జామపండు అంటే ఇష్టపడని వారుండరు. ఇందులో పోషకాలు అధికంగా ఉంటాయి, ఆరోగ్యానికి చాలా మంచిది. మధుమేహం ఉన్నవారు కూడా ఎంచక్కా తినొచ్చు. అయితే మీకు ఆకుపచ్చ జామకాయలు తెలుసు..మరి నల్లజామకాయల ప్రత్యేకత తెలుసా..
జామకాయ తింటే ఎన్ని ఉపయోగాలో
రోజుకో జామకాయ తింటే ఎన్ని ఉపయోగాలో తెలుసా.. రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది, రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది, గుండె ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది. రోజుకో జామకాయ తింటే చాలు చాలా అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టొచ్చు. రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం. అందుకే జామకాయను ఇష్టంగా తింటారంతా. అయితే ఆకుపచ్చగా ఉండి లోపల తెల్లగా ఉంటాయి కొన్ని, లోపల పింక్ కలర్ లో మరింత అట్రాక్టివ్ గా ఉంటాయి మరికొన్ని. ఇవి అందరూ తినే ఉంటారు..మరి నల్లగా ఉండే జామకాయలు చూశారా, తిన్నారా, వాటివల్ల ఉపయోగం ఏంటో తెలుసా…
నల్ల జామకాయల్లో పోషకాలు అధికం
నల్ల జామకాయలు పైన నల్లగా ఉన్నప్పటికీ లోపల ఎర్రటి గుజ్జు ఉంటాయి. ఈ చెట్టు ఆకులు, పువ్వులు, కాండం కూడా నలుపు రంగులోనే ఉంటుంది. ఈ నల్ల జామకాయల గురించి చాలా మందికి తెలిసి ఉండదు. సాధారణ జామకాయల కంటే వీటిలో పోషకాలు మరింత ఎక్కువగా ఉంటాయి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు, మినరల్స్, పీచు పదార్థాలతో పాటు విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ సి వంటి ఎన్నో పోషకాలు ఉంటాయి.
@ నల్ల జామకాయలను తీసుకోవడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. తరచూ ఇన్ఫెక్షన్ ల బారిన పడకుండా ఉండవచ్చు
@ ఈ జామకాయలను తినడం వల్ల శరీరానికి కావల్సిన పోషకాలు అందుతాయి. చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరిచి వృద్దాప్య ఛాయలు దరి చేరకుండా చేయడంలో సహాయపడతాయి
@ నల్ల జామకాయల్లో పీచు పదార్థాలు ఎక్కువగా ఉంటుంది..ఈ పండ్లు తీసుకోవడం వల్ల మలబద్దకం సమస్య తగ్గుతుంది, జీర్ణక్రియ సాఫీగా సాగుతుంది
@ రక్తహీనత సమస్యతో బాధపడే వారు ఈ నల్ల జామకాయలను తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఐరన్ కూడా ఎక్కువగా ఉంటుంది.
@ ఎర్ర రక్తకణాలు ఎక్కువగా తయారయ్యేలా చేసి రక్తహీనతను తగ్గించడంలోదోహదపడతాయి. షుగర్ లెవల్స్ తగ్గుతాయి. డయాబెటిస్ ఉన్నవారికి ఇది ఎంతగానో మేలు చేస్తుంది
@ నల్ల జామకాయలు తింటే బరువు తగ్గుతారు. శరీరంలోని కొవ్వు కరుగుతుంది.
మామూలు జామకాయల్లో కూడా ఇవే పోషకాలుంటాయి…కానీ నల్ల జామకాయల్లో అధికంగా ఉంటాయంటారు ఆరోగ్య నిపుణులు…
గమనిక: ఆరోగ్య నిపుణులు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. దీనిని ఏ మేరకు విశ్వశించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం.