత్రం.. పట్టించుకోవడం లేదు. తాజాగా జేడీఎస్ .. బీఆర్ఎస్ నుంచి పూర్తిగా దూరమైనట్లుగా కనిపిస్తోంది. కేసీఆర్, కుమారస్వామి మధ్య స్నేహం జాతీయ స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షించింది. ఇప్పుడు కూడా ఆకర్షిస్తోంది. ఎందుకంటే కనీసం పలకరించుకోవడం లేదు మి.
బీజేపీకి దగ్గరైన జేడీఎస్ !
కారణం ఏదైనా.. జేడీఎస్ కర్ణాటక ఎన్నికల్లో అనుకున్నంతగా విజయం సాధించలేదు. డబ్బులు లేక పాతిక సీట్లలో నెగ్గలేకపోయామని కుమారస్వామి అసంతృప్తి వ్యక్తం చేశారు . ఆ అసంతృప్తి కేసీఆర్ మీదేనని.. ఆర్థిక సాయం చేస్తానని చేయలేదన్న అభిప్రాయాలు కర్ణాటక రాజకీయాల్లో వినిపించాయి. ఇప్పుడు జేడీఎస్ బీజేపీకి దగ్గరవుతున్నట్లుగా కనిపిస్తోంది. అన్ని బీజేపీని వ్యతిరేకించే రాజకీయ పార్టీలు .. పార్లమెంట్ కొత్త భవనం ప్రారంభానికి గైర్హాజర్ అయితే.. జేడీఎస్ సుప్రిమో దేవేగౌడ మాత్రం హాజరయ్యారు. కారణం ఏదైనా కుమారస్వామితో కలిసి ..బీఆర్ఎస్ పయనం ఉండేలా చేసేందుకు కేసీఆర్ చాలా ప్రయత్నాలు చేశారు. కానీ అవన్నీ ఇప్పుడు నిష్ఫ్రయోజనం అయ్యాయి.అయితే కేసీఆర్ కూడా ఇప్పుడు జేడీఎస్‌తో మళ్లీ సంబంధాలు పెంచుకోవాలని అనుకోవడం లేదు.
కేసీఆర్ ను చుట్టుముట్టిన ఆర్థిక అవకతవకలు
కేసీఆర్ పదేళ్లుగా అధికారంలో ఉన్నారు. ఆయన ఈ పదేళ్ల కాలంలో చేసిన ఆర్థిక అవకతవకలు అన్నీ బయటకు వచ్చేస్తున్నాయని.. కేంద్ర దర్యాప్తు సంస్థలు చేసిన సోదాల్లో ఇవన్నీ బయటపడ్డాయని అంటున్నారు. దీనిపై స్పష్టమైన సూచనలు ఉండటంతోనే కేసీఆర్ మౌనంగా ఉంటున్నారని.. బీజేపీతో పెట్టుకోకపోవడం మంచిదని అనుకుంటున్నట్లుగా చెబుతున్నారు. కారణం ఏదైనా కేసీఆర్ చక్ర బంధంలో ఇరుక్కున్నారని.. అందుకే సైలెంట్ గా ఉంటున్నారని అంటున్నారు.