డైజెస్టివ్ గోలీల గురించి విన్నారా – ఇంట్లోనే తయారు చేసేసుకోవచ్చు!

కడుపు ఉబ్బరం, గ్యాస్ ట్రబుల్ వంటి సమస్యలతో బాధపడుతున్నవారికి ఉపశమనం కలిగించేందుకు కాస్త జీలకర్ర నోట్లో వేసుకుని నమిలి వేడి నీళ్లు తాగమంటారు. దాంతో తక్షణ ఉపశమనం లభిస్తుంది.అయితే జీలకర్ర వాటర్ మాత్రమే కాదు..గోళీలు కూడా తయారు చేసుకోవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు..

జీల‌క‌ర్ర‌ను మ‌నం ఎక్కువ‌గా వంట‌ల్లో వినియోగిస్తుంటారు. వంట‌ల‌కు చ‌క్క‌ని రుచి, వాస‌న వ‌స్తాయి. జీల‌క‌ర్ర‌లో యాంటీ ఇన్‌ఫ్లామేట‌రీ ల‌క్ష‌ణాలు , యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇది యాంటీ బాక్టీరియ‌ల్‌, యాంటీ సెప్టిక్ ల‌క్ష‌ణాల‌ను కూడా క‌లిగి ఉంటుంది. దీని వ‌ల్ల పొట్ట ద‌గ్గ‌రి కొవ్వును క‌రిగించుకోవ‌చ్చు. జీర్ణ‌వ్య‌వ‌స్థ ఆరోగ్యం మెరుగు ప‌డుతుంది. వికారం, గ్యాస్‌, మ‌ల‌బ‌ద్ద‌కం త‌గ్గుతాయి. రోజూ ఉద‌యాన్నే ఒక గ్లాస్ జీల‌క‌ర్ర నీటిని తాగితే ఎన్నో ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. జీలకర్ర జీర్ణ ఎంజైమ్‌ల ఉత్పత్తిని ప్రేరేపించగల సమ్మేళనాలను కలిగి ఉంది, ఇది జీర్ణశక్తిని పెంచుతుంది. ఫైబర్, ఇనుము, జింక్, రాగి, మెగ్నీషియం వంటి ముఖ్యమైన ఖనిజాలతో నిండిన జీలకర్ర జీర్ణ సంబంధిత సమస్యలను నివారిస్తుంది. కొంతమంది ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఒక గ్లాసు జీలకర్ర నీటిని తాగుతారు. జీలకర్ర నీరు బరువు తగ్గడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది. అయితే జీలకర్ర వాటర్, వంటల్లో వినియోగం మాత్రమే కాదు..వీటితో డైజెస్టివ్ గోళీలు కూడా తయారు చేసుకోవచ్చు.

జీలక్ర గోళీలు తయారీ
జీలకర్ర గోళీలు తయారీ విధానం చాలు సులభం. దీనికి కావలసిన పదార్ధాలు.. జీలకర్ర, నల్ల మిరియాలు, రాళ్ల ఉప్పు, నల్ల ఉప్పు, నిమ్మరసం, ఇంగువ, యాలకుల పొడి, చక్కెర పౌడర్ అవసరం. ముందుగా జీలకర్రను సన్నని మంట మీద వేయించుకోవాలి. తర్వాత వాటిని చల్లార్చి మెత్తగా పొడి చేసుకోవాలి. ఈ జీలకర్ర పొడికి, నల్ల మిరియాల పొడి, రాక్ సాల్ట్, బ్లాక్ సాల్ట్, యాలకుల పొడి, ఇంగువ, చక్కెర పౌడర్ వేసి ఒక గిన్నెలో కలపాలి. ఈ పదార్థాలన్నీ బాగా కలిసిని తర్వాత ఆ మిశ్రమానికి నిమ్మరసం జోడించాలి. వాటిని చిన్న చిన్న గోళీల్లా చేసుకోవాలి. వీటిని మళ్లీ చక్కెర పౌడర్ లో దొర్లిస్తే చూడడానికి, తినడానికి బావుంటాయి. ఈ డైజెస్టివ్ గోలీలను తయారు చేసి రిఫ్రిజిరేటర్‌లో నిల్వ చేసుకోవచ్చు.

రోజుకొకటి వేసుకోవాలి
మెరుగైన జీర్ణక్రియ కోసం ప్రతి రోజు భోజనానంతరం ఒకటి తీసుకోవచ్చు. వీటిని డైలీ వినియోగించడం వల్ల ఆహారం తేలిగ్గా జీర్ణం అవుతుంది. గ్యాస్ సమస్యలు ఉండవు. కడుపు ఉబ్బరం తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు చెప్పారు.

గమనిక: ఆరోగ్య నిపుణులు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. దీనిని ఏ మేరకు విశ్వశించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం.