అనంతపురం వైసీపీ నేతలకు జగన్ షాక్ ట్రీట్ మెంట్ – పదవులు పోగొట్టుకుంది వీరే !

2024 సార్వత్రిక ఎన్నికలు సమీస్తున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీలో గ్రూపు తగాదాలు పెరుగుతున్నాయి. పలు నియోజకవర్గాల్లో నేతల మధ్య వివాదాలు నడుస్తున్నాయి. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని సీఎం జగన్ అనంతపురం జిల్లా పార్టీని ప్రక్షాళన చేయాలని నిర్ణయించుకున్నారు. ఇంచార్జ్ గా ఉన్న మంత్రి పెద్దిరెడ్డికి.. అన్నీ చెప్పి పంపించారు. ఆయన జిల్లాలో పర్యటిచి ఏమేమి చర్యలు తీసుకోవాలో జాబితా రెడీ చేశారు. ఆ ప్రకారం జగన్ చర్యలు ప్రారంభించారు.

అనంతపురం ఎమ్మెల్యేలతో పెద్దిరెడ్డి చర్చలు

మంత్రి పెద్ది రెడ్డి తిరుపతిలో నియోజకవర్గ ఎమ్మెల్యేలతోనూ విడివిడిగా సమావేశమై సర్వే రిపోర్టులు, నియోజకవర్గాల్లో నేతల పనితీరు అన్నీంటిపైనా చర్చించారు. అనంతరం వరుసగా పార్టీలో మార్పులు, చేర్పులు చేపట్టడం ప్రారంభమైనట్టు కనిపిస్తోంది. ఎన్నికల సమయం వచ్చే సరికి వివాదాలకు పుల్‌స్టాప్‌ పెట్టే ఆలోచనలో పార్టీ అధిష్టానం ఉన్నట్టు తెలుస్తోంది. పార్టీకి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా ఇటువంటి చర్యలు తప్పవన్న హెచ్చరికలు జారీ చేశారు. బట్టి పార్టీకి వ్యతిరేకంగా బాహాటంగా ఎవరు మాట్లాడినా వేటు పడటం ఖాయమని చెప్పడమే కాదు.. ఇప్పటికే సంకేతాలు పంపారు.

వైసీపీ రాష్ట్ర కార్యదర్శి బహిష్కరణ

వైసిపి రాష్ట్ర కార్యదర్శి, ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి సోదరుడు వై.మధుసూదన్‌రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్‌ చేసేశారు. స్తు అదే విధంగా రాష్ట్ర సాంస్కృతిక మండలి అధ్యక్షురాలి భర్త, మాజీ ఎస్సీసెల్‌ రాష్ట్ర కార్యదర్శి చామలూరు రాజగోపాల్‌కు షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. మంగళారం నాడు హిందూపురం నియోజకవర్గ ఇన్‌ఛార్జిగానున్న మహమ్మద్‌ ఇక్బాల్‌ స్థానంలో దీపికారెడ్డిని నియమించారు. ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరెడ్డి, ఆయన తనయుడు ప్రణయ్‌ పై గత కొన్ని రోజులుగా భూ అక్రమాణ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీన్ని బలపరుస్తూ భూ అక్రమాల్లో వైసిపి నాయకుల ప్రమేయం ఉందంటూ గతనెల 29వ తేదీన మధుసూదన్‌ రెడ్డి వ్యాఖ్యనించారు. పార్టీ నాయకులపై ఇటువంటి వ్యాఖ్యలు చేయడాన్ని అధిష్టానం సీరియస్‌గా తీసుకుంది. ఆరోపణలు చేసిన మధుసూదన్‌రెడ్డిపై వేటువేస్తూ నిర్ణయం చేసింది.

త్వరలో మరికొంత మందిపై వేటు

అనంతపురం వైసీపీలో గ్రూపు తగాదాలు ఎక్కువగా ఉన్నాయి. అందుకే త్వరలో మరికొంతమందిపై వేటు వేయాలని అనుకుంటున్నారు. ప్రస్తుతం తీసుకుంటున్న చర్యలతో … పార్టీకి నష్టం చేస్తున్న వారు సర్దుకోకపోతే.. ముందు ముందు వేటు తప్పదన్న సంకేతాలు ఇప్పటికే వచ్చాయంటున్నారు. ఇప్పటికే మారకపోతే ఎవరెవరిపై వేటు వేయాలో.. వైసీపీ ఓ జాబితా రెడీ చేసుకుంది.