సీమా హైదర్ పాక్ గూఢచారేనా.. ?

మూడు పదులు దాటిన నలుగురు పిల్లల తల్లి భౌగోళిక సరిహద్దులు దాటి తను ప్రేమించిన వ్యక్తి కోసం భారత దేశంలోకి అడుగు పెడుతుంది. అందులోని మనకు వాళ్లకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పాకిస్థాన్ జాతీయురాలు కావడంతో మరిన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పైగా ఆమె వచ్చిన తీరు, తన కంటే దాదాపు పదేళ్లు చిన్న వయసు కుర్రాడిని ప్రేమించడం లాంటి అంశాలు కూడా ఆశ్చర్య పరుస్తున్నాయి.

ఐదు పాకిస్థానీ పాస్ పోర్టులు, నాలుగు మొబైల్ ఫోన్లు

భారత దేశంలోకి అక్రమంగా ప్రవేశించిన సీమా హైదర్ దగ్గర ఉత్తర ప్రదేశ్ యాంటీ టెర్రరిస్టు స్క్వాడ్ ఐదు పాస్ పోర్టులు స్వాధీనం చేసుకుంది. ఆ ఐదూ చట్టబద్దంగా తీసుకున్నవే కావడంతో ఒక వ్యక్తికి అన్ని పాస్ పోర్టులు ఎలా ఇచ్చారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆమె దగ్గర నాలుగు మొబైల్ ఫోన్స్ కూడా ఉన్నాయి. ప్రస్తుతం సీమా హైదర్ తో పాటు ఆమె నొయిడా ప్రియుడికి కూడా కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఒక వైపు యూపీ ఏటీఎస్, మరో వైపు నొయిడా పోలీసులు ఆమెను రెండు రోజుల పాటు విడివిడిగా విచారించారు. పైగా ఆమెకు నకిలీ గుర్తింపు కార్డుతో ఆధార్ పొందడంలో సచిన్ సాయపడ్డాడు.

ఇంటి పేరు మార్చుకుని..

సీమా హైదర్ ఇప్పుడు పేరు మార్చుకుంది. ప్రియుడు సచిన్ మీనా ఇంటి పేరును తీసుకుని తన పేరును సీమా మీనాగా మార్చుకుంది. తన నలుగురు పిల్లలకు కూడా భారతీయ పేర్లు పెట్టుకుంది. మూడేళ్ల క్రితం ఆన్ లైన్ పబ్జీ గేమ్ తో మొదలైన పరిచయం.. తర్వాత ప్రేమగా మారిందని చెప్పడం నిజమేనా లేక కట్టు కథా అన్నది దర్యాప్తు తర్వాతే తెలుస్తుంది. పాకిస్థాన్ నుంచి దుబాయ్ వెళ్లి అక్కడ నుంచి నేపాల్ వచ్చిన సీమా అక్కడ సచిన్ ను కలుసుకుంది. వారం పాటు ఇద్దరూ ఒకే హోటల్ రూములో బస చేసినట్లుగా యూపీ ఏటీఎస్ నిర్ధారించింది. సాయంత్రం మాత్రమే బయటకు వెళ్లూ సచిన్, సీమా ఎక్కువ సమయం హోటల్ గదిలోనే గడిపేవారు. తర్వాత బస్సు ఎక్కిడ నేపాలు సరిహద్దు దాటిన సీమా.. లక్నో మార్గంలో నోయిడా వచ్చి సచిన్ దగ్గర సెటిలైంది.

స్పై కావచ్చు..శిక్షణ పొంది ఉండొచ్చు..

సీమా హైదర్ వేషధారణ మార్చుకోవడమే కాదు, భాషనైపుణ్యాలు కూడా ఉన్నాయని, అనర్గళంగా మాట్లాడుతోందని రిపోర్టులు చెబుతున్నాయి. నేపాల్‌లో క్రియాశీలకంగా పనిచేస్తున్న పాకిస్తానీ నిర్వహకులు ఆమెకు శిక్షణ ఇచ్చి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సాధారణంగా చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడేందుకుగానూ ఇలాంటి శిక్షణ ఇచ్చి నేపాల్ బోర్డర్ దాటిస్తుంటారని ఇంటెలిజెన్స్ వర్గాలు వివరించాయి. పాకిస్తాన్ ఆర్మీ, ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఐఎస్ఐతో సీమా హైదర్‌కు సంబంధాలు ఉండొచ్చనే అనుమానంతో ఆమెపై ఏటీఎస్, ఐబీ (ఇంటెలిజెన్స్ బ్యూరో) నిఘా వేశాయి. అయితే స్పై అనే అంశాన్ని ఇప్పుడే నిర్ధారించలేమని దానికి కొంత సమయం పడుతుందని యూపీ స్పెషల్ డీజీపీ ప్రశాంత్ కుమార్ తెలిపారు.మరో పక్క నేపాల్ బోర్డర్ నుంచి పాకిస్థానీ పౌరులు ప్రవేశించడానికి సరిహద్దుల్లో చెకింగ్ లేకపోవడమే కారణమని నిర్ధారించారు. అక్కడ రాకపోకలు చాలా సులంభం. మరో పక్క సీమా హైదర్.. ఒక ప్రేమికురాలు మాత్రమేనని, ఆమె స్పై కాదని పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ వర్గాలు చెబతున్నారు. ఐనా పాకిస్థాన్ ను నమ్మేదెలా…