సార్వత్రిక ఎన్నికల్లో తిరుపతిలో టిడిపి గుర్తు సైకిల్ కనపడదు.. ఇటు తిరుపతి అసెంబ్లీలోనూ తిరుపతి పార్లమెంటు లోనూ సైకిల్ బొమ్మ ఉండదు. బిజెపి, జనసేన, టిడిపి పొత్తులో భాగంగా తిరుపతి సీటును జనసేనకు కేటాయించారు.. తిరుపతి పార్లమెంటులో ఈ స్థానాన్ని బిజెపికి కేటాయించారు. రెండు చోట్ల టిడిపి అభ్యర్థులు నామినేషన్ వేయనందున ఈ ఎన్నికల్లో సైకిల్ గుర్తు కనపడదు.
గత ఎన్నికల్లో 700 ఓట్ల తేడాతో తిరుపతి అసెంబ్లీలో టీడీపీ ఓటమి
1983లో మాజీ ముఖ్యమంత్రి ఎన్‌టి రామారావు పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత టిడిపి అధికారులకు వచ్చింది. ఎన్టీ రామారావు సెంటిమెంట్‌గా తిరుపతి, గుడివాడలో పోటీ చేసి రెండు చోట్ల గెలుపొందారు. తిరుపతి స్థానానికి రాజీనామా చేసి గుడివాడ ఉంచుకుని ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత ఉప ఎన్నికల్లో కత్తుల శ్యామలమ్మ పోటీ చేసి విజయం సాధించారు. 1989లో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా మబ్బు రామిరెడ్డి ఉన్నారు. 1994లో ఆవుల మోహన్ ఎమ్మెల్యేగా టిడిపి నుంచి విజయ బావుట ఎగరవేశారు. 1999లో చదలవాడ కష్ణమూర్తి కాంగ్రెస్ పై పోటీ చేసి అసెంబ్లీకి వెళ్లారు. 2004లో కాంగ్రెస్ అభ్యర్థి ఎం.వెంకట రమణతో పోటీపడి ఎన్వి.ప్రసాద్ టిడిపి అభ్యర్థి ఓడిపోయారు. 2009లో కొణిదెల చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించి పాలకొల్లు, తిరుపతి నుంచి పోటీచేసి గెలుపొందారు. పాలకొల్లులో ఓడిపోయారు. 2012 మధ్యంతర ఎన్నికల్లో వైసీపీ నుంచి భూమన కరుణాకర్ రెడ్డి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. టిడిపి అభ్యర్థి చదలవాడ కష్ణమూర్తి మూడో స్థానంలో నిలిచారు. 2014 ఎన్నికల్లో టిడిపి నుంచి ఎం వెంకటరమణ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయన మరణాంతరం మధ్యంతర ఎన్నికల్లో ఆయన సతీమణి సుగుణమ్మ టిడిపి నుంచి పోటీ చేసి అసెంబ్లీకి వెళ్లారు. 2019 ఎన్నికల్లో టిడిపి నుంచి సుగుణమ్మ ఎమ్మెల్యేగా పోటీ చేశారు. 700 చిల్లర ఓట్ల తేడాతో ఆమె ఓడిపోయి భూమన కరుణాకర్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు.
గతంలో తిరుపతి ఎంపీగా గెలిచిన బీజేపీ అభ్యర్థి
2024 సార్వత్రిక ఎన్నికల్లో బిజెపి, టిడిపి, జనసేనలు ఒకే కూటమిగా నిలిచాయి. పొత్తులో భాగంగా తిరుపతి అసెంబ్లీ జనసేనకు, తిరుపతి పార్లమెంటు బిజెపికి కేటాయింపులు దాదాపు జరిగిపోయాయి.. ఇక అధికార ప్రకటన తరువాయి.. టిడిపి 41 ఏళ్ల చరిత్రలో మొదటిసారిగా తిరుపతి అసెంబ్లీ పోటీ నుంచి తప్పుకుంటుంది. 1999లో టిడిపి బిజెపి పొత్తుల భాగంగా అప్పుడు తిరుపతి పార్లమెంటుకు బిజెపి కేటాయించారు. తిరుపతి ఎంపీగా బిజెపి అభ్యర్థిగా గెలుపొందారు.. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో తిరుపతి పార్లమెంటు తెలుగు అసెంబ్లీ ఈవీఎంలో సైకిల్ గుర్తు కనిపించదుజనసేనలోకి వలసలు తిరుపతిలో టిడిపి ఖాళీ అవుతుందన్న ప్రచారం జరుగుతోంది… ప్రస్తుత రాజకీయ పరిణామాలు చూస్తే అలానే అనిపిస్తోంది… టిడిపి తిరుపతి నియోజకవర్గం ఇన్చార్జి సుగుణమ్మ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసి జనసేనలో టికెట్ ఇస్తే ఎమ్మెల్యేగా పోటీ చేస్తామని బహిరంగంగానే ప్రకటించారు. మరోవైపు టిడిపి నేతలు వూకా విజరు కుమార్, జేబీ శ్రీనివాస్‌లు కూడా జనసేన వైపు చూస్తున్నారు.
జనసేనలోకి టీడీపీ క్యాడర్
తిరుపతి పార్లమెంటు నియోజకవర్గం అధ్యక్షులు నరసింహ యాదవ్‌కి టికెట్ రాకపోవడంతో అసంతప్తితో ఉన్నారు.. తిరుపతిలో బీసీలు ఎక్కువగా ఉన్నారని.. కాబట్టి తనకే టికెట్ ఇవ్వాలని పట్టుబడి మరీ కూర్చున్నారు.. టిడిపి క్యాడర్ దుంపూరు భాస్కర్ యాదవ్, బుల్లెట్ రమణ, శంకర్ నారాయణ తదితరులు సుగుణమ్మ దారే మాదారి అంటున్నారు.. తిరుపతిలో టిడిపిలోని ప్రధాన నాయకత్వం జనసేన వైపు వలసలు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.. తిరుపతిలో టిడిపి గెలిస్తే రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందన్న సెంటిమెంటూ.. ఉంది. ఇప్పుడు అసలు పోటీ చేయడమే లేదు.