రోజుకి నీళ్లు ఎన్నిసార్లు తాగుతారని అడిగితే దాహం వేసినప్పుడల్లా తాగుతాం అని ఠక్కున సమాధానం చెబుతారు. బాటిల్ వాటర్ కన్నా మందుపై ఇంట్రెస్ట్ చూపించేవారి సంఖ్య ఎక్కువే. అసలు నీళ్లు తాగాలంటే బద్ధకంగా ఫీలయ్యేవారు చాలామంది ఉన్నారు. కానీ చాలా రోగాలకు ఇదే కారణం అవుతోంది. ఎందుకంటే శరీరం మూడోవంతు నీటితోనే నిర్మాణమై ఉంటుంది..కాబట్టి నీళ్లు సరిగా అందకపోతే రకరకాల సమస్యలు ఎదురవుతాయి..
కూర్చుని ఠక్కున లేవలేక అవస్థలు పడడం, కీళ్లు, కండరాలు నొప్పులు ఇబ్బంది పెడుతున్నాయంటే మీరు తక్కువ నీళ్లు తాగుతున్నారన్నమాట. ఎందుకంటే..కీళ్ల మధ్యలో ఉండే కార్టిలేజ్ 80 శాతం నీటితో నిర్మితమై ఉంటుంది. మీరు నీళ్లు తక్కువగా తాగినప్పుడు ఈ నొప్పుల వస్తాయి..
తరచూ తలనొప్పి వేధిస్తోందన్నా అందుకు కారణం నీళ్లు తక్కువగా తాగడమే. నీళ్లు తక్కువ తాగితే బ్రెయిన్ కి బ్లడ్ తక్కువ అందుతుంది ఫలితంగా డీహైడ్రేషన్ కలిగి తలనొప్పి వేధిస్తుంది.
జీర్ణవ్యవస్థకు కూడా నీళ్లు చాలా అవసరం. డీహైడ్రేషన్ కారణంగా, ఫ్లూయిడ్స్ తక్కువగా అందడం వల్ల ఈ సమస్య కనిపిస్తుంది
అలసట ,ఎనర్జిటిక్ గా, యాక్టివ్ గా లేకపోవటం అనేవి కూడా తక్కువ నీరుకు సంబంధించినదే… బ్లడ్ ప్రెజర్ తగ్గిపోతుంది. దీనివల్ల ఆక్సిజన్ సరిగా అందదు. ఇలాంటి లక్షణాలు మీలో కనిపించాయంటే శరీరానికి కావాల్సిన మోతాదులో నీళ్లు తాగడం లేదని అర్థం.
తరచుగా యూరిన్ కి వెళ్లకపోయినా మీరు సరైన స్థాయిలో నీళ్లు తాగడం లేదని గుర్తించాలి. రోజుకి 4 నుంచి 7 సార్లు యూరిన్ కివెళ్లాలి. అలాగే మీ యూరిన్ కలర్ ఎల్లో కలర్ లో ఉంది అంటే కూడా మీరు నీళ్లు తాగడం లేదని గుర్తించాలి.
తక్కువ నీళ్లు తాగితే బ్రెయిన్ ఫంక్షన్ పైనా ప్రభావం చూపుతుంది. మీ మూడ్, మెమరీ, డెసిషన్, ఏకాగ్రత వంటివాటిపై కూడా ఇది ప్రభావం చూపుతుంది.
పెదాలు ఆరిపోవడం , చర్మం ప్రకాశవంతంగా ఉండకపోవటం, పొడిబారిపోవటం, చెమట చాలా తక్కువగా పట్టడం ఇవన్నీ మీరు తక్కువ నీళ్లు తాగుతున్నారని చెప్పేందుకు సంకేతం..
గమనిక: ఆరోగ్య నిపుణులు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. దీనిని ఏ మేరకు విశ్వశించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం.