అధికారులను బెదిరిస్తున్న వైసీపీ – ఓటమి భయమేనా ?

రేపనేది లేదా.. మీ సంగతి చూస్తాం..అధికారులెవర్ని వదిలి పెట్టం.. అని.. మాజీ మంత్రి పేర్ని నాని హెచ్చరిస్తున్నారు. ఎన్నికల సంఘం పక్షపాతంతో వ్యవహరిస్తోందని రోజూ ఆరోపిస్తున్నారు. రీపోలింగ్ అడిగితే ఇవ్వలేదంటున్నారు. వైసీపీ నేతలపై కేసులు పెడుతున్నారని ఆరోపిస్తున్నారు.పోలింగ్ బూత్ సీసీ ఫుటేజీ బయటకు రావడంపై తీవ్ర ఆరోపణలు చేశారు . తాజాగా పోస్టల్ బ్యాలెట్స్ విషయంలో ఇచ్చిన ఆదేశాలనూ తప్పు పట్టారు. ఇలా రకరకాల అంశాలతో వైసీపీ నేతలు ఆందోళన చెందుతున్నారు.

వైసీపీకి ఎందుకు ఆగ్రహం ?

ఎన్నికల కౌంటింగ్ విషయంలో వైఎస్ఆర్‌సీపీ వేసుకుంటున్న ప్రణాళికలు అన్ని అధికారులు తీసుకుంటున్న నిర్ణయాలతో విఫలమవుతున్నాయని ఆ అసహనం వైసీపీలో కనిపిస్తోందని చెబుతున్నారు. పోలింగ్ అనంతరం ఘర్షణల తర్వాత ఏపీపై అందరి దృష్టి పడింది. ఈసీ ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటోంది. కౌంటింగ్ అనంతరం చిన్న ఘర్షణ జరిగినా ఊరుకునేది లేదని హెచ్చరించింది. పెద్ద ఎత్తున ప్రత్యేక బలగాలను రాష్ట్రానికి పంపింది. అల్లరి చేస్తారని ఆరోపణలు ఉన్న ప్రతి ఒక్కరిని అదుపులోకి తీసుకుంటున్నారు. ఓ వైపు అధికారులు సహకరించకపోవడం.. మరో వైపు పోస్టల్ బ్యాలెట్ల ఉదంతంతో వైసీపీ నేతలు అసహనానికి గురవుతున్నారని అంటున్నారు.

కూటమి హవా అని సర్వేలు రావడమే కారణమా ?

ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఎన్నికల్లో గెలవాలని వైఎస్ఆర్‌సీపీ లక్ష్యంగా పెట్టుకుంది. అందు కోసం అన్ని రకాల ప్రయత్నాలు చేసింది. తమకు వ్యతిరేకంగా ఎక్కడా ప్రచారం జరగకుండా సన్నాహాలు చేసుకుంది. కానీ అవేమీ పెద్దగా వర్కవుట్ కాలేదు. ఎన్నికలకు ముందు నుంచీ కొన్ని వ్యతిరేక సూచనలు వచ్చాయి. కొన్ని ఒపీనియన్ పోల్స్ లో వైసీపీ పూర్తిగా వెనుకబడిపోయినట్లుగా వచ్చింది. పోలింగ్ పూర్తయిన తర్వాత ఆ ప్రచారం మరింత ఊపందుకుంది. ఎగ్జిట్ పోల్స్ కూడా వ్యతిరేకంగా వస్తాయన్న అంచనాలతో వైసీపీ నేతలు అసహనానికి గురవుతున్నారని

గత ఎన్నికల్లో టీడీపీ పరిస్థితి ఇదే
గత ఎన్నికల్లో టీడీపీ ఎదుర్కొంది. 2019లో తెలుగుదేశం అధికార పార్టీనే. అయినా ఆ పార్టీకి చెప్పినట్లుగా ఎవరూ వినలేదు. దాంతో ఈసీపై ఎన్నిసార్లు అసహనం వ్యక్తం చేశారో చెప్పాల్సిన పని లేదు. ఇంకా చెప్పాలంటే ఈసీ ఆఫీసులో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ధర్నా కూడా చేయాల్సి వచ్చింది. ఇప్పుడు వైసీపీ నేతలు ధర్నా చేయలేదు కానీ.. ఆ స్థాయి ఎఫెక్ట్ చూపిస్తున్నారు.