కప్పల్ని చూస్తే మనం భయం వేస్తుంది. కానీ కప్పల్ని గోవాలో ఆహారంగా తీసుకుంటారు. ఎంతలా అంటే.. వాటి జాతి అంతరించిపోయేంత ప్రమాదం ఏర్పడింది. దీంతో అక్కడ సీఎం రంగంలోకి దిగారు.
పర్యావరణ సమతూకం కోసం కప్పలను పరిరక్షించుకుందామని రాష్ట్ర ప్రజలకు గోవా సీఎం ప్రమోద్ సావంత్ పిలుపునిచ్చారు. . మనం తప్పనిసరిగా కప్పల్ని కాపాడుకోవాలి అని పిలుపిచ్చారు. కప్పల్ని వేటాడే వారిని అరెస్టు చేస్తాం. కప్పల్ని చంపితే ఊరుకునే ప్రసక్తే లేదు అని వార్నింగ్ ఇచ్చారు. గోవాలో రకరకాల కప్పలున్నాయి. వాటిని వేటాడకుండా ప్రత్యేక చట్టం కూడా ఉంది.
జంపింగ్ చికెన్ పేరుతో కప్పల మాంసం
గోవాలో రెస్టారెంట్లు కప్ప మాంసాన్ని ‘జంపింగ్ చికెన్’ పేరుతో వండివడ్డిస్తున్న కారణంగా కప్పల వేట కొనసాగుతున్నది. గత కొద్ది రోజులుగా, గోవా సరిహద్దు చెక్‌పోస్టుల వద్ద కర్నాటక అటవీ అధికారులు నిఘాను కట్టుదిట్టం చేశారు, ప్రతి వాహనం మరియు సామాను ముక్కలను తనిఖీ చేస్తున్నారు. భారతీయ బుల్ఫ్రాగ్ను వేటాడకుండా నిరోధించడానికి కసరత్తు చేస్తున్నారు. దీని మాంసాన్ని మాన్సూన్ డెలికేసీ అయిన జంపింగ్ చికెన్ పేరుతో కోస్తా రాష్ట్రంలోని రెస్టారెంట్లలో విక్రయిస్తారు . గోవాలో వన్యప్రాణుల చట్టాలు కఠినంగా అమలవుతున్నందున కర్ణాటక, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల నుంచి కప్పలు సరఫరా అవుతున్నాయని అటవీ శాఖ వర్గాలు తెలిపాయి. గోవాలో బుల్‌ఫ్రాగ్‌ల అమ్మకం నిషేధించబడినందున, రెస్టారెంట్ మెనూలు తరచుగా వాటిని ప్రదర్శించవు. కానీ స్మగ్లింగ్ చేసి అమ్ముతున్నారు.
పర్యావరణంలో కప్పలు కీలకం
కప్పలను కాపాడుకోవాల్సిన అవసరం మనకు ఎంతైనా ఉందని నిపుణులు చెబుతున్నారు. పర్యావరణ సమతూకం పాటించాలని మనం ఆకాంక్షిస్తున్న పక్షంలో కప్పలని మనం తప్పనిసరిగా కాపాడుకోవాలని గోవా సీఎం చెబుతున్నారు. కప్పలను తినకండి. బదులుగా చికెన్ తినండని సలహా ఇచ్చారు. కప్పల వేటను నిషేధిస్తూ ఒక చట్టం గోవాలో అమల్లో ఉంది. ఈ భూమిపై అనేక ఆహార గొలుసులు ఉంటాయి. వాటిలో కప్పల ఆహార గొలుసు ఒకటి. కప్పలు పురుగుల్ని తిని బతుకుతాయి. ఆ కప్పల్ని తిని పాములు బతుకుతాయి. ఆ పాముల్ని తిని గద్దలు బతుకుతాయి. ఆ గద్దల్ని తిని చిరుతలు ఇతర వన్య మృగాలు బతుకుతాయి. కప్పలు లేకపోతే.. పాములు, గద్దలు ఉండవు. అదే సమయంలో.. భూమిపై పురుగుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. ఇలా కప్పలు పర్యావరణానికి మేలు చేస్తున్నాయి.
చేపల చెరువుల్లా .. కప్పల చెరవుల్ని పెంచుతారేమో ?
గోవాలో ఉన్నకప్పల డిమాండ్ గురించి తెలిస్తే.. మన రాష్ట్రంతో పాటు ఇతర చోట్ల… చేపలు, రొయ్యలతో పాటు కప్పల చెరువులను కూడా పెంచుతారేమోననే సెటైర్ వినిపించినా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే మార్కెట్ ఎక్కడ ఉంటే అక్కడ వాలిపోవడమే వ్యాపారుల పని. ఇప్పటి వరకూ ఈ కప్పల పెంపకం ప్రారంభం కాలేదు. ప్రకృతి సిద్ధంగా ఉన్నవే. ముందు ముందు ప్రారంభిస్తారేమో చూడాలి