ఏపీలో పొత్తుల వ్యవహారం మరోసారి హాట్ టాపిక్ గా మారింది. టీడీపీ, జనసేన మధ్య విబేధాలు బయటకు రావడంతో.. తెలుగుదేశం పార్టీ పొత్తులు పెట్టుకునే పార్టీలతో వ్యవహరించే తీరుపైమరోసారి చర్చ ప్రారంభమయింది. నిజానికి టీడీపీతో పొత్తు పెట్టుకున్న పార్టీ బాగుపడిన దాఖలాలు ఉమ్మడి ఏపీలోనే లేవు. ఇప్పుడు జనసేన పార్టీకి ఆ పరిస్థితి ఎదురవుతుందన్న సందేహాలు ఉన్నాయి.
ఎన్టీఆర్ టైంలో బీజేపీ, కమ్యూనిస్టులతో టీడీపీ పొత్తులు – ఆ రెండు పార్టీలకు గండం
ఎన్టీఆర్ పార్టీ పెట్టిన తర్వతా బీజేపీ, కమ్యూనిస్టులతో వేర్వేరుగా వివిధ ఎన్నికల్లో కలిసి పోటీ చేశారు. ఆ ఎన్నికల వరకూ కొన్ని సీట్లు కేటాయించి గెలిపించినా తర్వాత ఆ పార్టీల ఎదుగుదలపై తీవ్ర ప్రభావం చూపించింది. ఈ రెండింటికి పదిహేను శాతం వరకూ ఓటు బ్యాంక్ ఉండేది. కానీ తర్వాత కాలంలో రెండు పార్టీలు తీవ్రంగా ఇబ్బంది పడ్డాయి. టీడీపీ పొత్తులు పెట్టుకుని ఇతర పార్టీలను నిర్వీర్యం చేసే వ్యూహంలో భాగం కావడమే దీనికి కారణం.
తీవ్రంగా నష్టపోయిన బీజేపీ
టీడీపీకి తనకు అవసరం అయినప్పుడల్లా బీజేపీతో పొత్తునకు వ్తుంది. కానీ ఎప్పుడు పొత్తు పెట్టుకుని బీజేపీని నిర్వీర్యం చేయడానికే. ఎదుగుతున్న సమయంలో పొొత్తులు పెట్టుకుని కొన్ని సీట్లు కేటాయించి తర్వాత ఎదగకుండా చేస్తుంది. ఉమ్మిడి రాష్ట్రంలో అదే పరిస్థితి. ఉమ్మడి రాష్ట్రంలో బీజేపీకి ఓ సందర్భంలో పదిహేను శాతానికిపైగా ఓటింగ్ ఉండేది. పొత్తుల పేరుతో చంద్రబాబు నిర్వీర్యం చేశారు. అసలు నిజం తెలుసుకునే సరికి చేయిదాటిపోయింది. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో బీజేపీ ఎలా బలపడిందో చూస్తూనే ఉన్నారు. టీడీపీ లేకపోయినా.. బీజేపీ అధికారానికి చేరువగా వచ్చింది. వ్యూహాత్మక తప్పిదాలతో వెనుకబడినా వచ్చే ఎన్నికల్లో విజయం ఖాయమయింది. కానీ ఏపీబీజేపీపై ఇంకా టీడీపీ నీడ కొనసాగుతూనే ఉంది.
అలాంటి పరిస్థితి వస్తుందని జనసేన భయం
టీడీపీతో పొత్తులు పెట్టుకుని నిర్వీర్యం అయిపోయిన పార్టీల పరిస్థితే వస్తుందని.. జనసేన పార్టీ భయపడుతున్నట్లుగా కనిపిస్తోంది. చంద్రబాబు వ్యూహాలు అలాగే ఉన్నాయని.. తమతో మాట మాత్రం చెప్పకుండా అభ్యర్థుల్ని ప్రకటిస్తున్నారని అంటున్నారు. ఇప్పుడు ముందుగానే మేలుకున్న జనసేన.. పోటీగా అభ్యర్థుల్ని ప్రకటిస్తున్నారు. ఈ వ్యవహారంతో ఇప్పుడు సంచలనాత్మకం అవుతుంది. పవన్ తన పార్టీని కాపాడుకుంటారని అంచనా వేస్తున్నారు.