జంక్ ఫుడ్స్ బదులు రోజుకో గుప్పెడు శనగలు తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో!

ఇప్పుడంటే రకరకాల రెడీ మేడ్ స్నాక్స్, జంక్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్ అందుబాటులోకి వచ్చాయి కానీ ఒకప్పుడు స్నాక్స్ అంటే వేయించిన శనగలు, పల్లీలు, పెసలు, బొబ్బర్లు లాంటివి నానబెట్టి ఉడకబెట్టి ఉల్లిపాయతో పోపు వేసి నిమ్మకాయ పిండి తింటే ఆహా…రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం. అప్పట్లో అవే స్నాక్స్. వీటిలో విటమిన్స్, ఫైబర్, మినరల్స్, ఫ్యాటీ యాసిడ్స్ వంటి పోషకాలు మెండుగా ఉంటాయి. ఈ గింజలు అన్నీ మీకు అందుబాటులో లేకపోయినా డైలీ గుప్పెడు వేయించిన శనగలు తిన్నా చాలు…ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయో తెలుసా…

@ నిత్యం గుప్పెడు వేయించిన శనగలు తినడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఫలితంగా సీజనల్ అనారోగ్య సమస్యలు, ఇతర వ్యాధుల బారిన పడకుండా ఉండొచ్చు

@ రోజూ వేయించిన శనగలు తినడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు ఉండవు. ఆహారం త్వరగా జీర్ణం అవడంతో మల బద్ధకం ప్రాబ్లమ్ కూడా ఉండదు.

@ వేయించిన శనగల్లో ఫైబర్ కంటెంట్, పీచు పదార్థాలు ఎక్కువగా ఉంటుంది. ఇవి కొంచెం తిన్నా చాలు కడుపునిండినట్టు అనిపిస్తుంది. ఇక చిరుతిళ్లు తినాలి అనే ఆలోచన రాదు

@ తరచూ శనగలు తినడం వల్ల రక్త హీనత సమస్య ఉండదు. ఒకవేళ రక్తహీనత ఉన్నప్పటికీ ఈ శనగలు తింటే ఆ సమస్య నుంచి బయటపడొచ్చు. హిమోగ్లోబిన్ స్థాయి తక్కువగా ఉన్నవారికి శనగలు బెస్ట్ మెడిసిన్.

@ వేయించిన శనగల్లో ప్రోటీన్లు, ఫోలేట్, మెగ్నీషియం ఉంటాయి. ఇవి గుండె పని తీరును మెరుగు పరుస్తాయి. అలాగే గుండెకు సంబంధించిన సమస్యలు కూడా వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి.

@ వేయించిన శనగలు తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

@ వేయించిన శనగలు మధుమేహ వ్యాధిగ్రస్తులకు కూడా మేలు చేస్తాయి. ఇవి శరీరంలో గ్లూకోజ్‌ను గ్రహించి రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతాయి

గమనిక: ఆరోగ్య నిపుణులు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. దీనిని ఏ మేరకు విశ్వశించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం.