జనసేన దూరం – ఏపీ బీజేపీ నాయకత్వం విఫలమైందా ?

ఇటీవల ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలో ఎన్డీఏ కూటమి సమావేశం జరిగింది. ప్రధాని మోదీని అందర్నీ పిలిచారు. పవన్ కల్యాణ్ వెళ్లారు. జనేసన పార్టీకి మంచి గౌరవం లభించింది. ఆ సమావేశం తర్వాత పవన్ తాము బీజేపీతోనే ఉన్నామని .. టీడీపీ కలిసి వస్తుందో లేదో వారిష్టమని అన్నారు. ఆ తర్వాత జనసేన పార్టీ.. సర్పంచ్‌ల నిధుల విషయంలో ప్రభుత్వంపై బీజేపీ చేసిన పోరాటానికి సహకరించింది. తమ క్యాడర్ కూ అనుమతి ఇచ్చింది. కానీ ఇప్పుడు పూర్తిగా సీన్ మారిపోయింది.

జనసేనతో బంధం పెంచుకోలేకపోయిన బీజేపీ నేతలు

జనసేన పార్టీ కి ప్రజాకర్షణ ఉన్న లీడర్ ఉన్నారు. ఆయన వల్ల మేలు జరుగుతుంది కానీ నష్టపోయేదేమీ ఉండదు. కానీ రాష్ట్ర నాయకత్వం.. కేంద్ర నాయకత్వానికి అనుగుణంగా పవన్ ను కలుపుకునే ప్రయత్నం చేయకపోవడంతో పరిస్థితి మారిపోయింది. బీజేపీతో కటిఫ్ చెప్పడానికి సమయం కోసం చూస్తున్నట్లుగా పవన్ కల్యాణ్ నేరుగా చంద్రబాబుకు సంఘిభావం ప్రకటించిన తర్వాత టీడీపీ, జనసేన పొత్తును ప్రకటించారు. బీజేపీ కలసి వస్తే మంచిదేనన్నారు. అంటే…. పవన్ .. బీజేపీ వస్తే సరే లేకపోతే తాము వెళ్తామని చెప్పినట్లయింది.

జనసేనతోనే ఉన్నామని మళ్లీ ప్రకటన – బీజేపీ స్పందన బేలగా లేదా ?

పవన్ పొత్తుల ప్రకటన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తు ఉంటుందని పవన్ కళ్యాణ్ గారు అభిప్రాయం వ్యక్తం చేశారని.. కానీ పొత్తుల అంశం బీజేపీ జాతీయ నాయకత్వం చూసుకుంటుందని బీజేపీ రాష్ట్ర నాయకత్వం మీడియా ప ్రకటన చేసింది. ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవాలా అనేదానిపై కేంద్ర నాయకత్వం స్పష్టత ఇస్తుంద తెలిపింది. ప్రధాని మోదీ, బిజెపి జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా అన్నీ చర్చించి నిర్ణయిస్తారన్నారు. పవన్ టీడీపీతో పొత్తు ప్రకటన తర్వాత తాము బీజేపీతోనే ఉన్నామని ప్రకటించడం ద్వారా.. బీజేపీ నాయకత్వం బేలగా వ్యవహరించిందన్న అభిప్రాయం వినిపిస్తోంది.

భవిష్యత్ రాజకీయాలను పవన్ కు వివరించలేకపోయారా ?

భవిష్యత్ రాజకీయాలను పవన్ కు వివరించడంలో బీజేపీ రాష్ట్ర నాయకత్వం విఫలమైన సూచనలు కనిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికల తర్వాత ఏదో ఓ ప్రాంతీయ పార్టీ అదృశ్యం అవుతుందని … ఆ స్థానం బీజేపీ, జనసేన కూటమికి దక్కుతుందని కొంత కాలంగా రాజకీయవర్గాలు విశ్లేషిస్తున్నాయి. దీన్ని పవన్ ను నమ్మేలా చేయడంలో రాష్ట్ర నాయకత్వం విఫలమైందన్న అభిప్రాయం కనిపిస్తోంది.