మొన్నటి వరకూ సైలెంట్ గా ఉన్న గుంటూరుకారం ఇప్పుడిప్పుడే ఘాటు పెంచుతోంది.సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ మూవీకి సంబంధించి రీసెంట్ గా ఓ మే బేబీ సాంగ్ రిలీజైంది. ఈ సాంగ్ విన్న నెటిజన్లు ట్రోలింగ్ మొదలెట్టారు. దీంతో రంగంలోకి దిగిన మహేష్ బాబు ఘాటు సరిపోలేదే అంటున్నాడని టాక్…
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు – స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మూవీ గుంటూరు కారం. శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్.రాధాకృష్ణ ఈ మూవీకి నిర్మాత. మహేష్ కి కలిసొచ్చిన సంక్రాంతి బరిలో దిగబోతోన్న గుంటూరుకారంపై బారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి దమ్ మసాలా బిర్యానీ.. ఎర్ర కారం… అర కోడి అంటూ ఫస్ట్ సింగిల్‌ను విడుదల చేయగా.. ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ అయింది. తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ సెకండ్ సింగిల్ ఓ మై బేబీ సాంగ్ విడుదల చేశారు. ఈ సాంగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రోల్ కి గురవుతోంది. పాట లిరిక్స్ చెత్తగా ఉన్నాయంటూ లిరిక్ రైటర్ రామ జోగయ్య శాస్త్రిని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఈ విషయంలో మహేష్ బాబు కూడా అసంతృప్తిగా ఉన్నట్లు టాక్. ఇప్పటికే త్రివిక్రమ్ తో డిస్కస్ చేశాడని డ్యామేజ్ కంట్రోల్ చేసేందుకు గురూజీ కూడా సాంగ్స్ పై ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్టు టాక్. త్వరలోనే ఫ్యాన్స్ కి ఫుల్ కిక్కిచ్చేలా మాంచి మాస్ సాంగ్ రాబోతోందని తెలుస్తోంది..
అయితే ఈ విషయాలపై మూవీ నిర్మాత నాగ వంశీ రియాక్టయ్యాడు. డియర్ సూపర్ ఫ్యాన్స్, మూవీ లవర్స్ గుంటూరు కారం సినిమాలో 4 పాటలు, ఒక బిట్ సాంగ్ ఉన్నాయి. ఇప్పటికే 3 సాంగ్స్, ఆ బిట్ సాంగ్ షూట్ అయిపోయింది. మిగిలిన సాంగ్ డిసెంబర్ 21 నుంచి షూట్ చేయబోతున్నాం. ఈ మధ్య సినిమాలోని సాంగ్స్‌పై వచ్చిన వార్తలు అన్నిఫేక్. సోషల్ మీడియాలో వచ్చే వార్తలు నమ్మకండి, వాళ్లు క్లిక్స్ కోసం అలాంటివి రాస్తుంటారు.. మేము సైలెంట్ గా ఉన్నాము అని మీరు స్ప్రెడ్ చేసే ప్రతి రూమర్ నిజమైపోదు అంటూ నాగ వంశీ పోస్ట్ చేశాడు. మొత్తానికి డిసెంబరులో మూవీ షూటీంగ్ కంప్లీట్ చేసి..రెండు వారాల పాటూ ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు. ఫైనల్ గా సంక్రాంతికి గుంటూరుకారం ఘాటు ఎలా ఉండబోతుందో చూడాలి…