ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ దాఖలు చేసిన మూడో చార్జిషీటు సంచలనంగా మారింది. డాక్యుమెంట్లు, పత్రాలు, వాట్సాప్ చాట్లు, ఈ మెయిల్స్ పత్రాలనుకూడా ఈడీ కోర్టుకు సమర్పించింది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ ద్వారా వచ్చిన లాభాలతో కవిత హైదరాబాద్‌లో 3 చోట్ల భూముల కొనుగోలు చేశారని.. అదీ కూడా రాజకీయ పలుకుబడితో తక్కువ రేటుకు భూములు దక్కించుకున్నారని ఈడీ తెలిపింది. సూత్రధారులు, పాత్రధారుల మధ్య జరిగిన వాట్సాప్ చాట్స్‌ను, ఈ-మెయిల్స్‌ను అందజేసింది. ఛార్జిషీటూ ఛార్జిషీటుకూ కొత్త అభియోగాలు నమోదు చేస్తూ కలకలం రేపుతోంది ఈడీ.
కవిత గుట్టు రట్టు చేసిన బినామీలు
కవిత ఏ భూములు కొన్నారు.. ఎక్కడ కొన్నారు.. డబ్బులు ఎలా ఇచ్చారో అన్ని వివరాలు ఈడీ బయటకు తీసింది. ఇవన్నీ కవిత ఇచ్చిన ఫోన్లలో ఉండే సమాచారం ఆధారంగానే బయటకు వచ్చాయని చెప్పడానికి లేదంటున్నారు. అసలు ఆమె నమ్ముకున్న బుచ్చిబాబు, పిళ్లై ఇద్దరూ ఈడీకి వివరాలు చెప్పడం వల్లనే సాధ్యమయిందని అంచనా వేస్తున్నారు. డబ్బుల ట్రాన్స్ ఫర్ గుట్లన్నీ ఆయన చెబితే.. కేసు మొత్తం వీడిపోతుంది. నగదు లావాదేవీలు జరిగాయని తేల్చితే.. కేసును త్వరగా ముగిస్తారు. ఇప్పుడు ఆర్థిక లావాదేవీల విషయాలను ఈడీ కోర్టుకు సమర్పించింది. బుచ్చిబాబు ఆప్రూవర్‌గా మారితే ఆ విషయాన్ని కోర్టుకు చెప్పాలి.కానీ ఇంకా ఈడీ కోర్టుకు చెప్పలేదు. బుధవారం కూడా ఈడీ ఆయనను ప్రశ్నించింది.
స్కాంలో కవిత పాత్రపై పూర్తి ఆధారాలు !
అప్రూవర్ మారుతున్నట్లుగా బుచ్చిబాబు పిటిషన్ వేస్తాడో లేదో కానీ ఆయన కవిత ఆర్థిక వ్యవహారాలు.. ఢిల్లీ లిక్కర్ స్కాం ఆదాయాలు.. ముడుపులు.. పెట్టుబడులు భూముల గురించి మొత్తం బయట పెట్టేసినట్లుగా ఈడీ తాజా చార్జిషీట్లో స్పష్టమయింది. ఓ ఆడిటర్ చెప్పారంటే. దానికి ఇక తిరుగులేనట్లే భావించవచ్చు. దానికి తగ్గ ఆధారాలు ఉంటాయి. ఇక కవిత తన పేరును బినామీగా పెట్టుకున్నట్లుగా చెబుతున్న అరుణ్ రామచంద్ర పిళ్లై పూర్తిగా చేతులెత్తేశారు. తన పేరు మీద నడుస్తున్నా అది తనది కాదని.. కవితదేనని ఆయన ఎప్పుడో చెప్పేశారు. తర్వాత తన వాంగ్మూలాన్ని వెనక్కి తీసుకుంటానని మరో పిటిషన్ వేశారు. కానీ అలా సాధ్యం కాదు.
ఇంకెంత కాలం ఆజ్ఞాతంలో కవిత !
కాలు ఫ్రాక్చర్ పేరుతో గత నెల రోజులుగా కవిత బయట కనిపించడం లేదు. సుప్రీంకోర్టులో తాను వేసిన పిటిషన్ పై త్వరగా విచారణ కావాలని ఓ సారి మెన్షన్ చేయించారు. మహిళల్ని ఆఫీసుకు పిలిపించి ప్రశ్నించకూడదని ఇంటికే వచ్చి ప్రశ్నించాలని కోరడంతో పాటు అసలు ఢిల్లీ లిక్కర్ స్కాంను ప్రత్యేక సిట్ తో దర్యాప్తు చేయించాలని ఆ పిటిషన్లో కవిత కోరారు. సుప్రీంకోర్టు విచారణ జరుపుతుందో లేదో స్పష్టత లేదు.. ఆ పిటిషన్ వర్కవుట్ అవుతుందో లేదో కానీ.. ఇప్పుడు కవిత మాత్రం తీవ్ర ఇబ్బందుల్లో ఇరుక్కుపోయారు. ఢిల్లీ లిక్కర్ కేసులో తర్వాత అరెస్ట్ ఆమెదే కావొచ్చన్ నప్రచారం మాత్రం జోరుగా సాగుతోంది.