కృష్ణ ఫలం తిన్నారా ఎప్పుడైనా – ఎంత ఆరోగ్యమో!

సీతాఫలం, రామా ఫలం గురించి వినే ఉంటారు..మరి కృష్ణఫలం గురించి విన్నారా? దీనివల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయో తెలుసా.
భారతదేశంలో ఈ పండుని ప్యాషన్‌ ఫ్రూట్‌ అని పిలుస్తారు. దీని శాస్త్రీయ నామం పాసిఫ్లోరా ఎడులిస్. ఇది ఉష్ణమండల పండు, ఇది ఒక విలక్షణమైన రూపాన్ని కలిగి ఉంటుంది. చూడటానికి గుండ్రంగా లేదా ఓవెల్‌ ఆకారంలో ఉంటుంది. దీని బయటి భాగం గట్టిగా ఉంటుంది. లోపలి భాగం జ్యూ’సీగా మెత్తగా ఉంటుంది. ఎక్కువగా ఊదా లేదా తిక్‌ మెరూన్‌ కలర్‌లో లేదా పసుపు రంగులో ఉంటాయి. ఈ పండును ఆహారంగా తీసుకుంటే కలిగే ప్రయోజనాలేంటో చూద్దాం.

గుండె ఆరోగ్యం కోసం
గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కృష్ణ ఫలం చాలా ఉపయోగపడుతుంది. ఇందులో పొటాషియం పుష్కలంగా ఉండడంతో శరీరంలో ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్‌ని ,శరీరం అంతటా కండరాల పనితీరును నియంత్రిస్తుంది. దీని పై తొక్క గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో కూడా ప్రభావవంతంగా ఉంటుంది.

క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది
కృష్ణ ఫలం రసంలో క్యాన్సర్ నిరోధక గుణాలు ఉన్నాయి. ఇది గ్యాస్ట్రిక్, క్యాన్సర్ నుంచి రక్షించగలదు. దీనిలోని విటమిన్ A , C యాంటీఆక్సిడెంట్ ప్రభావాన్ని ప్రదర్శించడం ద్వారా ఫ్రీ రాడికల్స్‌ను తటస్థీకరించి క్యాన్సర్‌కు వ్యతిరేకంగా రక్షణ అందిస్తుంది.

చర్మానికి
చర్మంలో మెరుపు పెంచేందుకు కృష్ణఫలం ఉపయోగపడుతుందని కొన్ని అధ్యయనాల్లో పేర్కొన్నారు.ఈ గింజల నుంచి తయారైన నూనె చర్మంలో మెరుపు పెంచుతుంది, ముడుతలు పోగొడుతుంది.

జీర్ణక్రియ కోసం
కృష్ణ ఫలం ఉండే ఫైబర్ ప్రేగు కదలిక ప్రక్రియను సులభతరం చేయడం ద్వారా జీర్ణవ్యవస్థను శుభ్రపరచడంలో సహాయపడుతుంది. జీర్ణక్రియకు సహాయపడటమే కాకుండా, గ్యాస్ట్రిక్ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడానికి ఉపయోగపడుతుంది

బరువు తగ్గించుకోవచ్చు
బరువు తగ్గించే గుణాలు దీనిలో ఉన్నాయి. నిజానికి, కృష్ణ ఫలం సారం యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంది. బరువు తగ్గించే ఆహారంలో ఈ పండును చేర్చడం ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే, దానితో పాటు, బరువు తగ్గడానికి సమతుల్య ఆహారం , వ్యాయామం, యోగా కూడా అవసరం.

రక్తాన్ని పెంచుతుంది
శరీరంలో ఎర్ర రక్త కణాల సంఖ్య తగ్గించేందుకు కృష్ణఫలం ఉపయోగపడుతుంది. ఇందులో ఐరన్, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. ఇవి హిమోగ్లోబిన్ పర్సంటేజ్ ని పెంచుతాయి.

కళ్లకు చాలా ఉపయోగం
కృష్ణ ఫలంలో విటమిన్ ఎ, విటమిన్ సి ఫ్లేవనాయిడ్స్ మంచి మొత్తంలో ఉండడంతో ఇవి కంటి ఆరోగ్యానికి మంచిది. మాక్యులార్ డీజెనరేషన్, క్యాటరాక్ట్ , నైట్ బ్లైండ్‌నెస్‌ను కూడా నివారిస్తుంది. ఈ పండులోని అధిక యాంటీఆక్సిడెంట్ కంటెంట్ ముడతలను తగ్గించడంలో సహాయపడుతుంది.

మధుమేహులకు మంచిది
కృష్ణఫలంలో తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ 10.4% అధిక ఫైబర్ కంటెంట్ కలిగి ఉంటుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇన్సులిన్ స్థాయిలను నిర్వహించడానికి ఇది చాలా మంచిది. ఇందులో ఫైబర్ అధికంగా ఉంటుంది.

గమనిక: ఆరోగ్య నిపుణులు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. దీనిని ఏ మేరకు విశ్వశించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం.