మత మార్పిడులపై ఉక్కుపాదం ఎప్పుడో ?

జనాభాను పెంచుకునే దిశగా మత మార్పిడులను ఒక బలమైన అస్త్రంగా కొన్ని వర్గాలు వాడుకుంటున్నాయి. ప్రలోభపెట్టి, బ్రెయిన్ వాష్ చేసి హిందువులను ముస్లిం మతస్తులుగా మార్చేస్తున్నాయి. ఆరెస్సెస్, విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ లాంటి సంస్థలు ఎక్కడికక్కడ నిఘా పెట్టి వారి ఆటకట్టిస్తున్నప్పటికీ అక్కడక్కడా మత మార్పిడుల సంఘటనలు నమోదవుతున్నాయి.

ఆజంగఢ్ లో మత మార్పిడి ముఠా

ఉత్తర ప్రదేశ్లో మత మార్పిడి ముఠాను పోలీసులు రెండు రోజుల క్రితం అరెస్టు చేశారు. మత సమావేశం పేరుతో ఒక మురికివాడలో జనాన్ని పోగేసి, డబ్బులిచ్చి మాత మార్పిడి చేస్తున్నట్లు గుర్తించారు. పైగా అక్కడ పెద్ద ఫంక్షన్ పెట్టి జనానికి డబ్బులు కూడా ఇచ్చినట్లు తెలిసింది. ఈ కేసులో బారాబంకీకి చెందిన సికిందర్ అనే వ్యక్తి సహా 18 మందిని పోలీసులు అరెస్టు చేశారు. పైగా పోలీసులు ఆ ప్రదేశంలోని ప్రవేశించినప్పుడు అక్కడి జనాన్ని వారిపై రెచ్చగొట్టేందుకు సికిందర్ ప్రయత్నించాడు. చట్ట వ్యతిరేక మత మార్పిడుల నిబంధనల కింద సికిందర్ కు పదేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది.

బలవంతం, ప్రలోభం, మోసం

హిందూ ధర్మమే పరమావధిగా సాగుతున్న దేశంలో కొందరు మత మార్పిడులకు పాల్పడుతున్నారు. బ్రిటిష్ కాలంలో పేదరికం ఆధారంగా మత మార్పిడులు జరగడం వల్లే క్రైస్తవం స్థిరపడిపోయింది. దళితులు, గిరిజనులకు సామాజిక సమానత్వాన్ని, రెంపు పూటల తిండిని ఎరవేసి మత మార్పిడులకు పాల్పడినట్లు చరిత్ర చెబుతోంది. ఇప్పుడు కూడా దేశంలో ప్రలోభాల ద్వారా మత మార్పిడి జరుగుతూనే ఉంది. ఉత్తర ప్రదేశ్ నుంచి ఒడిశా వరకు తమ మార్పిడులు నమోదవుతూనే ఉన్నాయి. డబ్బును, మెరుగైన జీవితాన్ని ఎరగా వేసి గుట్టుచప్పుడు కాకుండా మత మార్పిడులు చేస్తున్న సందర్భాలూ ఉన్నాయి.

లవ్ జిహాద్ తో మత మార్పిడి

ప్రేమ పేరుతో మోసగించి మతం మార్చెయ్యడం దేశంలో ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది. సూక్ష్మంగా చెప్పాలంటే దీన్ని లవ్ జిహాద్ అని పిలుస్తున్నారు. ముందు ప్రేమించడం, తర్వాత మాయమాటలు చెప్పి మొసగించడం, కిడ్నాప్ చేసి బలవంతంగా పెళ్లి చేసుకోవడం, చివరకు అమ్మాయిల మతం మార్చెయ్యడం లవ్ జిహాద్ లో కీలకాంశాలుగా చెప్పాల్సి ఉంటుంది. ఏటా మూడు నుంచి నాలుగు వేల మంది అమ్మాయిలు లవ్ జిహాద్ కు బలౌతున్నా… పట్టు మని పది కేసులు కూడా బయటకు రావడం లేదు. పైగా మోసపోయిన అమ్మాయిలు తర్వాత సర్దుకుపోతున్నారు. ఎంత టార్చెర్ అనుభవించినా తమపై ఎవరూ ఒత్తిడి చేయలేదని, బుద్ధిపూర్వకంగానే మతం మారి పెళ్లి చేసుకున్నామని పోలీసు స్టేషన్లో, కోర్టుల్లో వాగ్మూలమిస్తున్నారు. హిందూ, బౌద్ధ మతస్తులు ఎక్కువగా లవ్ జిహాద్ కు బలవుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. హిందూ అమ్మాయిలను ప్రలోభ పెట్టి పెళ్లి చేసుకుని మతం మార్చిన పక్షంలో ముస్లిం కుర్రోడికి కొన్ని మత సంస్థలు ఏడు నుంచి పదకొండు లక్షల రూపాయలు నగదు పురస్కారం అందిస్తున్నారని బీజేపీ ఎంపీ సాక్షి మహారాజ్ ఒక సందర్భంలో ఆరోపించారు.

సామరస్యానికి తిలోదికాలు

మత మార్పిడులు తీవ్రమైన అంశమని, దానికి రాజకీయ రంగు పులమొద్దని సుప్రీం కోర్టు సూచించింది. బలవంతపు, మోసపూరిత మత మార్పిడుల విషయంలో కేంద్రం, రాష్ట్రాలు కఠిన చర్యలు తీసుకోవాలని, ఈ విషయంలో అటార్నీ జనరల్‌ సాయం చేయాలని ఆదేశించింది. బెదిరించడం, బహుమతులు ఇవ్వడం, ఆర్థిక ప్రయోజనాల ఆశ చూపించడం ద్వారా మత మార్పిడులకు పాల్పడుతున్న అంశంపై లోతైన దర్యాప్తు చేయాల్సిన అనివార్యత ఉందని దాఖలైన పిటిషన్ పై కోర్టు సీరియస్ కామెంట్స్ చేసింది. మత మార్పిడుల కారణంగా దేశంలో మత సామరస్యం కూడా దెబ్బతింటోంది. మత సంఘర్షణ పెరగడం, ఇతర మతాల వారిని అనుమానంగా చూడటం జరుగుతోంది. అనవసరమైన సంఘర్షణలు జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంతో పాటు ప్రజల మీద కూడా ఉందని గుర్తించినప్పుడే మత మార్పిడులకు పాల్పడే వారి ఆట కట్టించే వీలుంటుంది.