అధిక బరువును తగ్గించుకునేందుకు, పొట్ట దగ్గరి కొవ్వును కరిగించుకునేందుకు ఎన్నో వ్యాయామాలు చేస్తారు, వాకింగ్ చేస్తుంటారు. వాటితో పాటూ డైట్ కంట్రోల్ చేసుకుంటారు. అయితే పొట్టను తగ్గించే వ్యాయామాల్లో ది బెస్ట్..ప్లాంక్ (Plank) ఎక్సర్‌సైజ్. చూడ్డానికి తేలిగ్గా అనిపిస్తుంది ఈ వ్యాయామం చేయడం కాస్త కష్టమే. నెలరోజులు చేస్తేమాత్రం అద్భుతమైన ఫలితాలు మీ సొంతం..
ప్లాంక్ ఎక్సర్ సైజ్ ఎలా చేయాలంటే
బోర్లా పడుకుని మోచేతులను, పాదాల మునివేళ్లను నేలపై ఆనించి…మిగిలిన భాగం మొత్తం పైకి లేపాలి. ఈ భంగిమలో కొంత సేపు ఉండాలి. దీన్నే ప్లాంక్ ఎక్సర్‌సైజ్ అంటారు. ఓస్ ఇంతేనా ఈజీగా చేసేయవచ్చు అనుకుంటారు కానీ ఇది కొంచెం కష్టమే..ఫలితం కూడా అంతే త్వరగా ఉంటుంది.
రోజురోజుకీ సమయం పెంచండి
మొదటి రోజు ఈ వ్యాయామాన్ని 20 సెకన్లతో మొదలు పెట్టి తర్వాత రోజూ నెమ్మదిగా సమయం పెంచుకుంటూ పోవాలి. రోజుకి 10 సెకెన్లు, 20 సెకెన్లు, 30 సెకెన్లు పెంచుకుంటూ వెళుతూ నెలరోజులకు కనీసం 5 నిముషాల పాటూ చేయగలిగేలా ప్లాన్ చేసుకోవాలి. 30 రోజులకు ఈ వ్యాయామానికి బాగా అలవాటు పడతారు..ఆ తర్వాత మీకు నచ్చినంత, ఉండగలిగినంత సమయం ఉండొచ్చు. మొదటి నెలరోజుల్లోనే మీ శరీరం తేలికపడిన ఫీలింగ్ మీకు వస్తుంది. భారీ పొట్ట కరగడం మొదలవుతుంది..శరీరం బరువు తగ్గుతుంది. ఇలా క్రమం తప్పకుండా ప్లాంక్స్ చేస్తే వెయిట్ తగ్గడంతో పాటూ చాలా అనారోగ్య సమస్యలు తీరిపోతాయి.
ప్లాంక్ చేస్తే ఏంటి!
@ ఈ వ్యాయామం చేయడం వల్ల పొట్ట దగ్గర కండరాలు, ఛాతి భాగం దృఢంగా మారుతాయి
@ శరీర మెటబాలిజం పెరుగుతుంది. క్యాలరీలు వేగంగా ఖర్చవుతాయి
@ అధిక బరువు తగ్గేందుకు అవకాశం ఉంటుంది. పొట్ట దగ్గరి కొవ్వు కరుగుతుంది.
@ నిత్యం కంప్యూటర్ల ఎదుట కూర్చుని పని చేసేవారికి ఈ వ్యాయామం మరింత ఉపయోగం
గమనిక: ఈ వ్యాయామం చేసేటప్పుడు సరైన భంగిమలో ఉండాలి. లేదంటే ఇబ్బందులు వస్తాయి. ఇక మరీ అధికంగా బరువు ఉన్నవారు, గుండె జబ్బులు, హార్ట్ ఎటాక్‌ల సమస్యలు ఉన్నవారు వైద్యులను సంప్రదించిన తర్వాతే చేయాలి. ప్లాంక్స్ మొదలుపెట్టిన రెండు మూడు రోజుల పాటూ ఏమైనా అనారోగ్య ఇబ్బందులు వస్తున్నాయా అన్నది కూడా గమనించుకోవాలి..