ప్రభాస్ తో పోటీ అవసరమా విక్రమ్!

నటనలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకున్న నటుడు చియాన్ విక్రమ్. తను ఏ క్యారెక్టర్ చేసినా నూటికి నూరుశాతం న్యాయం చేస్తాడు. మూవీ చూస్తున్నంతసేపూ విక్రమ్ క్యారెక్టర్ తప్ప ఎక్కడా హీరో కనిపించడు. అంతలా ఆడియన్స్ ని కనెక్ట్ చేసేయడంలో సక్సెస్ అయ్యాడు విక్రమ్. క్యారెక్టర్ డిమాండ్ చేస్తే జీరో సైజ్ లోకి మారిపోతాడు..అవసరం అయితే భారీగా మారిపోతాడు. అందంగా తయారవగలడు..లేదంటే కురూపిలా కనిపిస్తాడు. ఇప్పుడు అంతకుమించి అనేలా ఉంది తంగలాన్ లో క్యారెక్టర్. ఆటవిక కమ్యూనిటీకి చెందిన నాయకుడిగా విక్రమ్ కనిపిస్తున్నాడు..

రీలీజ్ డేట్ వచ్చేసింది
ఇప్పటికే రిలీజైన తంగలాన్ టీజర్ ఆకట్టుకుంటుంది. ఎప్పుడో మొదలెట్టిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఇప్పటికీ పూర్తిచేయకపోవడంతో నాలుగుసార్లు వాయిదాపడింది. ఎప్పుడో రావాల్సిన సినిమా వాయిదాలమీద వాయిదాలు పడుతూనే ఉంది. దీంతో సినిమా గురించి వెయిట్ చేసి చేసి విసిగిపోయి వదిలేశారు. దీంతో హైప్ తగ్గిపోయింది. ఇలాంటి టైమ్ లో మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు. జూన్ 20న పాన్ ఇండియా లెవల్ లో రిలీజ్ చేయాలని అనుకుంటున్నారట. అఫీషియల్ గా చిత్ర యూనిట్ అయితే ఇంకా కన్ఫర్మ్ చేయలేదు.

రిస్క్ అవసరమా
ప్రభాస్ లేటెస్ట్ మూవీ కల్కి 2898ఏడీ మూవీ రిలీజ్ డేట్ జూన్ 27న ఫిక్స్ చేశారు. అంటే దీనికి వారం ముందే తంగలాన్ రానుంది. అంటే మూవీకోసం పెట్టిన పెట్టుబడిలో సగానికి పైగా మొదటివారంలోనే కలెక్ట్ చేయాలి. కల్కి రిలీజ్ అయిన తర్వాత తంగలాన్ పై ఎంతవరకూ ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తారనేది డౌటే. అందుకే వాయిదాల మీద వాయిదాలు పడుతోంది కదా..ఇప్పుడొచ్చిన కంగారేంటి? కల్కి మూవీ రిలీజ్ టైమ్ లో రావడం అవసరమా అంటున్నారు. అయితే తమిళ ఆడియన్స్ ఫస్ట్ ప్రయార్టీ విక్రమ్ మూవీకే ఇస్తారని భావించి పా రంజిత్ ఆ డేట్ ఫిక్స్ చేశాడట. మొత్తానికి మూవీ రిలీజ్ డేట్ పై ఇంకా అఫీషియల్ కన్ఫర్మేషన్ లేదు..ఏం జరుగుతుందో చూడాలి..