ఆంధ్రప్రదేశ్ బీజేపీ కార్యవర్గాన్ని పురందేశ్వరి ప్రకటించారు. బీజేపీ అభిమానులు ఆశించినట్లుగా ఆ కార్యవర్గం కనిపించలేదున్న అభిప్రాయం వినిపిస్తోంది. సామాజిక సమీకరణాలు చూసుకోవడం ముఖ్యమే కానీ.. మరీ చురుగ్గా తిరగలేని వారిని.. .. బీజేపీ విధానాలపై అవగాహన లేని వారిని.. గట్టిగా పార్టీ వాదన వినిపించలేని వారిని తెచ్చి ప్రాధాన్యత కల్పించారన్న అభిప్రాయం వినిపిస్తోంది. అందుకే ఎంతో ఆసక్తిగా రాజకీయ వర్గాలన్నీ ఎదురు చూసిన కార్యవర్గం.. లిస్ట్ ప్రకటన తర్వాత ఊపు చల్లబడిపోయిందన్న వాదన వినిపిస్తోంది. ఇతర పార్టీల మైండ్ గేమ్ ప్రభావం ! బీజేపీ బలపడితే.. తమకు ఎక్కడ తేడా వస్తుందోనని ఏపీలోని రెండు ప్రాంతీయ పార్టీలు, వారికి మద్దతు ఇచ్చే మీడియా… ఓ రకమైన మైండ్ గేమ్ ఎప్పుడూ ఆడుతూంటాయి. బీజేపీలో చురుకుగా ఉన్న నేతల్ని ఎప్పటికప్పుడు టార్గెట్ చేసి.. కొత్త కొత్త ఆరోపణలు చేస్తూంటాయి. అదే.. నిజంగా దందాలు చేసే నేతలు ఆధారాలతో దొరికినా సరే ఆ మీడియాలు పట్టించుకోవు. అదే సమయంలో రాజకీయంగా తమ పార్టీలకు ఇబ్బంది అవుతారన్న నేతలపైనా నిందలేస్తూంటారు చివరికి ఇలాంటి రాజకీయాల ప్రభావం… బీజేపీ నాయకత్వం పైనా పడిందన్న అభిప్రాయం తాజా కమిటీల ద్వారా తెలుస్తోందని… బీజేపీ సానుభూతిపరులు భావిస్తున్నారు. చురుగ్గా తిరిగే యువనేతలకు ప్రాధాన్యం తగ్గించడం మంచిదేనా ? బీజేపీకి క్యాడర్ తక్కువ. ప్రజలకు బాగా పరిచయం ఉండి… పార్టీ కోసం కష్టపడి తిరిగే నేతల అవసరం ఉంటుంది. అలాంటి వారు పార్టీని లైవ్ లో ఉంచుతారు. సాధారణంగా ప్రధాన కార్యదర్శి పదవుల్లో ఇలాంటి వారిని నియమిస్తారు. గతంలో ఉన్న విష్ణువర్ధన్ రెడ్డి,, మాధవ్ వంటి వారు చురుకుగా వ్యవహరించారు. తప్పయినా ఒప్పు అయినా తమ వాదన వినిపిస్తూ… బీజేపీని ఎప్పుడూ వార్తల్లో ఉండేలా చేశారు. కానీ ఇప్పుడు వారిని ఉపాధ్యక్షులుగా నియమించారు. పదకొండు మందిలో వారు ఇద్దరు. ప్రధాన కార్యదర్శులుగా నియమించిన నలుగురిలో ఎవరూ రాష్ట్ర ప్రజలకు పరిచయం లేదు పోరాటాలు.. ఉద్యమాలు చేసిన వారు కాదు. మరి ఏపీ బీజేపీ నాయకత్వం ఎలా పార్టీని ముందుకు తీసుకెళ్లాలనుకుంటుందో ? పని చేసే వారికి ప్రాధాన్యం ఇవ్వకపోతే… ఇతరులకూ నిరాశే దేశంలో బీజేపీ తిరుగులేని స్థానంలో ఉంది. ఏపీలో ఆ స్థాయికి రాకపోవడానికి .. ఉన్న నేతలపైనే ఇతరులు చేసే తప్పుడు ప్రచారాలు నమ్మడం కూడా ఒకటి. రాజకీయాల్లో సొంత నేతలపై హైకమాండ్ కు నమ్మకం తగ్గించడం వారి వ్యూహంలో భాగమే. వారి ట్రాప్ లో పెడితే సొంత కొంపకు నిప్పు పెట్టుకున్నట్లే. ఏపీ బీజేపీ ప్రస్తుత పరిస్థితి అలాగే ఉందన్న అంచనాలు రాజకీయవర్గాల్లో వినిపిస్తున్నాయి.
Related Posts
చంద్రబాబు ప్రభుత్వంలో బీజేపీ, జనసేన ఉంటాయా ?
ఎన్నికల ఫలితాలు ఏకపక్షంగా ఉన్నాయి. వైసీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కలేదు. మరి కూటమిగా పోటీ చేసిన జనసేన, బీజేపీ ప్రభుత్వంలో చేరుతాయా లేకపోతే.. బయట నుంచి…
బీజేపీ కూటమిలోకి వచ్చినప్పుడే విజయం – ఏపీ ఫలితాలు చెప్పింది ఇదే
చంద్రబాబుకు ఒంటరిగా గెలిచిన రికార్డే లేదు.. ఈ సారి ఆయన ఘోరంగా ఓడిపోతారు అని ప్రధానమంత్రి నరేంద్రమోదీ 2019 ఎన్నికల సమయంలో ఏపీలో జరిగిన ఎన్నికల ప్రచారసభలో…
పథకాల కన్నా ఎక్కువ నష్టం చేసింది అధికార దుర్వినియోగమే – ఆ తప్పును గుర్తించలేకపోయిన వైసీపీ !
2019లో 151 సీట్లు 50 శాతం ఓట్లతో తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లలోనే ప్రజావిశ్వాసం కోల్పోయారు. పది శాతానికిపైగా ఓట్లను కోల్పోయారు. అధికారాన్ని…