కోట్లలో రెమ్యునరేషన్ తీసుకుంటుంది కానీ ప్రమోషన్ కార్యక్రమాల్లో అస్సలు పాల్గొనదు నయనతార. ఎంత పెద్ద సినిమా అయినా, ఎంత పెద్ద హీరో అయినా తన రూల్స్ విషయంలో తగ్గదేలే అన్నట్టుండేది. కానీ లేటెస్ట్ గా రూట్ మార్చింది లేడీ సూపర్ స్టార్…
నిన్నటి వరకూ తగ్గేదే లే అంది
లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమా ప్రచార కార్యక్రమాల్లో అస్సలు పాల్గొనదు. ఓ సినిమాకి సైన్ చేసే ముందు టెర్మ్స్ అండ్ కండీషన్స్ లో ఈ పాయింట్ కచ్చితంగా ఉంటుంది. అందుకు ఒకే అయి తేనే నిర్మాతలతో అగ్రిమెంట్ చేసుకుంటుంది. లేదంటే ఎన్ని కోట్లు పారితోషికం ఇస్తానన్నా ఆసినిమా ని వదులుకుంటుంది తప్ప సైన్ చేయదు. అయినప్పటికీ దర్శకనిర్మాతలు ఆమెకోసం క్యూ కడుతున్నారంటే అదీ ఆమె క్రేజ్.
ప్రచారం ప్రారంభించిన నయన్
అయితే రీసెంట్ గా నయన్..తన భర్త విగ్నేష్ శివన్ తో కలిసి వ్యాపార రంగంలోకి దిగింది. అది సొంత వ్యాపారం కావడంతో తమ ఉత్పత్తుల కోసం తానే స్వయంగా రంగంలోకి దిగి ప్రచారం మొదలు పెట్టింది. ఈ విషయంలో నయన్ పై కొంత వ్యతిరేకత కూడా వ్యక్తమైం ది. సొంత వ్యాపారం కాబట్టి తనకు తానుగా ప్రచారం చేసుకుంటుంది. అదే ఓ సినిమాకి పారితోషికం తీసుకుంటుంది గానీ ఆ సినిమా ప్రచారానికి రాదు .ఇదేం న్యాయం అంటూ కోలీవుడ్ లో కాస్త అసహనం కూడా వ్యక్తమైంది. అయినా వాటిని నయనతార పట్టించుకోలేదనుకోండి.
మరో షాక్ ఇచ్చిన నయన్
తన వ్యాపారాన్ని బాగానే ప్రమోట్ చేసుకుంటోంది కదా అన్నవారికి షాకిస్తూ తొలిసారి ఓ సినిమా గురించి సోషల్ మీడియాలో స్పందించింది. ప్రస్తుతం నయనతార టెస్ట్ అనే సినిమాలో నటిస్తోంది. స్పోర్స్ట్ బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రాన్ని శశికాంత్ తెరక్కిస్తు న్నాడు. వైనాట్ స్టూడియోస్ పతాకంపై చక్రవర్తి రామచంద్ర..శశికాంత్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తయిన సందర్భంగా సోషల్ మీడియా వేదకిగా నయనతార ఓ వీడియోని షేర్ చేసింది. ‘జీవితాన్ని ఆడించే టెస్ట్ ఆట ముగిసింది. ఈ వేసవికి థియేటర్లో కలుద్దాం’ అంటూ వ్యాఖ్యల్ని జోడిం చింది.
ఇంత మార్పు ఎలా!
ఆమె స్టార్ అయిన తర్వాత ఇప్పటివరకూ ఓ సినిమా గురించి ప్రచారం చేయలేదు. తొలిసారి ఓ సినిమా షూటింగ్ అప్ డేట్ ఇవ్వడం… రిలీజ్ ఎప్పుడు అవుతుందో ఆమె చెప్పడం ఇదే. దీంతో నయనతార ఈ కొత్త మార్పు ఏంటి? అంటూ అంతా ఆశ్చర్యపోతున్నారు. ఇంతకీ ఈ మార్పు ఈ ఒక్క సినిమాకేనా ఇకపై అన్ని సినిమాలకూ ఉంటుందా అన్నది వెయిట్ అండ్ సీ…