‘జగమంత కుటుంబం ఆయనది’

ప్రధాని మోదీ విశ్వమానవుడు. ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా జనం రెండు చేతులు జోడించి ఆయన్ను ఆహ్వానిస్తారు.మోదీ నాయకత్వం పట్ల అందరూ విశ్వాసాన్ని వ్యక్తం చేస్తారు. మోదీ వ్యక్తిత్వాన్ని, సంక్షేమం – అభివృద్ధి పట్ల ఆయనకున్న నిబద్ధతను అందరూ మెచ్చుకుంటారు. ప్రత్యర్థులు పది మాట్లాడితే గానీ మోదీ ఒక మాట మాట్లాడరు. ప్రత్యర్థులపై విరుచుకుపడే కంటే ప్రజల గురించి ఆలోచించడానికి సమయం కేటాయించడమే తన ధ్యేయమని మోదీ భావిస్తారు. ప్రజలే తనకు ఆత్మీయులని మోదీ నిత్యం నిర్వచిస్తుంటారు..

లాలూ ప్రేలాపనతో బీజేపీ నేతల ఆగ్రహం

లోక్ సభ ఎన్నికల వేళ ఆర్జేడీ అధినేత, బిహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ అసందర్భ ప్రేలాపన, అతివాగుడుకు తెరతీశారు. మోదీకి పిల్లలు లేరని, కుటుంబం లేదని విరుచుకుపడ్డారు. దేశంలో ఎక్కువ మంది పిల్లలు కనేవారిపై మోదీ కామెంట్ చేస్తున్నారని ఆరోపించారు. పైగా కుటుంబం లేని వాళ్లు హిందువులు కాదని లాలూ చెప్పుకొచ్చారు. పైగా కొన్ని అభ్యంతరకర వ్యాఖ్యలు కూడా చేశారు.

మోదీ కా పరివార్ అంటున్న బీజేపీ నేతలు..

లాలూ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వ్యక్తిగత అంశాల ప్రస్తావనపై ఆగ్రహం చెందారు. మోదీ కూడా గట్టి రిటార్టే ఇచ్చారు. తెలంగాణలో జరిగిన ఒక సభలో మాట్లాడుతూ ఈ దేశమే తన కుటుంబమని ప్రకటించేశారు. మోదీ ప్రజల మనిషి అని ఆయన చెప్పుకున్నారు. 140 కోట్ల మంది ప్రజలు తన కుటుంబం అని ఆయన ప్రకటించేశారు. కుటుంబ పాలనతో దేశాన్ని అథోగతి పాలు చేసిన వాళ్లు తనపై ఆరోపణలు సంధిస్తున్నారన్నారు. ఎవరూ లేని వారికి మోదీ ఆత్మీయుడని, మోదీ వాళ్ల మనిషని లాలూ లాంటి వారికి గట్టిగా సమాధానమిచ్చారు. దీనితో బీజేపీ నేతలంతా ఇప్పుడు లాలూకు బుద్ధి చెప్పాలని డిసైడయ్యారు. తమ సామాజిక మాధ్యమాల ఖాతాలో పేరు పక్కన మోదీ కా పరివార్ అంటే మోదీ కుటుంబం అని పెట్టుకున్నారు. వారిలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా ఉన్నారు. ఇప్పుడు బీజేపీ నేతలంతా వారి దారిలో నడుస్తున్నారు…

నాడు రాహుల్ గాంధీ చేసిన తప్పు…

మోదీపై వ్యక్తిగత దాడుల వల్ల అలా వ్యాఖ్యానించిన వారికే నష్టమని బీజేపీ నేతలు తరచూ చెబుతున్నారు. మణిశంకర్ అయ్యర్ ఆయన్ను చాయ్ వాలా అని పిలవడం, సోనియాగాంధీ మౌత్ కా సౌదాగర్ అనడం అప్పట్లో వారిపై బూమరాంగ్ అయ్యింది. 2019 ఎన్నికల ముందు రాహుల్ గాంధీ కూడా అదే తప్పు చేశారు. చౌకీదార్ చోర్ హై అని రాహుల్ ప్రారంభించిన నినాదం కాంగ్రెస్ కు బెడిసికొట్టింది. రఫేల్ విమానాల కొనుగోలులో స్కామ్ జరిగిందని కాంగ్రెస్ ఆరోపించి అభాసుపాలైంది. అందులో ఎలాంటి స్కామ్ లేకపోగా, అత్యంత సమర్థవంతమైన యుద్ధ విమానాలుగా రఫెల్ కు పేరు వచ్చింది. నాడు బీజేపీ నేతలంతా మై భీ చౌకీదార్ అంటు సోషల్ మీడియా పోస్టులు పెట్టారు. ఈ నినాదం జనంలోకి బాగా వెళ్లిపోయి.. మోదీ ఇమేజ్ ని పెంచేసింది. ఇప్పుడు లాలూ చేసిన కామెంట్ కారణంగా ఇండియా గ్రుపుకే నష్టం వాటిల్లుతుందని మరిచిపోకూడదు…