ఈ ఒక్క ఎక్సరసైజ్ 21 రోజులు చేస్తే చాలు – మీ శరీరాకృతిలో ఊహించనంత మార్పు!

మెడ, వీపు, పొట్ట, భుజాలకు ఉన్న చికాకులు తగ్గాలన్నా, బెల్లీ ఫ్యాట్ ఇట్టే కరిగిపోవాలన్నా..అనేక ఆరోగ్య రుగ్మతలను నివారించాలన్నా ఈ ఒక్క ఎక్సరసైజ్ చాలు. అది కూడా 21 రోజులపాటూ కంటిన్యూగా చేస్తే ఎంత మార్పు వచ్చిందో మీకే ఈజీగా అర్థమైపోతుంది…

ప్లాంక్ ఎక్సరసైజ్
శరీర బరువు, పొట్ట తగ్గించుకోవడానికి వివిధ వ్యాయామాలు చేస్తుంటాం. కానీ దీన్ని స్థిరంగా చేయకపోవడం వలనే ఫలితాలు చూడలేం. చాలా మంది పొట్ట కొవ్వు తగ్గించుకునేందుకు వ్యాయామాలు చేస్తుంటారు. ఈ బాధలన్నీ తీరాలంటే 21 రోజుల పాటు ఒక్క వ్యాయామం చేస్తే చాలు. అదే ప్లాంక్.

ప్లాంక్ ఇలా చేయాలి
ప్లాంక్ అంటే.. బోర్లా పడుకునే విధానంలో పోజ్ తీసుకోవాలి. రెండు మో చేతులు నేలకు అనించాలి. తర్వాత వెనకాల కాళ్లు, మో చేతుల మీదనే శరీరం ఉంచి పైకి లేవాలి. అంటే శరీరం మెుత్తం సమానంగా పైకి ఉండాలి. పొట్టను నేలకు అనించకూడదు. ఇలా మెుదట్లో చేసినప్పుడు వణుకుతుంటారు. కానీ రాను రాను అలవాటవుతుంది. మీరు ప్రతిరోజూ 5 నుంచి 10 సార్లు ఈ భంగిమను చేస్తే ప్రయోజనాలను పొందుతారు. ప్రతిసారీ 2 నుంచి 4 నిమిషాలు ఉండేలా చూసుకోండి. మెుదట 20 సెకన్లతో ప్రారంభించండి. క్రమంగా టైమ్ పెంచండి.

వెన్ను నొప్పి నుంచి ఉపశమనం
ఈ ప్లాంక్ వ్యాయమం చేయడం వల్ల పొత్తికడుపు, తొడ కండరాలు దృఢమవుతాయి. అవాంఛిత కొవ్వులు పూర్తిగా తగ్గిపోతాయి. ఈ ప్రయోజనాన్ని పూర్తిగా పొందాలంటే 21 రోజుల పాటు నిరంతరంగా చేయాలి. కొందరు 5 నిమిషాలు కూర్చోవడం లేదా పడుకున్న తర్వాత వెన్నెముకలో విపరీతమైన నొప్పిని అనుభవిస్తారు. అయితే ప్లాంక్ వ్యాయామం 21 రోజుల పాటు కంటిన్యూగా చేస్తే నొప్పి తగ్గుతుంది.

జీర్ణాశయ రుగ్మతలు నయం అవుతాయి
దీర్ఘకాలిక అజీర్ణ సమస్యను పరిష్కరించడానికి ప్లాంక్ వ్యాయామం సహాయపడుతుంది. ఇంట్లో రోజూ 10 నిమిషాల పాటు ఈ వ్యాయామం చేయడం వల్ల జీర్ణాశయ రుగ్మతలు నయమవుతాయి. నిద్రలేని రాత్రులతో బాధపడేవారికి ప్లాంక్ చాలా ఉపయోగపడుతుంది. రాత్రి సమయంలో మెదడు పనితీరును స్థిరంగా ఉంచుతుంది.

రక్తపోటు నియంత్రిస్తుంది
ఈ వ్యాయామం 21 రోజుల పాటు నిరంతరం చేస్తే మానసిక గందరగోళం, ఒత్తిడి, అలసట వంటి సమస్యల నుంచి బయటపడవచ్చు. ఇది రక్త ప్రవాహాన్ని స్థిరంగా ఉంచుతుంది, అధిక రక్తపోటును తగ్గిస్తుంది. ముఖ్యంగా మెడ, వీపు, పొట్ట, భుజాలు నిటారుగా ఉంటాయి. అనేక ఆరోగ్య రుగ్మతలను నివారించవచ్చు. బెల్లీ ఫ్యాట్ తగ్గేందుకు ఇది బాగా ఉపయోగపడుతుంది.

గమనిక: ఆరోగ్య నిపుణులు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. దీనిని ఏ మేరకు విశ్వశించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం.