కొన్ని ఫోన్లు తొందరగా వేడెక్కిపోతుంటాయ్..వేసవి కాలం అయితే ఎండలవేడికి ఈ సమస్య మరింత పెరుగుతుంది. కొన్నిసార్లు ఫోన్లు వేడెక్కాయంటే పేలిపోయి,మంటలొచ్చి ప్రమాదాలు జరిగే సంఘటనల గురించి వింటున్నాం. అయితే కొన్ని సింపుల్ టిప్స్ పాటిస్తే ఫోన్ ను కూల్ గా ఉంచొచ్చు…
ఎండలో ఉన్నప్పుడు ఫోన్ బయటకు తీయొద్దు
ఎండలో వెళుతున్నప్పుడు ఫోన్ మాట్లాడడం, ఫోన్ చేత్తో పట్టుకోవడం అస్సలు చేయొద్దు. ఫోన్‌ను ఎక్కువసేపు సూర్యరశ్మిలో ఉంచితే దానిలోని కీలకమైన ఎలక్ట్రానిక్ పార్ట్స్ దెబ్బతింటాయి. ముఖ్యంగా ఫోన్లలోని లిథియం-అయాన్ బ్యాటరీలు వేడిని తట్టుకోలేవు. ఓవర్ హీటింగ్ వల్ల బ్యాటరీ శాశ్వతంగా పాడైపోవచ్చు లేదంటే పేలిపోవచ్చు.. దెబ్బతినవచ్చు, లేదంటే పేలిపోవచ్చు.
జేబులో పెట్టుకోవద్దు
బయటకు వెళ్లినప్పుడు, ఫోన్‌ను జేబులో పెట్టుకోవద్దు. ఎందుకంటే వినియోగదారుడి శరీర ఉష్ణోగ్రత, ఫోన్ హార్డ్‌వేర్ వేడి కారణంగా ఫోన్ అధికంగా వేడెక్కుతుంది. అందుకే ఫోన్‌ను జేబులో పెట్టకుండా బ్యాగులో ఉంచడం మంచిది.
గేమ్స్ వద్దు
ఫోన్ వెడెక్కి ఉన్నప్పుడు గేమ్స్ ఆడడం, వీడియోలు చూడడం అస్సలు చేయకూడదు. దానివల్ల ఫోన్ పాడవుతుంది. బ్రైట్ నెస్ కూడా తగ్గించి ఉంచితే బ్యాటరీ ఎక్కువ కాలం వస్తుంది
కారులో ఫోన్ వదిలేయకండి
ఎక్కడికైనా బయటకు వెళ్లేటప్పుడు చాలామంది ఫోన్ కార్లో పెట్టేసి వెళతారు. అయితే కారు ఎండలోనే ఉంటుంది..లోపల హీట్ విపరీతంగా ఉంటుంది. అలాంటప్పుడు ఫోన్ కార్లోనే వదిలేస్తే తొందరగా వేడెక్కే ప్రమాదం ఉంది.
ఫోన్ వేడెక్కినప్పుడు ఛార్జింగ్ పెట్టొద్దు
ఫోన్లు వేడిగా ఉన్నప్పుడు బ్యాటరీ త్వరగా ఖాళీ అవుతుంది. అలాంటప్పుడు ఛార్జింగ్ పెట్టాలి అనుకుంటే ముందు మొబైల్ చల్లబడాలి. కాసేపు వాడకుండా పక్కనపెట్టేస్తే మొబైల్ చల్లబడుతుంది..అప్పుడు ఛార్జ్ చేయాలి. అప్పుడు కూడా ఒకేసారి పూర్తిగా ఛార్జ్ చేయకుండా 30 నిమిషాలు, అలా చిన్న వ్యవధుల్లో ఛార్జ్ చేయడం మంచిది. లేదంటే అది అధికంగా వేడెక్కే అవకాశం ఉంది. వాస్తవానికి స్మార్ట్‌ఫోన్‌ను 100% వరకు చార్జ్ చేయడం అవసరం లేదు. 80% వరకు చార్జ్ చేయడం మంచిది.
రోజులో కొంతసేపు ఫోన్ కు రెస్ట్ ఇవ్వండి
ఫోన్ నుంచి విరామం తీసుకోవాలనుకుంటే, దానిని కొంతసేపు స్విచ్ ఆఫ్ చేయడం ఉత్తమం. ఈ రోజుల్లో చాలా మంది ఫోన్ లేకుండా ఉండలేరు కానీ రోజులో మొబైల్‌కు 15-20 నిమిషాల బ్రేక్ ఇస్తే మంచిది.