జీలకర్ర వంటల్లో రుచిని పెంచడమే కాదు ఒంట్లో అనారోగ్యాన్ని కూడా తొలగిస్తుంది. జీలకర్రలో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ లక్షణాలు, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. దీని వల్ల పొట్ట దగ్గరి కొవ్వును కరుగుతుంది. రోజూ ఉదయాన్నే ఒక గ్లాస్ జీలకర్ర నీటిని తాగితే ఇంకా ఎన్నో ప్రయోజనాలున్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. ముఖ్యంగా మలబద్ధకం, అజీర్ణం, గ్యాస్ లేదా కాలేయ సమస్యలు వంటి జీర్ణ సమస్యలు ఉన్నవారికి ఇది దివ్యౌషధం.
- జీలకర్రలో ఉండే సమ్మేళనాలు జీర్ణక్రియను మెరుగుపరచడంలో చాలా ప్రభావవంతంగా ఉంటాయి. పేగులను ఆరోగ్యంగా ఉంచడంలో కూడా మేలు చేస్తుంది. ప్రకోప ప్రేగు సిండ్రోమ్ (IBS) ఉన్న వ్యక్తులపై జరిపిన ఒక అధ్యయనంలో, రోగులు నాలుగు నెలల వ్యవధిలో లక్షణాలలో గణనీయమైన మెరుగుదలని కనుగొన్నారు.
- జీలకర్ర మధుమేహం లక్షణాలను తగ్గించడంలో కూడా చాలా ప్రభావవంతంగా ఉంటుంది. ప్లేసిబోతో పోలిస్తే జీలకర్ర నీరు లేదా సారాన్ని తీసుకునే అధిక బరువు ఉన్న రోగులు మధుమేహం ప్రారంభ సూచికలను మెరుగుపరిచినట్లు క్లినికల్ అధ్యయనాలు చెబుతున్నాయి.
- రక్తంలో కొలెస్ట్రాల్ కూడా అదుపులో ఉంటుంది జీరా వాటర్. రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయి పెరగడం గుండె జబ్బులకు ప్రధాన కారకంగా గుర్తించారు. ఈ అధ్యయనంలో అధిక బరువు ,ఊబకాయం ఉన్న మహిళలు రోజుకు 3 గ్రాముల జీలకర్ర పొడి లేదా జీలకర్ర నీటిని తీసుకోవడం ద్వారా కొలెస్ట్రాల్ స్థాయిలలో తగ్గుదలని గమనించారు.
- జీలకర్ర నీటిని తాగడం వల్ల గ్యాస్, అజీర్ణం సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. ఇది సహజసిద్ధమైన పెయిన్ కిల్లర్‌లా పనిచేస్తుంది. జీలకర్ర నీటిని తాగితే జీర్ణాశయంలో కొన్ని రకాల ఎంజైమ్‌లు ఉత్పత్తి అవుతాయి. ఇవి జీర్ణక్రియను వేగవంతం చేస్తాయి.
- గర్భిణిలు జీలకర్ర నీటిని తాగడం వల్ల వారిలో జీర్ణక్రియ మెరుగు పడుతుంది. కార్బొహైడ్రేట్లను జీర్ణం చేసేందుకు అవసరం అయ్యే ఎంజైమ్‌లు ఉత్పత్తి అవుతాయి. దీంతో గర్భధారణ సమయంలో వచ్చే సమస్యలు తగ్గుతాయి.
- పాలిచ్చే తల్లులు రోజూ జీలకర్ర నీటిని తాగితే పాలు బాగా ఉత్పత్తి అవుతాయి. జీలకర్రలో ఐరన్ సమృద్ధిగా ఉండడం వల్ల రక్తహీనత రాకుండా చూస్తుంది.
- జీలకర్రలో ఐరన్, ఫైబర్‌లు అధికంగా ఉంటాయి. అందువల్ల జీలకర్ర నీటిని తాగితే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. వ్యాధులకు వ్యతిరేకంగా పోరాడుతుంది. దీంతో ఇన్‌ఫెక్షన్లు రాకుండా ఉంటాయి.
- శ్వాసకోశ వ్యవస్థ ఆరోగ్యాన్ని మెరుగు పరిచేందుకు జీలకర్ర నీళ్లు పనిచేస్తాయి. ఈ నీటిలో యాంటీ కంజెస్టివ్ లక్షణాలు ఉంటాయి. అందువల్ల ఛాతిలో పేరుకుపోయిన మ్యూకస్ కరుగుతుంది.
- జీలకర్రలో పొటాషియం అధికంగా ఉంటుంది. మన శరీర పనితీరుకు ఇది ఉపయోగపడుతుంది. ఇది హైబీపీని తగ్గిస్తుంది. ఉప్పు వల్ల కలిగే దుష్ప్రభావాల నుంచి రక్షిస్తుంది.
- జీలకర్ర విత్తనాలు సహజసిద్ధంగా శక్తిని పెంచే పదార్థాలుగా పనిచేస్తాయి. జీలకర్రలో అనేక పోషకాలు ఉంటాయి. అవి శరీరానికి శక్తిని అందిస్తాయి. మెటబాలిజం తక్కువగా ఉందనుకునే వారు, శక్తి లేదని, నిస్సత్తువగా, నీరసంగా ఉందని భావించే వారు జీలకర్ర నీటిని తాగితే ఫలితం ఉంటుంది. శక్తి స్థాయిలు పెరుగుతాయి.
- జీలకర్ర నీరు చర్మానికి పునరుజ్జీవం ఇస్తుంది. దీంతో చర్మం కాంతివంతంగా మారుతుంది. జీలకర్ర, పసుపు, కొద్దిగా నీరు కలిపి ఫేస్ ప్యాక్ తయారు చేసుకుని తరచూ వాడితే చర్మం మృదువుగా మారుతుంది.
- జీలకర్రలో ఉండే పోషకాలు శిరోజాల సంరక్షణకు మేలు చేస్తాయి. జుట్టు కుదుళ్లను ఆరోగ్యంగా ఉంచుతాయి. దీని వల్ల జుట్టు పలుచబడడం, జుట్టు రాలడం వంటి సమస్యలు తగ్గుతాయి. జీలకర్రలో ఉండే ప్రోటీన్లు, ఫ్యాట్స్, నీరు, కార్బొహైడ్రేట్లు జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. జుట్టును కుదుళ్ల నుంచి దృఢంగా మారుస్తాయి.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం…