తెలంగాణకు అమరవీరులే దేవుళ్ళు అనేది అందరి నమ్మకం. వారి ప్రాణ త్యాగాలతోనే తెలంగాణ వచ్చింది. అయితే తెలంగాణ ఏర్పడిన తర్వాత వారికి న్యాయం జరిగిందా అంటే… సామాన్యులకు కోపం వచ్చేస్తుంది. శ్రీకాంతాచారి తల్లికి కూడా కనీస న్యాయం చేయలేదు. తలసాని లాంటి వాళ్లు తెలంగాణ ఏర్పడినప్పటి నుండి మంత్రిగా ఉంటే… ప్రాణత్యాగం చేసిన శ్రీకాంతాచారి తల్లిని మాత్రం మొదట్లో అమరవీరుల మద్దతు తమకేనని చెప్పుకోవడానికి ఉపయోగించుకున్నారు , పట్టించుకోవడం లేదు. తాజాగా బీజేపీ అమరవీరుల కుటుంబానికి ఏకతాటిపైకి తెచ్చేందుకు ప్రయత్నించడంతో ఒక్కసారిగా అలర్ట్ అయిన కేసీఆర్ మళ్లీ శంకరమ్మను తెరపైకి తెస్తున్నారు.
శంకరమ్మకు ఎమ్మెల్సీ ఇస్తారా ? ఇస్తే అమరవీరులందరికీ న్యాయం చేసినట్లేనా ?
తెలంగాణ దశాబ్ది ఉత్సవాల ముగింపు సందర్భంగా … అమరవీరుల స్థూపాన్ని కేసీఆర్ ఆవిష్కరిస్తున్నారు. ఈ సందర్భంగా శంకరమ్మకు ఎమ్మెల్సీ ఇస్తారన్న ప్రచారాన్ని ప్రారంభించారు. అది నిజమో .. ఈ ప్రోగ్రాం అయిపోయిన తర్వాత సైలెంట్ చేస్తారో తెలియదు కానీ.. అమరవీరు కుటుంబాల నుంచి వ్యతిరేకత రాకుండా ఓ తాయిలం అయితే విసిరారు. కానీ కొన్ని వందల మంది అమరవీరుల కుటుంబాలు ఆసరా కోసం చూస్తున్నాయి. తెలంగాణ ఉద్యమంలో 1560 మంది అమరులైనట్లు కేసీఆర్ ప్రకటించారు. కానీ చేసిన సాయం మాత్రం తే కేవలం 576 మందినికే. అమరుల కుటుంబాలకు పది లక్షల రూపాయిల సాయం, కుటుంబాలలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, సాగుకు యోగ్యమైన మూడు ఎకరాల భూమి, డబుల్ బెడ్ రూం ఇల్లు వెంటనే కేటాయించాలన్న డిమాండ్లు చాలా కాలంగ ాఉన్నా పట్టించుకోవడం లేదు.
అమరవీరుల కుటుంబాలకు న్యాయం ఇంకెన్నాళ్లు
తెలంగాణ రాష్ట్ర సాధన లో ప్రాణాలు కోల్పోయిన అమరవీరుల కుటుంబాలు చాలా కాలంగా సాయం కోసం ఎదుర చూస్తున్నాయి. 2014 టీఆర్ఎస్ మ్యానిఫెస్టోలో అమరుల కుటుంబాలకు పది లక్షల రూపాయిల సాయం. అమరుల కుటుంబాలలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం. అంతర్జాతీయ స్థాయిలో అమరుల స్మృతి చిహ్న నిర్మాణం. వ్యవసాయం ఆదారపడ్డ కుటుంబాలకు సాగు యోగ్యమైన మూడు ఎకరాల భూమి. అమరుల కుటుంబాలకు డబుల్ బెడ్ రూం ఇల్లు, అమరుల కుటుంబ సంక్షేమం. ప్రసిద్ది గాంచిన నిర్మాణ స్థాయిలో హైదరాబాద్ లో అత్యంత ఎత్తైన అమరుల స్మారక స్థూప నిర్మాణం వంటి హామీలు ఉన్నాయి. ఒక్క స్థూప నిర్మాణం మాత్రమే చేశారు. 2013 డిసెంబర్ లో తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం దాదాపు 900 మంది అమరవీరుల జాబితాని చిరునామాలతో సహా ముద్రించింది. 2014 తర్వాత చనిపోయిన వారి వివరాలు సేకరిస్తే 1381 మంది అమరులైనట్లు వెల్లడైయింది. కానీ ఎవరికీ సాయం చేయలేదు.
అమరవీరుల కుటుంబాల కోసం బీజేపీ పోరాటం
తెలంగాణ అమరవీరుల భిక్ష అని తెలంగాణ బీజేపీ గట్టిగా నమ్ముతోంది. అందు కోసం వారికి ప్రత్యేకంగా వారి కోసం ఏదైనా చేయాలని సంకల్పించింది. ఈ సారి అమరవీరుల కుటుంబాల నుంచి రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలని అనుకుంటోంది. శంకరమ్మకు బీజేపీ టిక్కెట్ ఇవ్వాలని నిర్ణయించడంతో ఈ విషయం తెలిసి.. కేసీఆర్ ఎమ్మెల్సీ అని ప్రచారం చేస్తున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతోంది. తెలంగాణకు అమరవీరులే దేవుళ్ళు. వాళ్ళ త్యాగాల ఫలితమే తెలంగాణ అని బీజేపీ గట్టిగా నమ్ముతోంది.