కీర్తి సురేశ్ కి కాబోయేవాడు ఇతడేనా, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటో!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ …‘నేను శైలజ’ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. తొలి సినిమాతో హిట్టందుకుని ఆ తర్వాత కూడా వరుస విజయాలు అందుకోవడంతో స్టార్ హీరోయిన్ హోదా దక్కించుకుంది. కీర్తి కెరీర్ ‘మహానటి’ సినిమాకు ముందు ఆ తర్వాత అన్నట్టు మారిపోయింది. ఈమెకు నటన వచ్చా అన్న స్థాయినుంచి ఈ తరం మహానటి అనిపించుకోవడంలో సక్సెస్ అయింది. రీసెంట్ గా ‘దసరా’ సినిమాలో పల్లెటూరి అమ్మాయిగా నటించి మెప్పించిన కీర్తి.. మెగా స్టార్ చిరంజీవి ‘భోళా శంకర్’ సినిమాలో నటిస్తోంది. అయితే గత కొద్ది రోజుల నుంచి కీర్తి సురేష్ పెళ్లికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ బ్యూటీ ఓ వ్యాపారవేత్తను వివాహం చేసుకోబోతుందని రూమర్స్ వచ్చాయి. తాజాగా కీర్తి సురేష్ కి కాబోయేవాడంటూ ఓ ఫోటో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.

ఇన్ స్టాలో ఫొటో షేర్ చేసిన కీర్తి
కీర్తి సురేష్ థర్టీ ప్లస్ లో అడుగుపెట్టడంతో పెళ్లి మేటర్ మరింత జోరందుకుంది. ఇలాంటి సమయంలో ఓ వ్యక్తితో సన్నిహితంగా దిగిన ఫొటో పోస్ట్ చేసింది, ఆ వ్యక్తి పుట్టిన రోజునాడు స్పషల్ విశెష్ చెప్పింది. తనతో దిగిన ఫొటో ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. పెళ్లివార్తలు ఊపందుకుంటున్న సమయంలో ఈ ఫొటో తన ఇన్ స్టా అకౌంట్లో పోస్ట్ చేయడం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వ్యక్తి ఎవరంటే…పేరు ఫర్హాన్ బీన్ లియాకత్. రియల్ ఎస్టేట్ వ్యాపారి. గతంలో కీర్తి తన క్లాస్ మేట్ ని వివాహం చేసుకుంటున్నాదనే ప్రచారం జరిగింది. ఈ వార్తలను కీర్తి సురేష్ తల్లి ఖండించింది. కీర్తి ప్రస్తుతం సింగిల్ ఎవరితో రిలేషన్ లో లేదని క్లారిటీ ఇచ్చింది… అలాంటిది ఏదైనా ఉంటే కీర్తి మాకు చెబుతుందని అంది.

క్లాస్-మాస్ ఏ పాత్రైనా!
క్లాస్, మాస్ ఏ పాత్రైనా కీర్తి నటనపరంగా ఫుల్ మార్క్స్ కొట్టేసింది. మహానటి తర్వాత క్లాస్ పాత్రలకు మాత్రమే సరిపోతుందనుకున్నారు కానీ ‘సర్కారువారిపాట’ సినిమాతో మాస్ పాత్రల్లో అంతకుమించి అనిపించుకుంది. రీసెంట్ గా నాని హీరోగా తెరకెక్కిన ‘దసరా’లో నటన, లుక్ పరంగా కూడా మంచి మార్కులు సంపాదించుకుంది. పైగా ఈ మధ్య సోషల్ మీడియాలో కూడా స్కిన్ షో చేస్తోంది. ఎందుకంటే హోమ్లీ హీరోయిన్ ఇమేజ్ తో రాణించడం అంత సులభం కాదు..అందుకే క్లాస్, మాస్ లుక్స్ లో ఏ పాత్ర అయినా ఓకే అని చెబుతోంది. అయితే ఓ వైపు స్టార్ హీరోయిన్ క్రేజ్ సొంతం చేసుకున్న సమయంలోనే చెల్లెలి పాత్రలో నటించడం అంటే ప్రయోగమే అని చెప్పాలి. పైగా చెల్లెలి పాత్రలు చేస్తే హీరోయిన్ గా కెరీర్ ముగుస్తుందని భయపడతారు కానీ కీర్తిలో అలాంటి ఆలోచన లేదు. గతంలో రజనీకాంత్ ‘పెద్దన్న’ సినిమాలోనూ చెల్లెలిగా నటించింది. ఇప్పుడు భోళాశంకర్ లో చిరంజీవి చెల్లెలిగా నటిస్తోంది. మరోవైపు జయంరవికి జంటగా ‘సైరన్’ మూవీలో నటిస్తోంది. మధ్య మధ్యలో లేడీ ఒరియెంటెడ్ సినిమాల్లోనూ అవకాశాలు వదులుకోవడం లేదు…ఆ మధ్య చిన్ని అనే మూవీలో సీరియల్ కిల్లర్ గా నటించింది. ఏదైమైనా కెరీర్లో ఫుల్ బిజీగా కొనసాగుతున్న సమయంలో పెళ్లి వార్తలు తెగ ట్రెండ్ అవుతున్నాయి. మరి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఫొటోలో ఉన్న వ్యక్తి ఎవరో కీర్తి చెబితేనే క్లారిటీ వస్తుంది.