ఏపీ అసెంబ్లీలో ఎంత మంది బీజేపీ సభ్యులు – గోల్డ్ కొట్టడం ఖాయమేనా ?

2019 అసెంబ్లీలో బీజేపీకి సభ్యులు లేరు. కానీ ఈ సారి అంటే 2024లో మాత్రం ఎవరూ ఊహించనంత పెద్ద సంఖ్యలో బీజేపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో కనిపించనున్నారు, కూటమిలో భాగంగా పది అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ పోటీ చేసింది. సక్సెస్ రేట్ 70 శాతం వరకూ ఉంటుందని అంచనా వేస్తున్నారు.

ఐదు స్థానాల్లో బీజేపీకి క్లియర్ ఎడ్జ్

అసెంబ్లీ ఎన్నికల సరళిని విశ్లేషించిన తర్వాత బీజేపీ క్యాడర్ పది సీట్లో ఏడు సీట్లు గ్యారంటీగా వస్తాయన్న నమ్మకానికి వస్తున్నారు. విశాఖ నార్త్ నుంచి విష్ణుకుమార్ రాజు గెలిచి మరోసారి అసెంబ్లీలో అడుగు పెట్టనున్నారు. మోదీ మానియా ఆయనకు బాగా ప్లస్ అవుతోంది. ఆనపర్తిలో నల్లమిల్లి రామకృష్ణారెడ్డి బీజేపీ తరపున పోటీ చేయడం ప్లస్ అవుతోంది., ఆయన టీడీపీలో ఉంటే ఓ వర్గం ఓట్లు పడేవి కావు., విజయవాడ వెస్ట్ లో సుజనా చౌదరి ముందంజలో ఉన్నారు. ఆ టెంపో కొనసాగించారు. ఇక ధర్మవరం నియోజకవర్గంలోనూ అనూహ్యంగా సత్యకుమార్ విజయం దిశగా వెళ్తున్నారని పోలింగ్ ట్రెండ్స్ చెబుతున్నాయి. కైకలూరులో కామినేని శ్రీనివాస్ గెలుపు అభ్యర్థిత్వం ప్రకటించినప్పుడే ఖరారైయిందని చెబుతున్నారు. గతంలోనూ ఆయన గెలిచారు.

మరో మూడు స్థానాల్లో బీజేపీకి ఎడ్జ్

బద్వేలులో రోశన్న కూడా విజయానికి దగ్గరలో ఉన్నట్లుగా తెలుస్తోంది. కానీ అక్కడ వైసీపీ నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. ఆదోని నుంచి పోటీ చేసిన పార్థడెంటల్ చీఫ్ పార్థసారధి తన బెస్ట్ అన్న పర్ పార్మెన్స్ చూపించారు. ఆయన కూడా గెలుపుబాటులో ఉన్నారని కొన్ని సర్వేలు చెబుతున్నాయి. జమ్మలమడుగు నుంచి ఆదినారాయణరెడ్డి పోటీ చేశారు. అక్కడ పార్టీ బలంతో పాటు ఆయనకు వర్గ బలం కూడా తోడైంది., ఆయన గెలుపు ఖాయమయిందని బీజేపీ వర్గాలు నమ్మకంగా ఉన్నాయి.

హోరాహోరీ పోరులో రెండు స్థానాలు

శ్రీకాళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గాన్ని చివరి క్షణంలో బీజేపీకి కేటయించారు. ప్రచారంలో బీజేపీ అభ్యర్థి వెనుకబడ్డారు. అయితే సరైన సమయంలో పుంజుకున్నారని చెబుతున్నారు. ఇక అరకు స్థానం నుంచి పాంగి రాజారావు పోీ చేశారు. ఈ రెండు స్థానాలు డైలమాలో ఉన్నాయి. మిగతా అన్ని చోట్ల బీజేపీ విజయం ఖాయంగా కనిపిస్తోంది.