బీజేపీ మాజీ ఎమ్మెల్యే, విశాఖ కీలక నేత విష్ణుకుమార్ రాజు పార్టీ మారుతున్నారంటూ అదే పనిగా ప్రచారం జరుగుతూ ఉంటుంది. కాస్త కాంట్రవర్శియల్ గా మాట్లాడే ఆయన తీరును మీడియా అలా వినియోగించుకుంటూ.. ఆయనపై పార్టీ మార్పు ప్రచారాలు చేస్తూ ఉంటుంది. తాజాగా ఓ ఇంటర్యూలో ఆయన చేసిన కామెంట్లను వక్రీకరించారు. అది చూపించి ఆయన పార్టీ మారుపోతున్నారంటూ ప్రచారం ప్రారంభిచారు. దనిపై ఆయన స్పందించారు. తాను పార్టీ మారుతున్నాననే ప్రచారం రాజకీయ కుట్రగా తేల్చారు. ఉద్దేశపూర్వకంగా ఇలా చేస్తున్నారని ఆయన అంటున్నారు.
ఇప్పుడు కాదు ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుండి ప్రచారం
విష్ణుకుమార్ రాజు బీజేపీని వీడిపోతారనే ప్రచారం ఇప్పటిది కాదు. గత ఎన్నికలకు ముందు నుంచీ జరుగుతోంది. జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర విశాఖకు వస్తే ఆహ్వానిస్తానని ఆయన గతంలో ఓ సారి ప్రకటించారు. దాన్ని పట్టుకుని ఆయన పార్టీ మారుతున్నారని చెప్పారు ఎన్నికల సమయంలోనూ ఆయన టీడీపీ లేదా జనసేనలో చేరి పోటీ చేస్తారని అన్నారు. కానీ ఆయన బీజేపీ తరపునే పోటీ చేశారు. ఆ తర్వాత ఆయన ఎవర్ని కలిసినా పార్టీ మార్పు కోసమేననే ప్రచారాన్ని చేస్తూనే ఉన్నారు. కానీ ఆయన ఎప్పుడూ పార్టీ మారే ఆలోచన చేయలేదు. ఆ దిశగా ఒక్క అడుగు వేయలేదు.
బీజేపీ నేతలను పార్టీ మార్చేయాలని మీడియా తహతహ
ఏపీలో మీడియా అంతా రెండు ప్రాంతీయ పార్టీల మధ్య చీలిపోయింది. ఒకరికి వ్యతిరేకంగా.. మరొకరికి అనుకూలంగా వార్తలు రాసుకోవడమే వారి పని. మధ్యలో మూడో పార్టీ వస్తే.. అందరూ కలిసి ఆ పార్టీ అంతు చూడటానికి ప్రయత్నిస్తారు. బీజేపీపై ఎప్పుడూ ఇలాంటి దాడి జరుగుతూనే ఉంది. పార్టీలో బలమైన నేతలపై ఎప్పటికప్పుడు దుష్ప్రచారాలు చేస్తూనే ఉన్నారు. ఇలా ప్రచారం చేయడంలోనూ రాజకీయ వ్యూహం ఉంది. వారికి వేరే పార్టీలు ఆహ్వానం పలుకుతున్నాయన్న సందేశాన్ని ఇలా వారికి ఇస్తారు. కానీ బీజేపీ నేతలు ఇతర పార్టీల వైపు చూడటం అనేది అసాదరమైన విషయం. పార్టీ మారేవారు అతి తక్కువగానే ఉంటారు.
పొత్తులపైనే అదే అత్యుత్సాహం
రాష్ట్ర బీజేపీ నేతలు పొత్తుల గురించి ఎప్పుడూ ప్రకటించలేదు. పొత్తులనేవి జాతీయ రాజకీయాల కోణంలో కేంద్రం తీసుకునేదాన్ని బట్టి తాము ఫాలో అయిపోతామని…అంతే కానీ మీడియా చెప్పినట్లుగా పొత్తులు పెట్టుకునేది లేదని చెబుతున్నారు. అయితే నేతలు పార్టీని వీడిపోతారని ప్రచారం చేయడంతో పాటు.. పొత్తులపైనా .. మీడియా ఎదో ఓ కథ అల్లేస్తూనే ఉంది.