తేనె-కలబంద చాలు..మేకప్ వేసుకోవాల్సిన అవసరం లేదు!

అందం కోసం అమ్మాయిలు చేయని ప్రయత్నాలు ఉండవు. రకరకాల క్రీములు రాస్తుంటారు, ఫేషియల్ లు చేయించుకుంటారు. మేకప్ లు వేసుకుంటారు..ముఖానికి రంగులు పూసుకుంటారు. అయితే ఇవి బెడిసికొట్టాయంటే చాలు ముఖం మొత్తం మారిపోతుంది. చర్మం సహజత్వాన్ని కోల్పోతుంది. అయితే తేనె, కలబంద చాలు…ఇంత హడావుడి చేయాల్సిన అవసరం రాదంటున్నారు సౌందర్య నిపుణులు.

తేనె-కలబంద చాలు
చర్మం రంగుకోసం, మొటిమలు తగ్గడం కోసం, చర్మంలో మెరుపుకోసం చాలా ప్రయత్నాలు చేస్తుంటారు..అయితే అత్యంత బెస్ట్ టిప్ ఏంటంటే కలబంద, తేనె. ఓ వారంపాటూ వీటిని వినియోగిస్తే మీ ముఖంలో వచ్చే తేడాను గమనించవచ్చు. ఇందుకోసం అలోవెరా జెల్ తీసుకుని అందులో ఓ స్పూన్ తేనె మిక్స్ చేసి పేస్ట్ లా చేసుకుని దీన్ని చర్మానికి పట్టించి ఆరిన తర్వాత కడిగేయాలి. దీన్ని అప్లై చేసి స్కిన్ క్లీన్ చేసుకునే సమయంలో అస్సలు సోప్ వినియోగించకూడదు. వారం రోజులు దీన్ని అప్లై చేస్తే మీరు ఊహించనంత మార్పు వస్తుంది.

చర్మసమస్యలకు చక్కని పరిష్కారం
తేనె-కలబంద ఫేస్ ప్యాక్ చర్మంలో బ్లాక్ హెడ్స్ ను తొలగించడంలో సహాయపడుతుంది. సూర్యకాంతి వల్ల చర్మంపై వచ్చే చికాకును ఇది తొలగిస్తుంది. ముఖానికి మాత్రమే కాదు మెడను కూడా మెరిసిపోయేలా చేస్తుంది. స్కిన్ మెరుపు మాత్రమే కాదు..పొడిచర్మానికి కూడా ఈ మిశ్రమం మంచి ఫలితాన్నిస్తుంది. ఎందుకంటే కలబందలోని గుణాలు చర్మానికి మాయిశ్చరైజింగ్ లక్షణాలను అందిస్తాయి. దీన్ని రెగ్యులర్ గా వినియోగించినా ఏమీకాదు…

మచ్చలు-జిడ్డు చర్మానికి మంచిది
చిటికెడు పసుపు, ఒక చెంచా పాలు, కొంచెం రోజ్‌వాటర్, చెంచా తేనె.. వీటన్నింటినీ కలబంద గుజ్జును కూడా జతచేసి మరోసారి కలుపుకోవాలి. దీన్ని ముఖానికి, మెడకు పట్టించి ఇరవై నిమిషాలు ఉంచుకోవాలి. తర్వాత శుభ్రంగా కడిగేసుకుంటే ముఖం కాంతివంతమవుతుంది. జిడ్డు చర్మతత్వం ఉన్న వారిని మొటిమల సమస్య వేధిస్తుంది. ఇలాంటి వారు కలబంద ఆకుని నీళ్లలో కాసేపు మరిగించి దాన్ని పేస్ట్‌లాగా చేసుకోవాలి. దానికి కొన్ని చుక్కల తేనె కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. పదిహేను నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడిగేసుకోవాలి. ఇలా వారానికోసారి చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది. గాయాల వల్ల చర్మంపై ఏర్పడిన మచ్చలు పోగొట్టడంలోనూ కలబంద గుజ్జు ఉపయోగపడుతుంది. ఇందుకోసం కలబంద గుజ్జులో కాస్త రోజ్‌వాటర్ వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని మచ్చలపై అప్లై చేసి ఇరవై నిమిషాల పాటు అలాగే ఉంచుకోవాలి. ఆ తర్వాత చల్లటి నీటితో శుభ్రంగా కడిగేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

గమనిక: ఆరోగ్య నిపుణులు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. దీనిని ఏ మేరకు విశ్వశించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం