జనసేనతో పొత్తు ఉంది.. ఇక ముందు ఉంటుందని ..ఉమ్మడి సీఎం అభ్యర్థిని హైకమాండ్ నిర్ణయిస్తుందని ఏపీ బీజేపీ అధ్యక్షరాలు పురందేశ్వరి ప్రకటించడం ఏపీ రాజకీయాల్లో కొత్త సంచలనం అవుతోంది. మూడు పార్టీల కూటమి ఉంటుందని జనసేన చీఫ్ ఢిల్లీలో చెప్పారు. కానీ అలాంటి సూచనలేమీ ఉండకపోవడంతో.. పవన్ కల్యాణ్ బీజేపీతో నే కలిసి వెళ్లాలని నిర్ణయించుకున్నట్లుగా చెబుతున్నారు. ఈ సంకేతాలు రావడంతోనే ఉమ్మడి సీఎం అభ్యర్థి గురించి ఏపీ బీజేపీ అధ్యక్షురాలు మాట్లాడారని భావిస్తున్నారు.
బీజేపీని వదిలేందుకు సిద్ధంగా లేని జనసేన
జనసేన పార్టీ బీజేపీతోనే కలిసి నడవాలని అనుకుంటోంది. ఇతర పార్టీల్ని కలుపుకుందామని అంటున్నారు కానీ.. ఉన్న పొత్తుల్ని వదిలేిస ఇతర పార్టీలతో కలుద్దామని అనుకోవడం లేదు. అందుకే.. ఈ అంశంలో స్పష్టత వచ్చిందని చెబుతున్నారు. బీజేపీకి కలసి పోటీ చేసే అంశంపై అంతర్గత సందేశాలు పంపడంతో.. హైకమాండ్ కూడా రెడీ అయిందని అంటున్నారు. విషయంలో ముందు ముందు కొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది.
ఉమ్మడి సీఎం అభ్యర్థిని ముందుగానే ప్రకటిస్తారా ?
నిజానికి బీజేపీలో సీఎం అభ్యర్థిని ముందుగా ప్రకటించే సంప్రదాయం లేదు. గెలిచిన ఎమ్మెల్యేల అబిప్రాయాల్ని బట్టే హైకమాండ్ పెద్దలు నిర్ణయాలు తీసుకుంటారు. ఇప్పుడు కూడా అలాగే నిర్ణయం తీసుకుంటారు కూటమి కాబట్టి.. అంతర్గతంగా ఏదైనా హామీ ఇస్తారేమో స్పష్టత లేదుకానీ.. ఎలాంటి సమస్యలు లేకుండా ముందుగా కలసి కట్టుగా ఎన్నికలు ఎదుర్కోవడంపై దృష్టి పెట్టే అవకాశం ఉంది. పవన్ కల్యాణ్.. ముఖ్యమంత్రి పదవి తనకు ముఖ్యం కాదని పదే పదే చెబుతూంటారు. ఆయన లక్ష్యం వేరు.
త్వరలో పవన్, పురందేశ్వరి భేటీ
పవన్ కల్యాణ్ ను త్వరలోనే కలిసి చర్చిస్తామని పురందేశ్వరి ఇటీవల ప్రకటించారు. ప్రస్తుతం జోనల్ సమావేశాల్లో బిజీగా ఉన్నారు. జోనల్ సమావేశాలు పూర్తయిన తర్వాత పవన్ – పురందేశ్వరి మధ్య భేటీ జరిగే అవకాశం ఉందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. అప్పుడు.. పొత్తులపై పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.