సారా అర్జున్. ఈ పేరు చెప్తే ఎవ్వరూ గుర్తు పట్టకపోవచ్చు. కానీ విక్రమ్ హీరోగా నటించిన నాన్న సినిమాలో అద్భుతంగా నటించి అందర్నీ ఏడిపించిన చిన్న పాప గుర్తుందా. ఆ పాపే సారా అర్జున్. నాన్న సినిమాతో తమిళ్ తో పాటు తెలుగు ఆడియన్స్ కు కూడా దగ్గరైంది. ఆ తర్వాత చిన్నా చితకా సినిమాల్లో నటించినా కానీ పెద్దగా పేరు రాలేదు. ఇప్పుడు పొన్నియన్ సెల్వన్ సినిమాలో జూనియర్ ఐశ్వర్యగా నటించి మరోసారి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచింది.
ఎక్స్ ప్రెషన్స్ తోనే యాక్టింగ్ చేయగల సత్తా
సారా అర్జున్. అద్భుతమైన నటి. ఎక్స్ ప్రెషన్స్ తోనే యాక్టింగ్ ఇరగదీస్తుంది. నాన్న సినిమాలో విక్రమ్ పక్కన ఉన్నా కూడా అతనితో సమానంగా నటించి అందర్ని మెప్పించింది అంటే ఆమె టాలెంట్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు రీసెంట్ గా విడుదలైన పొన్నియన్ సెల్వన్ సినిమాలో రాకుమారిగా తన హావభావాలతోనే కట్టిపడేసింది. సారా అర్జున్ కు ఇప్పటివరకు సరైన అవకాశాలు రాలేదు. కానీ పొన్నియన్ సెల్వన్ సినిమాతో మణిరత్నం కళ్లల్లో పడింది. సారా టాలెంట్ కు తగ్గ పాత్ర దొరకడంతో సిల్వర్ స్క్రీన్ పై చెలరేగిపోయింది. కళ్లతోనే అద్భుతమైన హావభావాలు పలికించింది. సినిమా చూసిన వాళ్లంతా సారా యాక్టింగ్ చూసి సూపర్బ్ అంటున్నారు.
టార్గెట్ హీరోయిన్
చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన సారా అర్జున్ ఇప్పుడు హీరోయిన్ గా ట్రై చేస్తోంది. అయితే చూడ్డానికి ఇంకా చిన్న పిల్లలాగా కన్పిస్తుండడంతో… హీరోయిన్ గా అయితే అవకాశాలు ఇప్పటివరకు రాలేదు. కానీ సారా టార్గెట్ మాత్రం హీరోయిన్ కావడమే. ఇందుకోసం పాన్ ఇండియా సినిమాగా విడుదలైన పొన్నియన్ సెల్వన్ ని ఉపయోగించుకుంది. ఇందులో సారా అందం, అభినయం చూసి ఇప్పటికే నిర్మాతలు ఎంక్వైరీ మొదలుపెట్టారు. అయితే సారా మాత్రం యాక్టింగ్ కు అవకాశం ఉండే పాత్రలే ఎంచుకునేందుకు సిద్దమైంది. తెలుగు, తమిళ్, హిందీ ఇండస్ట్రీలలో గ్లామర్ కు అవకాశం ఉండే పాత్రలతో కంటెంట్ ఉండే కేరక్టర్లు కూడా చేస్తానని చెప్తోంది సారా. మరి సారా ఆకాంక్ష తీరాలని మనం కూడా మనసారా కోరుకుందాం.