నిద్రపోయేటప్పుడు ఏదిశగా తలపెడుతున్నారు, ఈ దిశగా నిద్రిస్తే అకాల మృత్యువు తప్పదా!

సెంటిమెంట్స్ లేనివాళ్లకి అస్సలు ఎలాంటి టెన్షన్ లేదుకానీ..కొన్ని పద్ధతులు పాటించేవారికి మాత్రం అన్నీ సందేహాలే. ముఖ్యంగా నిత్యం మనం పాటించే వ్యవహారాలపై చాలామందికి చాలా సందేహాలుంటాయి. అందులో ఒకటి ఏ దిశగా నిద్రించాలి అనేది. ఈ విషయంలో వాస్తుశాస్త్రం ఏం చెబుతోంది..సైన్స్ ఏమంటోందో చూద్దాం..

వాస్తుశాస్త్రం ప్రకారం

తూర్పు
తూర్పు దిక్కు ఇంద్ర స్థానం, కుబేర స్థానం. అందుకే నిద్రించేటప్పుడు తూర్పు కి తలబెట్టుకోవడం అన్ని విధాలమంచిదని చెబుతారు. ఇంద్రుడు దేవతల అధిపతి కాబట్టి అది దేవతల దిక్కు. అందుకే దేవతలుండేవైపు తలబెట్టి పడుకుంటే వారి అనుగ్రహం కలుగుతుందంటారు. ఈ దిక్కువైపు తలపెట్టి నిద్రిస్తే లక్ష్మీ కటాక్షం కూడా.

పడమర
పడమర దిశలో ఎప్పుడూ తలపెట్టి నిద్రించకూడదంటారు వాస్తునిపుణులు. ఈ దిశలో మీరు నిద్రించినప్పుడు కాళ్లు తూర్పు దిక్కులో ఉంటాయి. తూర్పు దిక్కు దేవతలను సూచిస్తుంది కాబట్టి ఈ దిశగా కాళ్లు పెట్టడం దోషం అని చెబుతారు.

దక్షిణం
ఇది యముడి స్థానం. దక్షిణ దిక్కు యముడికి చెందిన దిక్కు అందుకే అటువైపు తలపెట్టి పడుకోవచ్చు..అంటే నిద్రలేస్తున్నప్పుడు ఉత్తర దిశ కనిపించాలి..దక్షిణంవైపు తల-ఉత్తర దిశగా కాళ్లు పెట్టుకుని నిద్రస్తే ఆయుష్షు ఆరోగ్యం అంటారు

ఉత్తరం
ఈ దిక్కుకి అధిపతి కుబేరుడు కానీ మనుషులు ఆ దిక్కుగా తల పెట్టుకోరాదు. ఎందుకంటే నిద్రలేస్తూనే మీకు ఎదురుగా కనిపించే దిక్కు దక్షిణం అవుతుంది..దక్షిణానికి యముడు అధిపతి అందుకే ఆ దిక్కును చూస్తూ నిద్రలేస్తే అనారోగ్యం, అకాలమరణం తప్పదంటారు వాస్తు నిపుణులు. మీకు ఇంకా స్పష్టంగా అర్థమయ్యేలా చెప్పాలంటే శవాన్ని ఈ దిశగానే పెడతారు.

సైన్స్ ప్రకారం
మనదేశం ఉత్తరార్ధ గోళంలో ఉండడం వలన సైన్ ప్రకారం అయస్కాంత తరంగాలు ఉత్తరంవైపు నుంచి పడమర మీదుగా దక్షిణం వైపు ప్రయాణిస్తాయి. అందుకే ఉత్తరం వైపు తలపెట్టి నిద్రిస్తే ఆ దిక్కుల్లో ఉన్న అయస్కాంత శక్తి తరంగాలు మెదడులోని శక్తిమంతమైన విద్యుత్ తరంగాలను తగ్గించేస్తాయి. దానివల్ల అనేక ఆరోగ్య, మానసిక సమస్యలు రావడమే కాక, రక్తప్రసరణలో మార్పు వస్తుందంటారు శాస్త్రవేత్తలు. ఆరోగ్యంగా ఉన్న వాళ్ళలో ఇలాంటి ప్రభావం ఎక్కువగా కనిపించకపోయినా వయసుపైబడిన వారిలో ఈ ప్రభావం వెంటనే కనిపిస్తుంది. అందుకే తూర్పువైపు తలపెట్టి నిద్రించడం మంచిది.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం కేవలం కొన్ని పుస్తకాలు, పండితుల నుంచి సేకరించినది మాత్రమే. దీనిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.