కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. జిల్లాల పునర్విభజన తర్వాత ఈ నియోజకవర్గం కీలకంగా మారింది. ప్రస్తుతం మాజీ మంత్రి, వైసిపి పార్లమెంటు నియోజవర్గ అధ్యక్షుడు కురసాల కన్న బాబు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆ పార్టీ నుంచి ఆయనే బరిలో నిలుచునే అవకాశం కనిపిస్తుంది. అయితే అధిష్టానం ఇంకా కన్నబాబు అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయలేదు.
గత ఎన్నికల్లో స్వల్ప తేడాతో గెలిచిన కన్నబాబు
గత ఎన్నికల్లో ఆయన టిడిపి అభ్యర్థి పిల్లి అనంతలక్ష్మిపై అతి స్వల్ప ఓట్ల తేడాతోనే గెలుపొందారు. ఈ నియోజకవర్గంలో కాపు వర్గానికి 42 వేల ఓట్లు ఉంటే, శెట్టి బలిజవర్గానికి దాదాపు 60 వేల ఓట్లు వరకు ఉన్నట్లు తాజాగా విడుదల చేసిన ఓటర్ల జాబితాలో గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కాపు సామాజికవర్గానికి చెందిన కన్నబాబుకి ఈసారి గెలుపు అంత సునాయాసంగా కనిపిం చడం లేదు. ఇదే పార్టీకి చెందిన శెట్టిబలిజ సామాజిక వర్గానికి చెందిన ప్రముఖ వైద్యుడు పితాని అన్నవరం వైసీపీ నుంచి సీటు ఆశిస్తున్నా దక్కే అవకా శాలు చాలా తక్కువ. ఇచ్చినా, ఇవ్వకపోయినా ఖచ్చితంగా రూరల్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని స్పష్టం చేస్తున్నారు. దీంతో ఇప్పటికే ఆయన నియోజకవర్గమంతా విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఆయన్ను వైసిపి అధిష్టానం పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది
బీజేపీ, టీడీపీ, జనసేన కూటమికి అడ్వాంటేజ్
.ఈ జిల్లాల్లో టిడిపి, జనసేన కలిసి వైసిపిని ఎలాగైనా ఓడించాలని భావిస్తున్నాయి. బిజెపి కూడా తోడవడంతో మరింత బలం పెరుగుతుందనే అంచనాలు వేస్తున్నాయి. గోదావరి జిల్లాల్లో వైసిపికి ఒక్క సీటు రానీయమని పవన్ గతంలో శపథం చేశారు. దీంతో ఇటీవల ఐదు సీట్లు ప్రకటించారు. కాకినాడ రూరల్ నియోజకవర్గం నుంచి జనసేన తరపున ఉమ్మడి అభ్యర్థిగా పంతం నానాజీ పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. అయితే నానాజీకి కరప మండలంలో తప్ప కాకినాడ రూరల్ మండలంలో అంతగా పట్టులేదనే ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలో హోరాహోరీగా జరగనున్న ఈ ఎన్నికల్లో గెలుపు ఎవరిని వరిస్తుందనే చర్చ నియోజకవర్గమంతా హాట్ టాపిక్‌గా మారింది.
శెట్టిబలిజ వర్గం ఓట్లే ప్రధానం
నానాజీ కూడా కాపు సామాజిక వర్గానికి చెందిన నేత కావడంతో శెట్టిబలిజ ఓట్లపైనే ఆధారపడే పరిస్థితి ఉంది. దీంతో మాజీ ఎంఎల్ఎ పిల్లి అనంతలక్ష్మి ఆమె భర్త సత్యనారాయణ పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తేనే నానాజీ గెలిచే అవకాశం ఉంటుందని రాజకీయ పరిశీలకుల అంచనా. అయితే పిల్లి కుటుంబం నుంచి ఏ మేరకు నానాజీకి సహకారం ఉంటుందనేది ప్రశ్నార్థకంగా కనిపి స్తుంది. ప్రస్తుతానికి వారు కలిసే ప్రయాణం చేస్తు న్నప్పటికీ నానాజీకి ఎంతవరకు సహకరిస్తారనేది వేచి చూడాల్సిందే.