ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. నిజానికి ఆయన బీజేపీలో చేరాలనుకున్నారు. కానీ చివరికి కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపారు. దీనికి బలం అనే సాకు చెప్పీనప్పటికీ తన కంటే బలవంతుడు లేడని …. నియోజకవర్గాల్లో అభ్యర్థుల్ని కూడా ప్రకటించుకున్న పొంగులేటి.. ఇప్పుడు ఖమ్మంలో బీజేపీ కంటే కాంగ్రెస్ బలంగా ఉందని ఆ పార్టీలో చేరాలని నిర్ణయించుకోవడం వెనుక ఏపీ సీఎం జగన్ ఉన్నారన్న అనుమానాలు రాజకీయవర్గాల్లో వినిపిస్తున్నాయి.
ఏపీలో పొంగులేటి కి భారీ కాంట్రాక్టులు
ఏపీలో వేల కోట్లు కాంట్రాక్టులు పొందుతున్న వారిలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఆయన కు చెందిన రాఘువ కన్ స్ట్రక్షన్స్ కంపెనీ వేల కోట్ల కాంట్రాక్టులు పొందింది. ఇాలా కంపెనీలు పెట్టేసి అలా కాంట్రాక్టులు తీసుకున్నారు. ఇప్పటికే పలు ప్రాజెక్టుల కాంట్రాక్టులు.. వందల కోట్ల విలువైన బిల్లులు చెల్లింపులు చేశారు. తాజాగా మైనింగ్ సీవరేజీ వసూలు కాంట్రాక్టులు.. కీలకమైన జిల్లాల్లో పొంగులేటికి.. ఆయన కుటుంబానికి చెందిన వారికే దక్కుతున్నాయి. అన్నమయ్య్ ప్రాజెక్ట్ టెండర్ ఆయనకే దక్కింది. ఇంకా పనులు ప్రారంభం కాలేదు. ఉత్తరాంధ్రలో మరికొన్ని ప్రాజెక్టులు దక్కాయి.
మైనింగ్ సీవరేజీ కాంట్రాక్టులుకూడా పొంగులేటికే
మైనింగ్ శాఖ… సీవరేజీ వసూలును ప్రైవేటు సంస్థలకు ఇవ్వాలని నిర్ణయించింది. అసలు ఈ నిర్ణయంలోనే ఎవరికైనా పెద్ద స్కాం ఉందని ఏపీ బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి ఇటీవల అన్ని వివరాలు బయట పెట్టి ఆరోపణలు చేశారు. దీనిపై ప్రభుత్వం స్పందించలేదు. తవ్వుకునేది లీజు పొందిన వాళ్లయితే… సీవరేజీ వసూలు చేయాల్సింది ప్రభుత్వం. కానీ ప్రైవేటు సంస్థల వద్ద ఎంతో కొంత తీసుకుని వారినే వసూలు చేసుకోమని ప్రభుత్వం చాన్సిచ్ింది. ఇందు కోసం ఎన్ని కబుర్లు చెప్పినా.. ఇదేదో అక్రమాలకు రహదారి అని అర్థమైపోతుంది. ఇలా సీవరేజీ వసూలు చేసే ప్రైవేటు సంస్థలను ఇప్పుడు ఎంపిక చేస్తున్నారు. మైనింగ్ ఎక్కువ జరిగే సీమ ప్రాంతంలో… సీవరేజీ వసూలు టెండర్లు పొంగులేటి కంపెనీలకే దక్కుతున్నాయి. రాఘవ కన్ స్ట్రక్షన్స్ అనే ఓ కంపెనీతో పాటు… టెండర్లు పిలిచిన తర్వాత పొంగులేటి ఫ్యామిలీ కొడుకులు, కూతుళ్ల పేరుతో ఏర్పాటయిన కంపెనీ కి కూడా ఓ కాంట్రాక్ట్ ఇచ్చారు.
జగన్ సలహా మేరకే పొంగులేటి రాజకీయ అడుగులు
జగన్ తో పలుమార్లు సమావేశమైన తర్వాత చివరికి కాంగ్రెస్ లో చేరాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. కాంగ్రెస్ లో చేరడమే బెటర్ అని ఆయనకు జగన్ సూచించారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ఖమ్మం జిల్లాలో బీజేపీకి బలం లేదు కాబట్టి ఆ పార్టీలోకి వెళ్లడం కన్నా కాంగ్రెస్ లో చేరితేనే బెటరని నిర్ణయించుకున్నామని పైకి చెబుతున్నారు. కానీ… తానే బలవంతుడనని స్వయంగా అభ్యర్థుల్ని కూడా ప్రకటించుకున్న పొంగులేటి.. ఇలా బలమైన పార్టీ కాంగ్రెస్ అని చేరడంలో తేడా ఉందని అంటున్నారు. భవిష్యత్ లో తనకు కాంగ్రెస్ తో అవసరం పడితే.. పొంగులేటిని ప్రతినిధిగా ఉపయోగించుకుంటారని అంటున్నారు. వచ్చే ఎన్నికల తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో కానీ.. కాంగ్రెస్ తో అవసరం పడితే పొంగులేటి లాంటి వాళ్ల వల్ల కొన్ని పనులు జరుగుతాయని .. జగన్ రెడ్డి గట్టి నమ్మకంతో ఉన్నారని అంటున్నారు.