రాజకీయాలకు అతీతంగా మహానుభావులను గౌరవించడం అసలైన రాజనీతి. మోదీ నేతృత్వంలోని కేంద్రం ఈ విషయంలో పక్కాగా వ్యవహరిస్తోంది. సినీ, రాజకీయ రంగంలో ప్రభావశీల పాత్ర పోషించిన ఎన్టీఆర్‌కు కేంద్ర అరుదైన గౌరవం ఇచ్చింది. ఎన్టీఆర్ పేరు మీద రూ. 100 నాణెం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆవిష్కరించారు. రాష్ట్రపతి భవన్ లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఎన్టీఆర్‌పై 20 నిమిషాల వీడియో ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో వేదికపై రాష్ట్రపతితో పాటు ఎన్టీఆర్ కుటుంబసభ్యులందరూ పాల్గొన్నారు.
తెలుగువారికి ఇచ్చిన గౌరవం
ఎన్టీఆర్ పేరుతో వంద నాణెన్ని కేంద్రం విడుదల చేసింది. ప్రజల జీవితాల్లో ప్రభావవంతమైన మార్పులు తెచ్చిన యుగపురుషునిగా ఆయనకు ఇది అరుదైన గౌరవం. సినీ నటుడిగా ఎవరూ అధిరోహించలేనంత ఉన్నత శిఖరాలను అందుకున్న ఎన్టీఆర్ .. రాజకీయరంగంలోనూ తనదైన ముద్ర వేశారు. ఆయనను గౌరవించుకోవడం అందరి బాధ్యత. అయితే రాజకీయాల్లోకి వచ్చాక… అందరి వాడు కాస్తా కొందరి వారు అవుతారు. ఆయన పేరును రాజకీయంగా కొన్ని పార్టీలు ఉపయోగించుకుంటూ ఉండటంతో ఇతర పార్టీలు గౌరవం ఇవ్వవు. కానీ అలాంటి ఆలోచనలకు కేంద్రం దూరం. తెలుగు వారందరికీ గౌరవం ఇచ్చేలా నాణెన్ని విడుదల చేశారు.
రాజకీయ లాభాల కోసం చూసుకోని కేంద్రం
రాజకీయ ప్రత్యర్థులుగా వ్యవహరించినప్పుడు రాజకీయ దిగ్గజాలను గుర్తించేందుకు బీజేపీ ఏ మాత్రం వెనుకాడదు. రాజకీయాల్లో ఉన్నప్పుడు ఎన్టీఆర్ కొంత మందికి దూరం అయ్యారు. అయితే అప్పటికీ ఆయన ప్రజలందరి అభిమానాన్ని నటుడిగా పొందారు. రాజకీయ నాయకుడిగా చారిత్రక నిర్ణయాలతో ప్రజల గుండెల్లో నిలిచారు. నిరుపేదలు కూడా బియ్యం అన్నం తినేందుకు తాను సీఎం అవ్వగానే రెండు రూపాయలకు కిలోబియ్యం పథకాన్ని ప్రవేశ పెట్టారు. ఇలా ఆకలి తీర్చిన ఎన్టీఆర్ తర్వా పేదంలదర్నీ… ఉన్నత స్థాయికి తీసుకొచ్చేందుకు అనేక నిర్ణయాలు తీసుకున్నారు. పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేయడంతో పాటు తెలంగాణలో బీసీ వర్గాలు పైకి రావడానికి రాజకీయ అధికారాన్ని ఇచ్చారు. అందుకే కేంద్రం ఆయన సేవల్ని గుర్తించింది.
పరిశీలనలో భారత రత్న డిమాండ్
ఎంత గొప్ప వ్యక్తి అయినా… రాజకీయాల్లోకి వచ్చాక కొంత మందికి వ్యతిరేకం అవుతారు. అయితే అది ఆయనను రాజకీయంగా వ్యతిరేకించడమే అవుతుంది. కానీ వ్యక్తిగతంగా… ఆయన విజయాలు, చేసిన మేళ్ల పట్ల ప్రజలందరూ ఎప్పుడూ కృతజ్ఞతతోనే ఉంటారు. ఆయనను స్మరించుకుంటూనే ఉంటారు. అందుకే… ఆయనకు భారత రత్న ప్రకటించాలన్న డిమాండ్ కు మద్దతు లభిస్తూనే ఉంటుంది. ఇది ఎన్టీఆర్ కుటుంబసభ్యులతో పాటు తెలుగు వారందరికీ లభించిన గౌరవంగా భావించవచ్చు.