నేచురల్ స్టార్ నానికి నాలుగేళ్ల నుంచి హిట్ లేదు. సినిమాలు చేస్తూనే ఉన్నాడు కానీ ఒక్క సక్సెస్ కూడా అందుకోలేకపోయాడు. మరి రేసులో వెనుకపడిపోయాననో లేదా పక్కా ప్లాన్నింగ్ తో హిట్ కొట్టకపోతే కష్టమని అనుకున్నాడో తెలీదు కానీ… మాస్టర్ స్కెచ్ తో హిట్లు కొడుతున్నాడు. దసరాతో హిట్ అందుకున్న నాని.. ఇప్పుడు తన కొత్త సినిమా పేరుని ప్రకటించకుండా రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశాడు. ఈ ఏడాది డిసెంబర్ 21న నాని కొత్త సినిమా రిలీజ్ కాబోతుంది. ఇందులో నాని సరసన మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తోంది.
డబ్బులొస్తే హిట్ అయినట్లే హిట్ విషయంలో ఎవ్వరికీ ఎలాంటి అభిప్రాయాలు అయినా ఉండనీ నానికి మాత్రం స్పష్టమైన అభిప్రాయం ఉంది. అదేంటంటే పెట్టిన పెట్టబడి రెండు రోజుల్లో వెనక్కి వచ్చేయాలి. నాలుగు రోజుల్లో లాభాలు కూడా వచ్చేయాలి. ఆ తర్వాత వచ్చేదంతా బోనస్. అలా వస్తేనే సినిమా హిట్ అని బలంగా నమ్ముతాడు. నాలుగు డబ్బులు తెచ్చిపెడితేనే నానిని కూడా డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్లు నమ్ముతారు. దీంతో… తన సినిమాకు ఎలాంటి టాక్ వచ్చినా కూడా మొదటి నాలుగు రోజులు లాభాలతో సహా వెనక్కి వచ్చేలా తన సినిమాను రిలీజ్ చేసుకుంటున్నాడు. త్వరలో తీయబోయే కొత్త సినిమా డిసెంబర్ 21న విడుదల అవుతుంది. డిసెంబరు 21 గురువారం. అంటే దాదాపు విద్యార్థులకు క్రిస్మస్ హాలిడేస్ ఇస్తారు. 22 మినహాయిస్తే 23, 24 వీకెండ్. 25 క్రిస్మస్. సో… వరుసగా నాలుగు రోజులు కలెక్షన్లు కుమ్ముకోవచ్చన్నమాట
దసరాకు ఇదే స్ట్రాటజీ
దసరా ముందు వరకు నానికి హిట్ వచ్చి మూడేళ్లు అయ్యింది. భారీ అంచనాలతో వచ్చిన సినిమాలు అన్నీ తుస్సుమన్నాయి. దీంతో.. దసరాను పక్కానా ప్లాన్ చేసుకుని మార్చి 30న రిలీజ్ చేశాడు. మార్చి 31 గుడ్ ఫ్రైడే, ఏప్రిల్ 1 రెండో శనివారం, ఏప్రిల్ 2 ఆదివారం. ఇలా దసరా సినిమాకు కూడా నాలుగు రోజులు కలిసొచ్చేలా ప్లాన్ చేసుకున్నాడు. వేరే సినిమాలు కూడా లేకపోవడంతో.. ఆడియన్స్ అంతా దసరాకు పోటెత్తారు. దీంతో… అన్నీ చోట్లా మంచి కలెక్షన్లు వచ్చాయి. అదీగాక మార్చిలో అలాగే డిసెంబరు పెద్ద హీరోల సినిమాలు ఉండవు. ఏప్రిల్ లో సెలవలు, డిసెంబరులో తర్వాత సంక్రాంతి సీజన్ ఉండడంతో… పెద్ద హీరోల సినిమాలు అన్నీ ఆ టైమ్ లోనే వస్తాయి. దీంతో… నాని సినిమాకు కాంపీటీషన్ కూడా లేదు. ఇలా తన సినిమాల రిలీజ్ కు అద్భుతమైన ప్లాన్నింగ్ లో రిలీజ్ చేస్తున్నారు నాని.