రెగ్యులర్ గా పాదాల్లో నీరు చేరుతోందా..!

ఇబ్బంది పెట్టే రకరకాల అనారోగ్య సమస్యలలో పాదాల వాపు కూడా ఒకటి. దీనినే పెరిఫెర‌ల్ ఎడెమా అని అంటారు. రకరకాల కారణాలతో పాదాల్లో వాపు, నీరు చేరడం జరుగుతుంటుంది. కొన్నిసార్లు ఆ సమస్య దానంతట అదే తగ్గిపోతుంది. కొన్నిసార్లు రోజులు, వారాల తరబడి కూడా తగ్గదు. అయితే ఈ సమస్యను అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు అంటారు ఆరోగ్య నిపుణులు…

పాదాల్లో వాపు ఈ అనారోగ్యాలకు సూచన
ఎక్కువ సేపు నిల‌బ‌డి ఉండ‌డం, గంటల తరబడి కూర్చుని ఉండడం వల్ల పాదాల్లో వాపు సహజంగా వస్తుంది. ఇలా వచ్చి అలా పోతే పర్వాలేదు కానీ ఈ వాపు ఎక్కువ కాలం పాటు ఉంటే మాత్రం అస్స‌లు నిర్ల‌క్ష్యం చేయ‌కూడదు. శ‌రీరంలో ఉండే వివిధ అనారోగ్య స‌మ‌స్య‌ల వల్ల కూడా పాదాల్లో వాపు వ‌స్తుంది. మూత్ర‌పిండాలకు సంబంధించిన స‌మ‌స్య‌లు, కాలేయ సంబంధిత స‌మ‌స్య‌లు, సిర‌లకు సంబంధించిన స‌మ‌స్య‌లు, గుండె సంబంధిత స‌మస్య‌ల కార‌ణంగా కూడా పాదాల్లో వాపు వస్తుంది. అందుకే పాదాల్లో వాపు ఎక్కువ కాలం పాటు ఉంటే వెంట‌నే వైద్యున్నిసంప్ర‌దించ‌డం మంచిది.

నొప్పి వస్తే మరింత ప్రమాదం
పాదాల్లో వాపుతో పాటు ఎర్ర‌గా ఉండ‌డం, నొప్పి, అసౌక‌ర్యంగా ఉండ‌డం వంటి ఇత‌ర స‌మ‌స్య‌లు ఉంటే కూడా వైద్యున్ని సంప్ర‌దించ‌డం మంచిది. పాదాల్లో ఇన్ఫెక్ష‌న్, ఇన్ ప్లామేష‌న్ కార‌ణంగా ఇలా జ‌రుగుతుంది. అలాగే హార్మోన్ల‌ల్లో మార్పు, ఉన్న‌ట్టుండి బ‌రువు పెర‌గ‌డం వంటి కార‌ణాల చేత వల్ల కూడా పాదాల్లో వాపు వ‌స్తుంది. అదే విధంగా చీల మండ‌లంలో గాయాల కార‌ణంగా కూడా పాదాల్లో వాపు వ‌స్తుంది. గాయం కార‌ణంగా అసౌక‌ర్యం, శ‌రీర బ‌రువు అంతా పాదాల మీద ప‌డ‌డం వంటి కార‌ణాల చేత పాదాల్లో వాపు వ‌స్తుంది. పాదాల్లో వాపుతో పాటు నొప్పి, తీవ్ర‌మైన అసౌక‌రర్యం ఉంటే వెంట‌నే వైద్యున్ని సంప్ర‌దించాలి.

పాదాల్లో వాపు వస్తే సమస్యేంటి!
సిర‌ల్లో ర‌క్తం గట్ట‌క‌ట్ట‌డం, కాలేయ సంబంధిత స‌మ‌స్య‌ల‌ వ‌ల్ల ఇలా జరిగే అవ‌కాశాలు ఉంటాయి. పాదాల్లో వాపుతో పాటు జ్వ‌రం, పాదాల నుంచి వెచ్చ‌గా ఆవిరి రావ‌డం వంటి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తే అది సెల్యులైటిస్ కు కార‌ణం కావ‌చ్చు. ఇలా చాలా కార‌ణాలతో పాదాల్లో వాపు వ‌స్తూ ఉంటుంది. క‌నుక అన్ని సందర్యాల్లో ఈ స‌మ‌స్య‌ను నిర్ల‌క్ష్యం చేయ‌కూడ‌దు.

గమనిక: ఆరోగ్య నిపుణులు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. దీనిని ఏ మేరకు విశ్వశించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం.