మనం ఆహారంలో ఉపయోగించే నూనె రకాన్ని బట్టి మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. నూనె రకం మాత్రమే కాదు, దాని పరిమాణం, ఉపయోగించే పద్ధతి కూడా ఆరోగ్యంపై ప్రభావాన్ని చూపుతాయి. ఆవనూనె, ఆలివ్, కొబ్బరి, అవకాడో వంటి నూనెలను వంటలో ఉపయోగిస్తారు. ఈ నూనెలన్నీ భిన్నమైన లక్షణాలను కలిగి ఉంటాయి. నూనె లేనిదే వంటకు సరైన రుచి రాదు. అయితే ఎలాంటి నూనె వినియోగించాలి? అసలు నూనె వినియోగించడం మానేస్తే ఏమవుతుంది!
వంట చేసేటప్పుడు నూనె వినియోగం తప్పనిసరి. మార్కెట్లో ధరలు పెరుగుతుండటంతో ఏదో ఒకటిలే అనుకుని తక్కువ రేటుకు దొరికే నూనెలు తీసుకొచ్చి వినియోగిస్తుంటారు. అలాంటి నూనెలు వాడకం వల్ల వంట రుచి పెరుగుతుంది కానీ రోగాలు రావడం ఖాయం. ఏ నూనె ఆరోగ్యానికి మంచిదనే విషయంలో చాలా మందికి క్లారిటీ లేదు. ఆవనూనె మంచిదని కొందరు, తెల్లనూనె అని మరి కొందరు, నెయ్యి అని ఇంకొందరు సలహా ఇస్తుంటారు. ఐతే డైట్ విషయంలో అతిగా రూల్స్ ఫాలో అయి పూర్తిగా నూనె వాడకాన్ని మానేయడం మంచిదికాదంటున్నారు ఆరోగ్య నిపుణులు.
ఆలివ్ బెస్ట్
మిగిలిన నూనెలతో పోల్చితే ఆలివ్ ఆయిల్ బెటర్ గా ఉంటుందట. ఇది కేలరీలను తగ్గించడంలో సహాయపడుతుంది. నిజానికి, ఆలివ్ ఆయిల్ తక్కువ స్మోకింగ్ పాయింట్ కలిగిఉండటంతో వేపుళ్లకు ఇది బెస్ట్ ఆప్షన్. ఇందులో విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్యాటీ యాసిడ్స్ వంటి పోషకాలు కూడా ఎక్కువగా లభిస్తాయి.
కొబ్బరి-నువ్వుల నూనె
సౌత్ ఇండియాకు వస్తే వంట కోసం ఎక్కువగా కొబ్బరి నూనెన వినియోగిస్తారు. ఇందులో మీడియం చైన్ ఫయాటీ యాసిడ్స్ ఉండటం వల్ల శరీరంలోని కొవ్వును తగ్గించడంలో సహాయపడటంతో.. ఐతే ఇది ఎక్కువగా వాడితే మాత్రం హెల్త్ కి అంత మంచిది కాదు. నువ్వుల నూనె కూడా ఒక లిమిట్ వరకు మంచిదే..! ఇది శరీరంలో చెడు కొవ్వును కరిగిస్తుంది..!
ఆవ నూనె
ఇక ఆవ నూనె భారతీయ సాంప్రదాయ వంటకాలకు పెట్టింది పేరు. ఆవ నూనెలో గుండెతో పాటు శరీరంలోని ఇతర అవయవాలకు చాలా మంచిది. కాబట్టి ఆవనూనె విషయంలో ఎలాంటి భయాలు అవసరం లేదు. వీటితో పాటు అవకాడో ఆయిల్, బాదం-సీడ్ ఆయిల్, సన్ ఫ్లవర్ ఆయిల్ కూడా ఆరోగ్యానికి మంచిదే.
ఏ నూనె అయినా ఆరోగ్యానికి మంచిదే కానీ దానిని సరైన పద్ధతిలో, తగినంత మాత్రమే వినియోగించాలి. వాడిన నూనెను మళ్లీ వాడటం, గంటల తరబడి కాగిన నూనెలో వంటలు చేయడం వంటి వాటికి దూరంగా ఉండడమే ఆరోగ్యానికి మంచిది.