విజయ్..చిరంజీవిని ఫాలో అవుతున్నాడా!

ఇళయదళపతి విజయ్ తమిళనాడు రాజకీయాల్లోకి అడుగుపెట్టాడు. రీసెంట్ గా తన పార్టీ పేరు కూడా ప్రకటించాడు. పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చిన సందర్భంగా విజయ్ తీసుకున్న నిర్ణయం చూస్తుంటే చిరంజీవిని ఫాలో అవుతున్నాడా అంటున్నారంతా…

ప్రస్తుతం తమిళనాడులో ఉన్న పొలిటికల్ స్పేస్ ని ఉపయోగించుకోవడానికి ఇదై రైట్ టైమ్ అని భావించిన విజయ్..ఎంట్రీ ఇచ్చేశాడు. ఎప్పటి నుంచో విజయ్ పొలిటికల్ ఎంట్రీపై ఊహాగానాలు వస్తున్నా అవన్నీ ఎప్పటికప్పుడు పక్కకుపోయాయ్. ఎట్టకేలకు వచ్చేస్తున్నానంటూ క్లారిటీ ఇచ్చిన ఇళయదళపతి పార్టీ పేరు కూడా ప్రకటించేశాడు. అయితే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చే ముందు మెగాస్టార్ చిరంజీవి ఎక్కువగా సామాజిక సందేశం ఇచ్చే సినిమాల్లో నటించాడు. ఇప్పుడు విజయ్ కూడా అదే ఫాలో అవుతున్నట్టున్నాడంటున్నారు నెటిజన్లు. ప్రస్తుతం వెంకట్ ప్రభు దర్శకత్వంలో విజయ్ GOAT అనే మూవీ చేస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ జరుగుతోంది. డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో సోషల్ మెసేజ్ కూడా ఉంటుందట. దీని తర్వాత కార్తిక్ సుబ్బరాజుతో చేయాల్సిన ప్రాజెక్ట్ క్యాన్సిల్ చేసుకుని హెచ్ వినోద్ డైరెక్షన్ లో మూవీకి విజయ్ ఒకే చెప్పాడంట.

బ్రేక్ ఇస్తాడా – ఫుస్ట స్టాప్ పెట్టేస్తాడా
ఓ రెండు మూడు సినిమాల తర్వాత పూర్తిగా ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పేస్తాడని టాక్. అదే నిజమైతే ఫ్యాన్స్ కి పెద్ద షాకే ఇది. ఎందుకంటే ఇప్పటికే విజయ్ చేతిలో దాదాపు అరడజను ప్రాజెక్టులున్నాయి. వాటిలో కొన్ని మాత్రమే పూర్తిచేసి కొన్నింటిని వదిలేస్తాడు అంటున్నారు. అయితే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్న టైమ్ లో ఫుల్ కాన్సన్ ట్రేషన్ చేయాలనే ఉద్దేశంతో బ్రేక్ ఇస్తున్నాడా లేదంటే పూర్తిగా నటనకు ఫుల్ స్టాప్ పెట్టేస్తాడా అన్నది ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఈ విషయంలోనూ మెగాస్టార్ ను ఫాలో అవుతున్నాడా అంటున్నారంతా.

అభిమాన బలం కలిసొస్తుందా
తమిళనాట విజయ్ కి అభిమానబలం చాలా ఎక్కువ. ఈ బలం మొత్తం ఓట్లుగా మారితే విజయ్ ఘన విజయం అందుకోవడం ఖాయం. అయితే ఇండస్ట్రీ వేరు..రాజకీయాలు వేరు. సినిమాల్లో ఏ క్యారెక్టర్ చేసినా ఫ్యాన్స్ ఆదరిస్తారు. రాజకీయాల్లో మాత్రం వేసే ప్రతి అడుగు అప్రమత్తంగా ఉండాలి. మాట్లాడే ప్రతి మాటా ఆచితూచి ఆలోచించి మాట్లాడాలి. సమయానుకూలంగా ఎత్తుగడలు చాలా ముఖ్యం. ఇవన్నీ చెప్పుకున్నంత ఈజీ కాదు. మరి విజయ్ స్టెప్ ఎలా ఉండబోతోందో…