జనసేన షాకిస్తున్న టీడీపీ – ఎన్ని సీట్లు ఆఫర్ చేస్తుందో తెలుసా ?

ఏపీలో టీడీపీ జనసేనల మధ్య పొత్తు సీట్ల కేటాయింపు దగ్గర తెగిపోవడానికే ఎక్కువ అవకాశఆలు కనిపిస్తున్నాయి. తెలంగాణా ఎన్నికల్లో జనసేన పోటీ చేసింది. మొత్తం ఎనిమిది సీట్లలో పోటీ చేస్తే ఏడు చోట్ల డిపాజిట్లు గల్లంతు అయ్యాయి. ఇక అక్కడ పోటీ చేసిన బర్రెలక్క కంటే కూడా హీనంగా జనసేన అభ్యర్ధులకు మిగిలిన ఏడు చోట్ల ఓట్లు రావడంతో సోషల్ మీడియాలో అది పెద్ద టాపిక్ అయింది. దాని మీద ట్రోలింగ్ కూడా ఒక్క లెక్కన సాగింది. ఇప్పుడు వాటిని చూపించి టీడీపీ అతి తక్కువ సీట్లను ఆఫర్ చేస్తోంది.

15 సీట్లు అదీ కూడా తామిచ్చినవే తీసుకోవాలంటున్న టీడీపీ

ఇటీవలి కాలంలో టీడీపీ మైండ్ సెట్ మొత్తం మారిపోయింది. వచ్చే ఎన్నికల్లో జనసేనకు మొత్తం పదిహేను సీట్లు గెలిచే సీట్లు అయిదారు మించి ఇవ్వకూడదని టీడీపీ భావిస్తోంది అని అంటున్నారు. దీని మీదనే ఇపుడు ప్రచారం అయితే పెద్ద ఎత్తున సాగుతోంది. అదే విధంగా టీడీపీ తాము ఎపుడూ గెలవనివి జనసేన కూడా గెలవలేని సీట్లు మరి కొన్ని ఇచ్చి మొత్తానికి పొత్తు సరి అనిపిస్తారని కూడా ప్రచారం అయితే గట్టిగానే సాగుతఒంది అని అంటున్నారు. ఇవన్నీ లెక్క కట్టి చూసుకున్నా పదిహేను మించి సీట్లు ఉంటాయా అన్న డౌట్లు కూడా వస్తున్నాయి.

గోదావరి జిల్లాల్లోనే పదిహేను సీట్లు ఆశిస్తున్న జనసేన

నిజానికి గోదావరి జిల్లాలలో జనసేనకు మంచి బలం ఉంది. ఆ తరువాత ఉత్తరాంధ్రాలో విశాఖలో పట్టు ఉంది. అక్కడా ఇక్కడా కలుపుకుని ఏకంగా నలభై సీట్ల దాకా జనసేనకు ఇస్తే తాము పోటీ చేసి పెద్ద నంబర్ గెలుచుకుని అసెంబ్లీకి వెళ్లవచ్చు అన్నది జనసేన ప్లాన్ అంటున్నారు. అయితే ఇదే జిల్లాలలో టీడీపీకి మంచి బలం ఉంది. గట్టి నాయకులు ఉన్నారు. అలాగే గెలిచే విధంగా కూడా చాన్స్ ఉంది. దాంతో తమ అవకాశాలు వదులుకుని ఆ సీట్లు జనసేనకు ఎందుకు ఇవ్వాలన్న ఆలోచనలో ఇపుడు టీడీపీ ఉంది. గెలిచే సీట్లుగా కొన్ని ఇచ్చి మిగిలినవి ఏ రాయలసీమలోనో ఎక్కువ నంబర్ ఇచ్చేసి జ ఇందులో కలిపేస్తే పొత్తు పేరిట ఇచ్చినట్లుగా టీడీపీకి ఉంటుంది కనీ జనసేన గెలుపు అవకాశాలు పెద్దగా ఉండవని అంటున్నారు.

టీడీపీ కుట్రల్ని జనసేన నేతలు బద్దలు కొడతారా ?

అతి తెలివితో టీడీపీ ఆలోచిస్తోంది అని ప్రచారం సాగుతోంది. దీని మీద జనసేనలో తీవ్రంగానే మధనం జరుగుతోంది. అందుకే సీట్ల సర్దుబాటు అంశంపై చర్చలు ఆపేశారని అంటున్నారు. పవన్ సొంతంగా సభలు పెడుతున్నారు. విశాఖలో సొంతంగా సభ పెట్టారు. ఇలాంటివి ముందు ముందు మరికొన్ని జరిగితే.. పవన్ .. సొంత రాజకీయాన్ని ప్రారంభిచే అవకాశాలు ఉన్నాయి.