గ్యాస్ట్రిక్ సమస్యకు మందులు వాడకుండా శాశ్వత పరిష్కారం ఇదిగో!

గ్యాస్ట్రిక్..ఇప్పుడు చాలామందిని పట్టి వేధిస్తున్న సమస్య. ఏదైనా తినేటప్పుడు నోటికి రుచిగా ఉందని హాయిగా లాగించేస్తారు కానీ ఆ తర్వాత ఇబ్బంది పడతారు. పరిస్థితి తీవ్రం అయ్యాక ట్యాబ్లెట్స్, సిరఫ్ లు వినియోగిస్తుంటారు. అయితే అవేమీ లేకుండా సింపుల్ చిట్కాలతో గ్యాస్ట్రిక్ సమస్యకు పూర్తిగా చెక్ పెట్టేయవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు…

గ్యాస్ స‌మస్య రెండు ర‌కాలు
చాలా మందిని గ్యాస్ ట్ర‌బుల్ వేధిస్తూ ఉంటుంది. గ్యాస్ స‌మస్య రెండు ర‌కాలుగా ఉంటుంది. కొంద‌రు క‌డుపులో గ్యాస్ స‌మ‌స్య‌తో బాధ‌పడితే మ‌రికొంద‌రు మ‌లం ప్రేగులో గ్యాస్ స‌మస్య‌తో బాధ‌ప‌డుతూ ఉంటారు. ఆహారంలో చిన్న చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా ఈ సమస్య నుంచి శాశ్వతంగా బయటపడొచ్చని నిపుణులు చెబుతున్నారు…

పరగడపునే గోరువెచ్చటి నీరు
మ‌లం ప్రేగు శుభ్రంగా లేకపోవ‌డం వ‌ల్ల తిన్న ఆహారం స‌రిగ్గా జీర్ణం అవ్వ‌దు. దీంతో ఆహారాలు పులిసి గ్యాస్ ఎక్కువ‌గా ఉత్ప‌త్తి అవుతుంది. రోజూ ఉద‌యం ప‌ర‌గ‌డుపున లీట‌రుంపావు గోరు వెచ్చ‌ని నీటిని తాగాలి. ఇలా తాగ‌డం వ‌ల్ల మ‌ల‌బ‌ద్ద‌కం స‌మ‌స్య త‌గ్గుతుంది. గంట తర్వాత మళ్లీ గోరువెచ్చటి నీరు తాగాలి. ఇలా చేస్తే పొట్ట పూర్తిగా ఖాళీ అవుతుంది. గ్యాస్ ఫామయ్యే ఛాన్స్ ఉండదు.

భోజనం అయ్యాక గ్యాప్ ఇచ్చి వాటర్ తాగండి
చాలా మంది భోజ‌నం, అల్పాహారం తీసుకుంటూ నీళ్లు తాగుతారు. ఇలా తాగ‌డం వ‌ల్ల జీర్ణ‌ర‌సాలు ప‌లుచబ‌డ‌తాయి. తిన్న ఆహారం జీర్ణ‌మ‌వ్వ‌డానికి స‌మ‌యం ఎక్కువ‌గా ప‌డుతుంది. ఆహారం ఇలా నిల్వ ఉండ‌డం వ‌ల్ల గ్యాస్ ఎక్కువ‌గా త‌యార‌వుతుంది. క‌నుక తినేట‌ప్పుడు నీటిని తాగ‌కూడ‌దు. విధంగా రోజుకు 3 సార్లు మాత్ర‌మే ఆహారాన్ని తీసుకోవాలి. భోజ‌నానికి భోజ‌నానికి మ‌ధ్య‌లో ఏమీ తినకూడదు. తిన్న ఆహారం జీర్ణం అవకుండా మళ్లీ మళ్లీ తినడం వల్ల కూడా గ్యాస్ సమస్య వేధిస్తుంది.

ఇప్పటికే గ్యాస్ట్రిక్ తో తీవ్రంగా బాధపడేవారు..నిత్యం సాయంత్రం సమయంలో పండ్లు తీసుకోవాలి. రెగ్యులర్ గా ఫ్రూట్స్ ని డైట్ లో చేర్చుకుంటే తీవ్రమైన సమస్య నెమ్మదిగా తగ్గుముఖం పడుతుంది. మరీ ముఖ్యంగా సాయంత్రం 7 లోపు ఆహారం తీసుకోవాలి. ఇలా తీసుకోవ‌డం వ‌ల్ల రాత్రంతా పొట్ట‌, ప్రేగులు పూర్తిగా ఖాళీ అవుతాయి. గ్యాస్ సమస్య చాలా వరకూ తగ్గుతుంది. ఈ అలవాట్లను రెగ్యులర్ గా ఫాలో అయితే మందులతో పనిలేకుండా గ్యాస్ట్రిక్ సమస్య నుంచి బయటపడొచ్చని నిపుణులు సూచిస్తున్నారు.