అయోధ్య సీతారాముల కళ్యాణోత్సవానికి సిద్దమైన కదిరి – విష్ణువర్ధన్ రెడ్డి నేతృత్వంలో భారీ సన్నాహాలు

కదిరితో పాటు చుట్టుపక్క ప్రాంతాల్లో అధ్యాత్మకి శోభ ఉట్టి పడుతోంది. మరో వారం రోజుల్లో జరగనున్న అయోధ్య రాముని కళ్యాణోత్సవానికి భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి నేతృత్వంలో ఈ కళ్యాణోత్సవం జరుగుతోంది. అత్యంత భారీగా.. జాతీయస్థాయి రుత్విక్కులు, పండితులు, ప్రముఖులు కల్యాణోత్సవానికి వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

అయోధ్య రామాలయ శోభ కనిపించేలా సన్నాహాలు

దేశమంతా అయోధ్య గురించే చర్చ. ఆ మాటకు వస్తే ప్రపంచం మొత్తం అయోధ్య గురించే మాట్లాడుకుంటోంది. అందరూ ఒకే సారి అయోధ్య వెళ్లకపోవచ్చు కానీ.. భక్తులు అంతా ఎవరి స్థాయిలో వారు అయోధ్య ప్రాణప్రతిష్ట వేడుక్లని చేసుకున్నారు. వాటికి కొనసాగింపుగా కదిరిలో అత్యంత భారీగా అయోధ్య సీతరాముల కల్యాణం నిర్వహించాలని విష్ణువర్ధ్ రెడ్డి నిర్ణయించారు. ఫిబ్రవరి 21వ తేదీని ముహుర్తంగా ఖరారు చేశారు. భక్త సమాజాన్ని కలుపుకుని పకడ్బందీగా ముహుర్తాన్ని ఖరారు చేశారు.

స్రీరామరథం ద్వారా గ్రామ గ్రామాన ప్రచారం

దాదాపుగా 50 వేల మంది భక్తులు హాజరయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఉత్సవానికి సంబంధించి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఇందు కోసం గ్రామ గ్రామానికి శ్రీరామరథం ద్వారా సమాచారం పంపుతున్నారు. ఈ శ్రీరామ రథాలను గ్రామ గ్రామానికి పంపారు. కదిరిలో నిర్వహించనున్న అయోధ్య సీతారాముల కల్యాణోత్సవానికి దేశంలో ఉన్న ప్రముఖ అధ్యాత్మిక ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉంది. వివిధ రాష్ట్రాల నుంచి పండితులు వచ్చి ఈ కల్యాణోత్సవంలో పాల్గొననున్నారు. భక్తులకు కూడా కల్యాణోత్సవంలో ప్రత్యేకమైన బాధ్యతలు తీసుకునేందుకు అవకాశం కల్పించే యోచన చేస్తున్నారు. శ్రీరాముని సేవలో పాల్గొనేందుకు ప్రతి ఒక్కరూ ఆసక్తి చూపిస్తారు. అదో అదృష్టంగా భావిస్తారు. అందుకే కల్యాణోత్సవం అందరి చేతుల మీదుగా జరిగిందనిపించేలా నిర్వహించనున్నారు.

ఎన్నికలలో బిజీగా ఉన్నా కళ్యాణోత్సవంపై ప్రత్యేక దృష్టి

హిందూత్వం కోసం భారతీయ జనతా పార్టీ నేతలు ఏం చేసినా.. దాన్ని రాజకీయాలకు ముడి పెట్టుకుని రచ్చ చేస్తూంటారు కొంత మంది నేతలు. కానీ అయోధ్య రాముని కల్యాణం విషయంలో మాత్రం పార్టీలకు అతీతంగా వ్యవహరాలు జరుగుతున్నాయి. అందరూ తలో చేయి వేస్తున్నాయి. కార్యక్రమాన్ని తలపెట్టి.. నిర్వహిస్తున్నది బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి కావడంతో ఆయన నేతృత్వంలో జరుగుతాయి. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయమంలో రాజకీయాలతో బిజీగా ఉన్నప్పటికీ విష్ణువర్ధన్ రెడ్డి .. ఏర్పాట్లుపై ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు.